Friday, September 21, 2012

TELUGU CHRISTIAN LYRICS 181 - 200

పాట:181
     మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము -2
    సృష్టికర్త ముక్తి ధాత - 2 మా స్తుతులకు పాత్రుడా..
    ఆరాధనా నీకే....ఆరాధనా నీకే ...
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...
1. మన్నాను కురిపించి నావు - బండనుండి నీళ్ళుచ్చినావు - 2
    యెహోవా యీరే చూచుకొనును - 2 సర్వము సమకూర్చును
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...     "మహిమ"
    2. వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు - 2
    యెహోవా రాఫా స్వస్థపరచును -2 నను స్వస్థ పరచును
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...     "మహిమ"

పాట:182   
   మహిమోన్నతుడు - మహిమా న్వితుడు
   మరణం గెల్చిన  - మృత్యుంజయుడు
   అద్వితీయుడు అతి సుందరుడు- అదిక జ్ఞాన సంపన్నుడు (2)
   ఆరాధనా  ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
   హల్లేలుయ హల్లేలుయ రాజుల రాజుకే హల్లేలుయా
1. సర్వము నెరిగిన సర్వాది కారి
    సర్వము చేసిన సర్వోపకారి  (2) 
    నీతిమంతుని ప్రేమించువాడు
    ఇశ్రాయేలును కాపాడు వాడు     || ఆరాధన ||
2. నిత్యం వశియించు అమరుడు ఆయనే
    మార్గం,సత్యం,జీవము ఆయనే  (2)
    నమ్మిన వారిని రక్షించువాడు
    నిత్య జీవం దయచేయువాడు     || ఆరాధన ||

పాట:183
     మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
     నాజీవిత ధన్యతై యున్నది
1.  మోడు బారిన జీవితాలను - చిగురింప చేయ గలవు నీవు
     మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
 2. ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు
     జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా..
3.  వాడబారని స్వాస్ధ్యము నాకై - పరమందు దాచితివా
     వాగ్ధాన ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా..


పాట:184
    మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది  - 2
    అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు    - 2
    పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని   - 2     || మానవుడా ||
1. పువ్వులెందుకు? కాయలెందుకు
    ఋతువులెందుకు కాలాలెందుకు
    ఉన్నవన్ని నీకోసమేనని - నీవు దేవునికోసమేనని 
    గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో   - 2
    నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ     || మానవుడా ||
2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు                              
    రాత్రులెందుకు? పగలు ఎందుకు?    -  2
    రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆదేవుని పని నీవు చేయాలని - 2
    ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి     - 2
    పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ               || మానవుడా ||


పాట:185
    మంచి కాపరి మాప్రభు యేసే....
    మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి
    మరణ మన్నను భయము లేదులే
    మదురమైన ప్రేమతో మమ్ము కాయులే
1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా
    శాంతి జలాల చెంత అడుగు వేయగా
    చేయివిడువకా తోడు నిలచును              
    నీతి మార్గమందు మమ్ము నడువజేయును  "మంచి"
2. అందకారలోయలో మా పయనంలో
    లేదులే మాకు భయం అభయం తానే
    ఆదరించును ఆశీర్వదించును
    అన్ని తావులయందు తానే తోడైయుండును  "మంచి"
3. శత్రువుల మధ్యలో మాకు భోజనం
    అభిషేకం ఆనందం కృపా క్షేమమే
    బ్రతుకు నిండగా పొంగి పొర్లగా
    చిరకాలం ఆయనతో జీవింపగా            "మంచి"


పాట:186
    మంచిగా పిలచినా నా యేసయ్యా
    నీ స్వరము నాకు ఎంతో ప్రీతి కరము  (2)
    పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
1. చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి
    పాపము నుండి నన్ను నీ సన్నిధిలోనికి (2)
    పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
2. లేమినుండి నన్ను నీ కలిమిలోనికి
    శాపము నుండి నన్ను సంవృద్ధిలోనికి  (2)
    పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
3. మట్టి నుండి నన్ను నీ మహిమలోనికి
    క్షయత నుండి నన్ను అక్షయతలోనికి    (2)
    పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)

పాట:187
     మంచి దేవుడు భలే మంచి దేవుడు 
     నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు 
1. మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలును
    కొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడు
    వెదికితే ప్రతి వారికి - దొరికేను యేసు
    పిలిచే ప్రతి వారికి - పలికేను యేసు
    బొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు       "మంచి"
2. కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడు
    మూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడు
    బధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడు
    ప్రేమా మయుడు  - ఆశ్చర్య దేవుడు           "మంచి"
3. చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెను
    అడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెను
    మరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెను
    ఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెను
    ఏమి చేతువో - సృష్టికర్త యేసుని               "మంచి"

పాట:188
       మధురం మధురం దైవ వాక్యం
       తేనెకన్న మధురం దేవుని వాక్యం
       చీకటి నిండిన వీదులలో
       కాంతిని వెదజల్లు దైవవాక్యం
అ.ప:జీవమున్న వాక్యం,జీవమిచ్చు వాక్యం
        దేవుని దివ్య వాక్యం...
1. ఖడ్గము కంటెను వాడిగలది
    ప్రాణాత్మలను విభజించెడి వాక్యం
    హృదయమునందలి చింతలను
    పరిశోదించెడి దైవ వాక్యం     "జీవమున్న"
2. నాహృదయములో దైవ వాక్యం
    పదిలపరచుకొని యున్నందున
    పాపములో...నే తడబడకుండ
    అడుగులు కాపాడు దైవ వాక్యం    "జీవమున్న"
3. కష్టములలోన దైవవాక్యం
    నెమ్మది నిచ్చి నడిపించును
    అలసిన,కృంగిన వేళలలో
    జీవింపచేయు దైవ వాక్యం         "జీవమున్న"


పాట:189
    మధురమైనది నా యేసు ప్రేమ
    మరపురానిది నా తండ్రి ప్రేమ "2"
    మరువలేనిది నా యేసు ప్రేమ "2"
    మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
    ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
1. ఇహలోక ఆశలతో అందుడనేనైతిని
    నీసన్నిది విడచి నీకు దూరమైతిని "2"
    చల్లనీ స్వరముతో నన్ను నీవు పిలచి"2"
    నీసన్నిదిలో నిలిపిన నీ ప్రేమ మధురం
    ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
2. పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పినా
    ఎగసిపడే అలలతో కడలే గర్జించినా  "2"
    మరణపు చాయలే ధరి చేరనీయక   "2"
    కౌగిట దాచిన నీ ప్రేమ మధురం
     ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
3. నీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
    మార్గమును చూపి మన్నించితివి  "2"
    మరణపు ముల్లును విరచిన దేవా "2"
    జీవము నొసగినా నీ ప్రేమ మధురం
    ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా

పాట:190
    మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
    సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద
1. ఎంత ఘోర పాపులనైన మార్చివేయును
   ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును
   యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం
2.ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
   ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో
   యేసు రక్త ధారలే క్షమా సహితము
3. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
   హింసయైన బాధయైన లేదు యే భయం
   యేసు మథుర నామమే రక్షణ కారణం

పాట:191
    మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై ఉండలేదు నీకు యేసయ్యా
    సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా
    మరుగై ఉండలేదు నీకు యేసయ్యా  -2
1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
    నిలకడలేని నా బ్రతుకును మార్చితివే - 2
    మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా
    మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా - 2    "మారని"
2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
    నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే - 2
    నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ
    నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా  - 2  "మరని"

పాట:192
    మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి
    మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి
1. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
    పశ్చాత్తాపమునొంది  తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము
    ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె దైర్యము  "మార్గము"
2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
    ధరణి భోగములెల్ల బ్రతుకు ద్వంసము చేసె దేవానిన్‌ చేరితి
    దేహియని నీవైపు చేతులెత్తిన  నాకు దారిని చూపుము         "మార్గము"
3. దూరదేశములోన భాగుండు ననుకొనుచు తప్పితి మార్గము
    తరలి పోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము 
    దాక్షిణ్యమూర్తి నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము     "మార్గము"
4. కొడుకునే కాదనుచు గృహమే చెరశాలనుచు కోపించి వెళ్ళితి
    కూలి వానిగనైన నీయింట పనిచేసి కనికరమే కోరుదు
    కాదనకు నాతండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము   "మార్గము"
5. నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచే నా పైబడి ఏడ్చెను
    నవ జీవమును కూర్చి ఇంటికితోడ్కొనివెళ్ళి నన్ను ధీవించెను
    నాజీవిత కథయంతా యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమైయుండును "మార్గము"


పాట:193
      మణులు మాణిక్యములున్న - మేడమిద్దులు యెన్నున్న
      మధిలో యేసు లేకున్నా - ఏది వున్న అది సున్నా
1. చదువులెన్నో చదువున్నా - పదవులెన్నో చేస్తున్నా
    విద్యవున్న బుద్ధివున్న - జ్ణానమున్నా అది సున్నా "మణులు"
2. అంద చందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నా
    సుందరుడు ప్రభు లేకయున్నా - అందమున్నా అది సున్నా "మణులు"
3. రాజ్యములు రమణులువున్నా - శౌర్యములు వీర్యములున్నా
    బలము వున్న బలగమున్నా - ఎన్ని యున్నా అవి సున్నా "మణులు"
4. పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్య కార్య సిద్ధుడా
    దాన ధర్మము తపము జపము - యేసు లేనిది అది సున్నా

పాట:194   
    మాయాలోకం మాయాలోకం
    మారి పోకు నేస్తం - మారిపోకు నేస్తం "2"
    రంగు రంగులు అవిచూపించునురా
    కంటికింపుగా అవి కని పించునురా "2"
1.  అందమైనవి సౌధర్యమైనవి
    మోసకరమని బైబిలు చెప్పెను
    మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం "2"
    మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం  "2"
2. పరలోకమనేది ప్రభువుండేది
    మాయలేనిది అది నిత్య రాజ్యము  "2" 
    పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం "2"
    మాయాలోకం మాయాలోకం - మారిపోకు నేస్తం  "2"


పాట:195
      మహిమగల తండ్రి - మంచి వ్యవసాయకుడు
      మహితోటలో నర మొక్కలు నాటించాడు 
      తన పుత్రుని రక్తనీరు - తడి కట్టి పెంచాడు
      తన పరిశుద్ధాత్మను - కాపుగావుంచాడు (2)
      కాయవే తోట - కమ్మని కాయలు
      పండవే చెట్టా - తియ్యని ఫలములు    "కాయవే"
1.   నీతి పూత జాతికాపు - ఆత్మశుద్ది ఫలములు
      నీ తండ్రి నిల్వచేయు - నిత్య జీవ నిదులు
      అనంతమైన ఆత్మ బందు - అమరసుఖ శాంతులు
      అనుకూల సమయిమిదే - పూయు పరమ పూతలు (2)   "కాయవే"
2.  అపవాది కంటబడి - కుంటుబడి పోకు
      కాపు పట్టి చేదు పండ్లు - గంపలుగా కాయకు
     వెర్రిగా చుక్కలంటి - ఎదిగి విర్రవీగకు
     అదిగో గొడ్డలి వేరున - పదును పెట్టియున్నది (2)   "కాయవే" 
3.  ముద్దుగా పెంచాడు - మొద్దుగా నుండకు
     ముదముతో పెంచాడు - మోడుబారిపోకు
     ముండ్ల పొదలలో కృంగి - మెత్తబడిపోకు
     పండ్లుకోయువాడు వచ్చి - అగ్నివేసి పోతాడు


పాట:196
    మహిమ నీకే ప్రభూ - ఘనతనీకే ప్రభూ
    స్తుతియు,మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ
    ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా - ఆరాధనా
    ప్రియ యేసు ప్రభునకే- నా యేసు ప్రభునకే
1. సమీపింపరాని తేజస్సు నందు – వశియించు అమరుండవే
    శ్రీమంతుడవే- సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే      "ఆరాధ"
2.ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
   విలువైన రక్తం చిందించి – నన్ను   విమోచించితివే         "ఆరాధ"
3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే
    నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే   "ఆరాధ" 

పాట:197
     మహిమ ఘనతకు అరుహుడవు నీవే నాదైవము -2
    సృష్టికర్త ముక్తి ధాత - 2 మా స్తుతులకు పాత్రుడా..
    ఆరాధనా నీకే....ఆరాధనా నీకే ...
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...
1. మన్నాను కురిపించి నావు - బండనుండి నీళ్ళుచ్చినావు - 2
    యెహోవా యీరే చూచుకొనును - 2 సర్వము సమకూర్చును
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...     "మహిమ"
    2. వ్యాధులను తొలగించినావు - మృతులను మరి లేపినావు - 2
    యెహోవా రాఫా స్వస్థపరచును -2 నను స్వస్థ పరచును
    ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా నీకే -2
    ఆరాధన నీకే....ఆరాధన నీకే ...     "మహిమ"


పాట:198   
   మహిమోన్నతుడు - మహిమా న్వితుడు
   మరణం గెల్చిన  - మృత్యుంజయుడు
   అద్వితీయుడు అతి సుందరుడు- అదిక జ్ఞాన సంపన్నుడు (2)
   ఆరాధనా  ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
   హల్లేలుయ హల్లేలుయ రాజుల రాజుకే హల్లేలుయా
1. సర్వము నెరిగిన సర్వాది కారి
    సర్వము చేసిన సర్వోపకారి  (2) 
    నీతిమంతుని ప్రేమించువాడు
    ఇశ్రాయేలును కాపాడు వాడు     || ఆరాధన ||
2. నిత్యం వశియించు అమరుడు ఆయనే
    మార్గం,సత్యం,జీవము ఆయనే  (2)
    నమ్మిన వారిని రక్షించువాడు
    నిత్య జీవం దయచేయువాడు     || ఆరాధన ||

పాట:199
     మహోన్నతుడా నీ కృపలో నేను జీవించుట
     నాజీవిత ధన్యతై యున్నది
1.  మోడు బారిన జీవితాలను - చిగురింప చేయ గలవు నీవు
     మారా అనుభవం మధురముగా మార్చ గలవు నీవు
 2. ఆకు వాడక ఆత్మ ఫలములు ఫలియింప చేయగలవు నీవు
     జీవ జలముల ఊటయైనా - నీ ఓరను నను నాటితివా..
3.  వాడబారని స్వాస్ధ్యము నాకై - పరమందు దాచితివా
     వాగ్ధాన ఫలము అనుభవింప - నీ కృపలో నన్ను పిలచితివా..


పాట:200
    మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది  - 2
    అర్ధం తెలియక నీవు - వ్యర్ధంగా బ్రతుకకు    - 2
    పరమార్ధమున్నదని - ప్రభుకొరకే బ్రతకమని   - 2     || మానవుడా ||
1. పువ్వులెందుకు? కాయలెందుకు
    ఋతువులెందుకు కాలాలెందుకు
    ఉన్నవన్ని నీకోసమేనని - నీవు దేవునికోసమేనని 
    గమనించి తెలుసుకో - గ్రహియించి మసలుకో   - 2
    నీ జన్మకు కారణముందీ - నీ జన్మకు కారణముందీ     || మానవుడా ||
2. సూర్యుడెందుకు? చంద్రుడెందుకు                              
    రాత్రులెందుకు? పగలు ఎందుకు?    -  2
    రాత్రి పగలు దేవుడే చేసెనని - ఆదేవుని పని నీవు చేయాలని - 2
    ప్రభువును ప్రకటించి - పాపిని రక్షించి     - 2
    పరలోకం చేర్చాలనీ - పరలోకం చేర్చాలనీ               || మానవుడా ||




No comments:

Post a Comment