Tuesday, September 4, 2012

TELUGU CHRISTIAN LYRICS 21 - 40


పాట:21 
     ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా  (2)
     ఇకను కూడా మాకు తోడు నీడ నీవేగదా (2) " ఇంతకాలం"
1. ఎన్ని ఏళ్ళు గడచినా... ఎన్ని తరాలు మారినా...
    మారని వీడని ప్రేమే నీదయ్యా
    మార్చినా నాజీవితం నీకే యేసయ్యా "2"   "ఇంతకాలం"
2. నీవుచేసిన మేలులు తలంచు కొందును అనుదినం (2)
    నాస్తుతి స్తోత్రముల్‌ నీకే యేసయ్యా
    వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా  "2"  " ఇంతకాలం"  
3. దూరమైతిరి ఆప్తులు విడచి పోతిరి నాహితులు
    సోధన వేధన తీర్చిన యేసయ్యా
    తల్లిలా తండ్రిల కాచిన యేసయ్యా   "2"  " ఇంతకాలం"

పాట:22
   ఇది కోతకు సమయం - పని వారి తరుణం ప్రార్ధన చేయుదమా
   పైరును చూచెదమా పంటను కోయుదమా           "ఇదికోతకు"
1. కోతెంతో విస్తారమాయెను కోతకు పనివారు కొదువాయెనే
    ప్రభు యేసు నిధులన్ని నిలువాయెనే  (2)   "ఇదికోతకు"
2. సంఘమా మౌనము ధాల్చకుమా - కోసేటి పనిలోన పాల్గోందుమా 
    యజమాని నిదులన్ని నీకేగదా  (2) "ఇదికోతకు"
3. శ్రమలేని ఫలితంబు నీకియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా
    జీవార్ధ ఫలములను భుజియింపవా  (నిత్య )  (2) "ఇదికోతకు"

పాట: 23
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక -2
    యేసులాగా ఉండాలని - యేసుతోనే నడవాలని -2
    నిలవాలనీ గెలవాలనీ-2 యేసుతోనే ఉండి పోవాలని
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
1. ఈ లోకములో పరలోకంలో - నీతోనే నివసించాలని
    ఇంటా బయటా యేసునాధుని - కంటి పాపనై వెలిగి పోవాలని -2
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
2. యాత్రను ముగించిన వేళ - ఆరోహణమై పోవాలని -2
    క్రీస్తు యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని - 2
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక

పాట:24
     ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం
     శరణం ..........నీ చరణం...........   "ఇదిగో"
1. పలుమార్లు వైదొలిగినాను - పరలోక దర్శనము నుండి
    విలువైన నీ దివ్య పిలుపునకు - తగినట్లు జీవించనైతి
    అయినా నీ ప్రేమతో - నన్ను దరిచేర్చినావు
    అందుకే గైకొనుము దేవా - ఈ నా శేషజీవితం   - 2
2. నీ పాదములచెంత చేరి - నీ చిత్తంబు నే నెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పని చేయనిమ్ము
    ఆగిపోక సాగిపోవు ప్రియ - సుతునిగా పని చేయనిమ్ము
    ప్రతి చోట నీసాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము   - 2
3. విస్తార పంట పొలము నుండి- కష్టించి పనిచేయ నేర్పు
    కన్నీటితో విత్తు మనసు - కలకాలం మరి నాకు నొసగు
    క్షేమ క్షామ కాలమైన నిన్ను - ఘనపరచ బ్రతుకు నిమ్మయ
    నశియించు ఆత్మలన్‌ నీ - దరి చేర్చ కృపనిమ్మయ   - 2

పాట:25
   ఇదిగో దేవుని గొర్రెపిల్ల - ఇవేగా మా కృతాజ్ఞత స్తుతులు   
   అర్హుడవు  అర్హుడవు  గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు
   రక్తమిచ్చి, ప్రాణమిచ్చి - నీదు ప్రజలను కొనినావు
   అర్హుడవు  అర్హుడవు గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు
   మహిమయు, ఘనతయు - నీకే చెల్లును ఎల్లప్పుడు         "ఇదిగో"
1.పాపమునంతా పోగొట్టి - ప్రాచీన స్వభావము తొలగించి
   సిలువ శక్తితోనే - నూతన జీవులుగా మార్చెను ఆ..       " అర్హుడవు "
2. దేవుని ప్రేమ విస్తరింపగా - కృపావరమునే దానముగా
   యేసుక్రీస్తులోనే - నీతిమంతులుగా మార్చెను ఆ..         " అర్హుడవు "
3. దేవునికి ఒక రాజ్యముగా - యాజకులనుగా చేసితిని
    క్రీస్తుతో రాజ్యమేలగ - జయించు వానిగా మార్చును ఆ.. " అర్హుడవు "  

పాట:26
    ఈ దినం సదా - నా యేసుకే సొంతం
    నా నాధుని ప్రసన్నత - నాతోడ నడచును
    రానున్న కాలము - కలత నివ్వదు
    నామంచికాపరీ సదా - నన్ను నడుపును  "ఈ"
1. ఎడారులు లోయలు ఎదురు నిలచిన
    ఎన్నడెవరు నడువని బాటయైనను
    వెరవదెన్నడైనను నాదు హృదయము
    గాయపడిన యేసుపాదం అందు నడచెను   "ఈ"
2. ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
    యుద్ధకేక నా నోట యేసు నామమే
    విరోదమైన  ఆయుధాలు యేవిఫలించవు
    యెహోవా నిస్సియే నాదు విజయము      "ఈ"

పాట:27
   ఈ లోకం నీది కాదు - శాశ్వతము అసలు కాదు - 2
   ఈ జీవం నీది కాదు - శాశ్వతము అసలు కాదు - 2
1. నీ ధనము ఘనము మాయ - నీ చదువు పదవి మాయ - 2
    నీకు ఉన్నవి అన్ని క్షయము - ప్రభు యేసే నిత్యజీవం              "ఈలోకం"
2. నీ అందము చందము మాయ - నీ దేహము ప్రాణము మాయ - 2
    భాంధవ్యం అన్ని క్షయము - ప్రభు యేసే అక్షయము              "ఈలోకం"
3. నీ తనువు మంటికి మన్నై - పోవును ఎపుడో ఎరుగవు - 2
    ప్రభు చెంతకు చేరుము ఇపుడే - ప్రభు రాజ్యం నీది అగును        "ఈలోకం"
4. కనిపించేదంత మాయ – కనుగొనుము నిత్య మోక్షం - 2
    పరుగిడుమా ప్రభుని చెంతకు - ప్రార్ధించు రక్షణ కొరకు           "ఈలోకం"
5. ప్రభు యేసు పరమునుండి - నీకొరకే భువికి వచ్చేన్‌ - 2
    కల్వరిలో ప్రాణము ఇచ్చి - మృత్యువునే గెల్చి లేచెన్‌                "ఈలోకం"


పాట 28
   ఎవరు నన్ను చేయి విడచినన్‌ -  యేసు చేయి విడువడు    "2"
   చేయి విడువడు - చేయి విడువడు - చేయి విడువడు నిన్ను చేయి విడువడు
1. తల్లి ఆయనే తండ్రి ఆయనే - లాలించును పాలించును     "2"        "ఎవరు"
2. వేదన శ్రమలూ ఉన్నప్పుడెల్లా - వేడు కోందునే కాపాడునే 2"         "ఎవరు"  
3. రక్తముతోడా కడిగి వేసాడే - రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే   "2"   "ఎవరు"  
4. ఆత్మ చేత అభిషేకించి - వాక్యముచే నడుపుచున్నాడే   "2"             "ఎవరు"  

పాట:29
     ఎగురుచున్నది విజయ పతాకం
     యేసు రక్తమే మా జీవిత విజయం
     రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
     సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును
     రక్తమే - రక్తమే - రక్తమే - యేసు రక్తమే
     రక్తమే జయం - యేసు రక్తమే జయం 
1. యేసునినామం ఉచ్చరింపగనే - సాతాను సైన్యము వణుకు చున్నది 
    వ్యాధుల బలము నిర్మూలమైనది
    జయం పొందెడి నామము నమ్మినప్పుడే          "రక్తమే"
2. దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం - ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం
    పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
    క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం   "రక్తమే"
3. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా - ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
    నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
    స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే      "రక్తమే"

పాట 30
    ఎన్న తరమా నీ కృపలను - ఎన్న తరమా నీవు చేసిన మేళులు
    ఎన్న తరమా నీ ఆలోచనలను - ఎన్న తరమా నా దైవమా       "2"
    పూజించి కీర్తింతునూ - ఆరాధించి ఆర్భాటింతును
1. నీ సన్నిదిలో సంతోషమిచ్చావు - నీ సన్నిధిలో నిరీక్షణిచ్చావు
    నీ సన్నిధిలో ధర్శనమిచ్చావు - విడుదలనిచ్చావు                   "2"
    వాగ్ధానమిచ్చి కన్నీరుతుడిచి - నీ బిడ్డగా ఉండు భాగ్యమిచ్చావు  "2" " పూజి"
2. నీకృపయే రక్షణకాదారం - నీకృపయే నాకున్న దైర్యం
    నీ కృపయే నీకున్న సుగుణం - నీవే నా అతిశయమూ            "2"
    నీ ప్రేమ మధురం నీప్రేమ అమరం - నీకృపయే నన్ను బ్రతికించెను  "2"  " పూజి"

పాట:31 
    ఎంత మధురము యేసుని ప్రేమా -
    ఎంత మధురము నా యేసుని ప్రేమ..
    ప్రేమా....ప్రేమా.....ప్రేమా.....ప్రేమా....
1. అందకార బంధము నన్నావరించగా -
    అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని
   (బంధము తెంచెను - బ్రతికించెను నన్ను)  "ఎంత" 
2. రక్షించువారు లేక పక్షినైతిని
    భక్షకుడు భాణము గురి పెట్టియుండెను "బంధము"
3. ఎన్నో పాపములు చేసి మూటకడితినీ
    ఎన్నో దోషములు చేసి దోసినైతిని         "బంధము"
4. కుష్టు బ్రతుకుతో నేను కృంగియుండగా
    బ్రష్టుడనైన నన్ను బ్రతికించితివి           "బంధము" 

పాట:32
    ఎన్ని తలచినా ఏది అడిగినా - జరిగేది నీ చిత్తమే ప్రభువా ! (2)
    నీ వాక్కుకై వేచి యుంటిని - నాప్రార్ధన  ఆలకించుమా ! (2)
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక - ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు (2)
    అడవిపూవులే  నీ ప్రేమ పొందగా (2)
    నాప్రార్ధన  ఆలకించుమా ప్రభువా - నాప్రార్ధన  ఆలకించుమా     "ఎన్ని"
2. నా ఇంటి దీపం, నీవేయని తెలసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి (2)
    ఆరిపోయినా నావెలుగు దీపము (2)
   వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా - వెలిగించుము నీ ప్రేమతో       "ఎన్ని"
3. ఆపదలో నన్ను వెన్నంటి యున్న - నాకాపరివై నన్ను ఆదు కొంటివి
    లోకమంతయు నన్ను విడచినా (2)
    నీ నుండి వేరు చేయవు ప్రభువా - నీ నుండి వేరుచేయవు           "ఎన్ని"
4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి - నా కొరకై కలువరిలో యాగమైతివా
    నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
    నీ యందే నిత్య జీవము ప్రభువా - నీయందే నిత్య జీవము       "ఎన్ని"


పాట:33
    ఎవరో  తెలుసా యేసయ్యా - చెబుతా నేడు వినవయ్యా
    పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి  - రక్షణ పొందవయ్యా
1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా
    మరణించాడు మరి లేచాడు - నీనా పాప విమోచనకై               "ఎవరో"
2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
     రూపు రేఖలు కోల్పోయాడు - నీనా పాపవిమోచనకై                "ఎవరో"
3. పాపుల రక్షకుడేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
    తన ధరి చేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో          "ఎవరో"
4. యేసే దేవుడు ఎరుగవయ్యా - రాజులరాజుగా వస్తాడయ్యా
    నమ్మినవారిని చేర్చును పరమున - నమ్మని వారికి నరకమేగా      "ఎవరో"
5. యేసుని తరుపున ప్రతినిధినై - దేవుని ప్రేమకు ప్రతిరూపమై
    అతి వినయముగా బతిమాలుచున్నాను - నేడే నమ్ముము ప్రభు యేసుని "ఎవరో"

పాట:34
     ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము   - 2
     నీకోసమే నాకోసమే కలువరి పయనం
     ఈ కలువరి పయనం ....."ఎవరికోసమో"
1. ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందా
    ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా   - 2
    మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో
    తడబడుతూ పోయావా... - సోలి వాలి పోయావా....
2. జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాము
    జీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము
    మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా
    నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి
 *తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు *
    అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని


పాట:35
    ఆ.........................ఆ.............
    ఎన్నాళ్ళు ఎదురీత నా యేసువా - ఎన్నేళ్ళ యెదకోత నా ప్రభువా
    కలనైన నిన్ను నే వీడిపోను - నా నేస్తమై నీవురా..నా నీడవై నిలువరా
1. కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా - కష్టాల కనుమల్లో నే కూరుకోగా
    నీ చేతి నందించి నను లేపుమా - యెదలోని చీకట్లు ఇక మాపుమా
    రా... రా... నాజీవమా...నీవే నాదైవమా...
2. పాపల్లే అడుగేస్తు నీ చెంతకొచ్చా - రెప్పల్లే నను నీవు కాపాడు స్వామి
    నాలోని శాపాలు తొలగించవా - నా సూన్య బంధాలు చెరిపేయవా
    దేవా... మన్నించవా...రావా...దయచూపవా...

పాట:36
    ఎందుకో...నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లేలూయ యేసయ్యా - 2
1. నా పాపము బాప నర రూపివైనావు -
    నా శాపము బాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే - 2
2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు
    నీ పోలికలోనే నివశించమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీ కొరకై నీకృపలో - 2
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలుభరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చేర్చుకొన్నావు - నను దాచియున్నావు - 2
4. నా మనవులు ముందే నీమనసులో నెరవేరే
    నా మనుగడముందే నీగ్రంధములో నుండే
    యేమి అద్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతు  - 2
5. నీ చేతులతోనే నన్ను చేసి యున్నావు
    నీ గాయములోనే నను దాచి యున్నావు
    నీదు సేవను చేయుచున్నాను - నీ కొరకై జీవింతున్‌



పాట:37
     ఎంతమంచిదేవుడ వేసయ్యా  “2”
    చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా
    నా చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా
1. గోరపాపినైన నేనూ నీకు దూరంగా పారిపోగ “2”
    నీప్రేమతో నన్ను క్షమియించీ నన్ను హత్తుకొన్నావేసయ్యా  “2”
2. నాకున్నవారందరూ నన్ను విడచిపోయిననూ “2”
    నన్నెంతోఇబ్బందులకు గురిచేసినా నన్ను నీవు విడువలేదయ్యా“2”
3. నీవు లేకుండ నేనూ ఈలోకంలో బ్రతుకలేనయ్యా “2”
    నీతో కూడా ఈలోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా  “2”

పాట:38
    ఏమని వివరింతు నీ ప్రేమ - ఏమని వర్ణింతు నీ మహిమ
    హల్లెలూయ - ఆమేన్‌ హల్లెలూయ యేసయ్యా - యేసయ్యా - 2
1. యేసు జననమే వసంతమూ - యేసులో వేదాంతము - 2
    వేదాంతము - వసంతము                                   "హల్లెలూయ"
2. యేసు మరణమే నిశాంతమూ - యేసులో ప్రశాంతమూ - 2
    ప్రశాంతమూ - నిశాంతమూ                               "హల్లెలూయ"
3. కలవరియాగమే లోకకళ్యాణము - శిలువరుధిరమే పాపపరిహారము - 2
    పరిహారము - కళ్యాణము                                   "హల్లెలూయ"


పాట:39
    ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో
    నేరములెంచని వాడా - నాదు నజరేయుడా
    తీరము దాటిన వాడా - నాదు గలలీయుడా
    నాప్రాణ నాధుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా  "ఏరీతి "
1. వెదకినను, ఇల చేరితివి - వెంబడించగ పిలచితివి
    రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి          "నాప్రాణ"
2. మహిమ నగరిని విడిచితివి - మంటి దేహము దాల్చితివి
    సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి                  "నాప్రాణ"
3. ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా
    ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతించుచు సాగెదను                 "నాప్రాణ"

పాట: 40
    ఎందరో! ఎందరు ఏందరో!!  యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు
    రాయబారులై బారులుతీరి తరలండి - క్రీస్తుకు రాయబారులై సిలువధ్వజం చేబూనండి - 2
    వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి  "ఎందరో"

1. పల్లె పల్లిలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం - 2
    వాగులు వంకలే దాటుదాం యేసు శిలువ ప్రేమనే చాటుదాం - 2
    వందలు వేలు ఏళ్ళుగడుస్తున్నాయి - సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి  "ఎందరో"

No comments:

Post a Comment