పాట:111
నిరంతరం
నీతోనే జీవించాలనే - ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నాప్రాణేశ్వరా
యేసయ్యా - నా సర్వస్వమా...యేసయ్యా..
1. చీకటిలో
నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను
నీలోనే నేను
వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ
అభిషేకముతో - నన్ను నింపుచున్నావు- నీ రాకడకై..
2. నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను
నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ
వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై..
3. తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే
చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ
వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై.
పాట:112
నిన్నే
ప్రేమింతును - నే వెనుతిరుగా
నీ సన్నిదిలో
మోకరించి - నీ మార్గములో సాగెదా
నీరసించక
సాగెదా నే వెనుతిరుగా "2"
1. నిన్నే ఆరాధింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"
2. నిన్నే కీర్తింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"
3. నిన్నే ప్రార్ధింతును - నే వెనుతిరుగా "నీ సన్నిదిలో"
4. హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా
నీ సన్నిదిలో
మోకరించి - నీ మార్గములో సాగెదా
పాట:113
నీవు చేసిన
ఉపకారములకు నేనేమి చెల్లింతును
ఏడాది దూడలనా? - వేలాది పొట్టేళ్ళనా? (2)
"నీవు”
1. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2)
గర్భఫలమైన
నాజేష్ట పుత్రుని నీకిచ్చినా చాలునా (2)
"ఏడాది"
2. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో (2)
కరుణ జూపి నీ
జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2)
"ఏడాది"
3. విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను
చేబూని నిత్యము నిను వెంబడించెదను (2)
"ఏడాది"
4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? (2)
కపట నటనాలు
చాలించి నిత్యము నిను వెంబడించెదను (2) "ఏడాది"
పాట:114
నీ జీవితములో
గమ్యంబు ఏదో - ఒకసారి యోచింపవా?
ఈ నాడే నీవు
ప్రభు యేసు కొరకు - నీ హృదయ మర్పించవా?
1. నీ తల్లి గర్బమున నీ వుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు
(2)
యోచించి నావా
ఏరీతి నిన్ను - నిర్మించే తన చేతులు
"నీ జీవిత"
2. నీ లోన తాను నివసింపగోరి - దినమెల్ల చే జాచెను (2)
హృదయంబు తలపు - తెరువంగ
లేవా యేసు ప్రవేశింపను "నీ
జీవిత"
3. తన చేతులందు హృదయంబు ధారల్ - స్రవియించె నీకోసమే (2)
భరియించే శిక్ష
నీ కోసమేగా - ఒకసారి గమనించవా? "నీ జీవిత"
4. ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి - సమయంభు ఈ నాడేగా (2)
ఈ చోటు నుండి
ప్రభు యేసు లేక - పోభోకుమా సోదరా
"నీ జీవిత"
పాట:115
నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ?
నీలా
క్షమియించెదెవరు ? యేసయ్యా
నీలా పాపికై
ప్రాణం పెట్టిన వారెవరూ? "2"
1. వెండి బంగారము ధన ధాన్యాలను - ఒక్కపోగేసిన నీతో సరితూగునా “2"
జీవనదులన్నియూ
సర్వసముద్రములు - ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా
నీలా జాలిగల
ప్రేమగల దేవుడేరి - నీవేగా మంచి దేవుడవు
"2" " నీతో"
2. పలు వేధాలలోమత గ్రందాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు “2"
పాప పరిహారము
సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు
నీలా పరిశుద్ద
దేవుడెవరున్నారయ్యా - నీవేగా విమోచకుడవు
"2" "నీతో"
3. నేను వెదకాకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా
నన్ను ప్రేమించితివి "2"
నీకు గాయాలుచేసి
తరచు రేపితిని - నన్నెంతో సహించి క్షమియించితివి
లోక సౌఖ్యాలన్నీ
ఒక చోట - కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడవు "2" "నీతో”
పాట: 116
నీ వాక్యమే
నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది
నిచ్చెను
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమైయున్న
యేసు వందనమయ్యా
1. జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై
నన్ను నిలిపెను
నా పాదములకు
దీపమాయెను
సత్యమైన
మార్గములో నడుపుచుండెను (2) "నీవాక్య"
2. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
అపవాది వేయుచున్న అగ్ని భాణములను
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది (2) "నీవాక్య"
3. పాల వంటిది జుంటె తేనె వంటిది
నా జిహ్వకు - మహా మధురమైనది
మేలిమి బంగారుకంటే మిన్నయైనది
రత్న రాశులకన్న కోరతగినది (2)
"నీవాక్య"
పాట:117
నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ
వుంటే చాలు – నాకూ
1.
యెహోవా యీరే – చూచుకొనునూ – నీ వుంటే
చాలు నాకు
యెహోవా రాఫా – స్వస్థత నిచ్చు – నీ గాయమే బాగు చేయున్
యెహోవా షమ్మా - తోడై యుండె –
అక్కర, లన్నీ తీర్చు
2.
యెహోవా ఎలోహీం – సృష్టికి కర్తవు – నీ
వాక్కుచే కలుగు ప్రభూ
యెహోవా ఎల్ యోన్ - మహోన్నతుడ – నీ వంటి వారెవరు
యెహోవా షాలోం – శాంతిప్రదాత – నా హృదిలో రమ్ము దేవా
3.
యెహోవా ఎల్ ష డాయ్ – శక్తి సంపూర్ణుడా – నా బలము నీవే కదా
యెహోవా రొయీ – కాపరి నీవే – నన్ను కాయుము కరుణామయా
యెహోవా నిస్సీ – జయమిచ్చు దేవా – నా అభయము నీవే ప్రభూ
4.
యెహోవా సిద్కెను – నీతి మయుడా – నీ
నీతి చాలు ప్రభువా
యెహోవా మెక్ దిష్క్ మ్ – పరిశుద్దుడవు – మము పరిశుద్ద పరచుమయా
యెహోవా శాబోత్ – సైన్యములకు – అధిపతియగు దేవా
5.
యెహోవా హోసేను – పాలించు దేవుడా – మేము
పాలించు ప్రజలము
యెహోవా ఎల్ హీను – ఓ మా ప్రభువా – నీవు మా దేవుడవు
యెహోవా ఎల్ హెక్ – ఓ నీ ప్రభువు – నీ యొక్క దేవుడు
యెహోవా ఎల్ హే – ఓ నా ప్రభువా – నీవు నాకు దేవుడా
పాట : 118
నీ చేతితో
నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో
శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము
1. అంధ కారా లోయలోన
సంచరించిన భయములేదు
నీ వాక్యం
శక్తి గలది - నాత్రోవకు నిత్య వెలుగు (2)
2. ఘోర పాపిని నేను
తండ్రి - పాప ఊబిలో పడియుంటిని
లేవ నెత్తుము
శుద్ది చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2)
3. ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము
నీదు ఆత్మను - జీవితాంతం నీ సేవచేసెదన్
పాట:119
నీటి వాగుల
కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు
నాప్రాణము దప్పిగొనుచున్నది
నా ప్రాణమా నా
సమస్తమా- ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన
మేళ్ళను నీవు మరువకుమా
1. పనికిరాని నన్ను నీవు పైకిలేపితివి
క్రీస్తనే
బండపైన నన్నునిలిపితివి (2)
నా అడుగులు
స్థిరపరచి బలము నిచ్చితివి
నీదు అడుగు
జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు
ప్రభు "నాప్రాణమా"
2. అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము
రాకుండా నన్ను నడిపితివి (2)
కంటి పాపగ నీవు
నన్ను కాచితివి
కన్న తండ్రివి
నీవని నిన్ను కొలిచెదను
ఇలలో నిన్ను
కొలిచెదను "నాప్రాణమా"
3. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలములు
దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన
మేళ్ళను నేనెట్లు మరతు ప్రభు
నీ కొరకు నే
సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో
జీవింతును "నాప్రాణమా"
పాట:120
నీవ్వుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను
వుంటానేసయ్యా -2
నీ మాట చాలయ్యా
- నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా
- నీ నీడ చాలయ్యా
1. ఎన్ని భాధలున్నను - ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చిన
- నిష్టూరమైననూ "నీ మాట"
2. బ్రతుకునావ పగిలిన - కడలి పాలైనను
అలలు
ముంచివేసినా - ఆశలు అణగారిన "నీ
మాట"
3. ఆస్తులన్నీ పోయిన - అనాధిగా మిగిలిన
ఆప్తులే
విడనాడినా - ఆరోగ్యం క్షీణించినా
"నీ మాట"
4. నీకు ఇలలో ఏదియు - లేదు
అసాద్యము
నీదు కృపలో
మాకేదియు - కాదిల సమానము "నీ మాట"
పాట: 121
నీకున్న భారమంత
ప్రభుపై నుంచు - కలవర చెందకుమా..
ఆయనె నిన్ను
ఆధరించునూ - అద్భుతములు చేయున్
1. నీతి మంతులను కదలనీయడు - నిత్యము కాచి నడిపించును
2. మనలను కాచే దేవుడాయనే - మనకునీడగా ఆయనే ఉండును
3. తల్లి తండ్రి విడచినను - ఆయనే మనలను హత్తుకొనును
4. ప్రభువు మన పక్షమైయుండగా - ఎదురు నిలువ గల వాడెవ్వడు
5. ప్రభుకు జీవితం సమర్పించెదం - ఆయనే అంతా సఫలం చేయును
6. మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా
ఆయనే మనలను
ఆధరించును - అద్భుతములు చేయును..
పాట:122
నీధనము నీఘనము ప్రభు యేసుదే
నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా
1. ధరలోన ధన ధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు
కొరకీయ వెనుదీతువా "నీధన"
2. పాడిపంటలు ప్రభువు నీకియగా - కూడుగుడ్డలు నీకు దయచేయగా
వేడంగ ప్రభుయేసు నామంబును - గడువేల
ప్రభుకీయ ఓ క్రైస్తవా "నీధన"
3. వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభునీకు ఉచితంబుగా
వెలిగించ ధరయందు ప్రభు నామము -
కలిమి కొలది ప్రభునకర్పించవా "నీధన"
4. కలిగించే సకలంబు సమృద్దిగా - తొలగించె పలుభాధ భరితంభులు
బలియాయె నీపాపముల కేసుడు - చెలువంగ
ప్రభుకీయ చింతింతువా "నీధన"
5. పరిశుద్ద దేవుని మంధిరమున్ - పరిపూర్ణముగాను యోచించుడి
పరిశుద్ధ బాగంబు విడదీయుడి -
పరమాత్మ దీవెనలను బొందుడి
"నీధన"
పాట:123
నీకన్నా
లోకాన నా కెవరున్నారయ్యా
నాకున్న తోడు
నీడ నీవే యేసయ్యా
1. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా
ప్రాణం బెట్టిన
దేవుడవు నీవే యేసయ్యా
2. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా
జీవం ఉన్న
దేవుడవు నీవే యేసయ్యా
3. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా
రక్తం కార్చిన
దేవుడవు నీవే యేసయ్యా
4. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా
అన్నీ తెలిసిన
దేవుడవు నీవే యేసయ్యా
పాట:124
నీ రాజ్యం శాశ్వాత
రాజ్యం నీ పరిపాలన తర తరములు నిలుచును
అది యేసు రాజ్యం పరలోక రాజ్యం నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం
1. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు
ధన్యులు ధన్యులు
నీతి నిమిత్తం
హింసింహబడువారు ధన్యులు ధన్యులు
పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది "2" "అది
యేసురాజ్యం"
2. ఆకలే లేదు
ధాహమూలేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును
ధుంఖమూ లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని
మనకు ఇచ్చును
ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా "2" "అది యేసురాజ"
పాట:125
నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా
నీవే మా దేవుడవు యేసయ్యా
యేసయ్య....... నా యేసయ్యా
1. తీసావు నన్ను నేల నుండి - చేసావు నీదు రూపంబులో ఆ.... ఆ
నీ జీవ ఆత్మను నా కొసగినావు - జీవింప జేసిన జీవాథిపతివి
2. దీనులను పైకి లేవనెత్తువాడవు - బీదలను కనికరించు దేవుడవు నీవు ఆ... ఆ
నీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి - ఆదరించు కాపాడు దేవుడవు నీవు
3. మరణము నుండి నా ప్రాణమున్ - కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ ఆ... ఆ
జారి పడకుండా నా పాదములను - రక్షించువాడవు నీవే యేసయ్యా
పాట:126
నీ ముఖము
మనోహరము - నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ
ప్రియుడా - మనగలనా నిను వీడి క్షణమైన
1. నీవే నాతోడువై నీవే నాజీవమై - నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప
నిక్షిప్తమై –
నను ఎన్నడు వీడని
అనుబంధమై "యేసయ్య"
2. నీవే నా శైలమై నీవే నాశృంగమై - నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున
శత్రువుకు ప్రత్యక్షమై –
నను వెనుదీయనీయక
వెన్ను తట్టినావు "యేసయ్య"
3. నీవే వెలుగువై నీవే ఆలయమై - నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన
శుద్ధులతో పరిచయమై –
నను మైమరచి నేనేమి
చేసేదనో "యేసయ్య"
పాట:127
నీవే నన్ను కోరుకొన్నావు - నీవే నన్ను చేరుకొన్నావు
నీవే నన్ను విడిపించావు - నీవే
నన్ను విడువనన్నావు
ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ
నీదయ్యా - 2 "నీవేనన్ను"
1. నీ
అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు - నీ కృపలో నన్ను ఎన్నుకొన్నావు
నీ రాజ్యములో నను దాచివుంచావు - నీ
నామములో నను రక్షించావు
ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ
నీదయ్యా - 2 "నీవేనన్ను"
2. నీ
వాక్యముతో నను సుద్ధిచేసావు - నీ రక్తముతో నను కడిగివేసావు
నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు
- నీ ఆత్మతో నన్ను నింపివేసావు
ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"
పాట: 128
నీ...మధిలో నను తలచు ప్రభువా...
నీ...మధిలో నను తలచు నా ప్రభువా
నను తలచిన తరుణములో నా పాపము
పరిహరించు - 2
1. ప్రాపంచిక
వ్యసనములో నే చిక్కితినో ప్రభువా - 2
నను విడుదల చేయుమయా పరిశుద్ధుని
చేయుమయా - 2 "నీమధిలో"
2. అనురాగపు
వీక్షణతో నా దు:ఖము బాపుమయా - 2
ప్రియ సేవకుడను నేనై సవి చూతును
విశ్రాంతి - 2 "నీమధిలో"
3. చీకటిలో
కలతలలో నను బాయకుమో దేవా - 2
చూపించుము నా ప్రభువా నీ స్వర్గపు
మార్గమును - 2 "నీమధిలో"
పాట:129
నేసాగెద
యేసునితో - నా జీవిత కాలమంతా
1. యేసులో గడిపెద - యేసుతో నడిచెద
పరమున చేరగ నే
వెళ్ళెదా - హానోకుతో సాగెదా..ఆ
"నేసాగెద"
2. తల్లి మరచిన తండ్రి విడచినా - బందువులే
నను వెలివేసినా - బలవంతునితో సాగెదా..ఆ "నేసాగెద"
3. లోకపు శ్రమలు - నన్నెదిరించినా - కఠినులు రాళ్ళతో
హింసించినా -
స్తెఫనువలె సాగెదా..ఆ "నేసాగెద"
పాట:130
నేను
వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును -2
శోదింప బడిన
మీదట - నేను సువర్ణమై మారెదను -2
హల్లేలూయా...హల్లేలూయా....హల్లేలూయా..ఆమేన్ -2
1. కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన
వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు "హల్లే"
2. జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు
అగ్నిలో నేను
నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు "హల్లే"
3. విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి
రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు
"హల్లే"
No comments:
Post a Comment