పాట:151
ప్రభు యేసుని నేడే స్వీకరించు
నీ హృదయంలో అంగీకరించు (2)
నీ హృదయపు భారము తొలగించు (2)
నీ మదిలో నెమ్మది కలిగించు (2) "ప్రభు"
1 ఈ
తరుణము విడువక త్వరపడుము
ఈ కరుణను వదలక రారమ్ము (2)
ఆరిక్తుడై నిను రక్షించుటకై (2)
తన రక్తము కార్చెను వీక్షించు (2) "ప్రభు"
2 నీ
వెంతటి పాపములో నున్న
నీ అంతము నరకముగా నున్న (2)
ప్రభు చెంతకు చేరుము ఈరోజే (2)
నిను వింతగా మార్చును రారాజు (2) "ప్రభు"
3 నీ
పాపము బాపగ ప్రభు వచ్చెను
నీ శాపముతీర్చగ బలియయ్యెను (2)
విలువైన ఆపిలుపును త్రోయుటచే (2)
కలుషాత్ముడ నరకము నీదగును (2) "ప్రభు"
పాట:152
ప్రభువా
కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం
చావైనా
బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా "ప్రభువా"
1. కోరి వలచావు నాబ్రతు - మలిచావయా
మరణ
చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2)
నన్ను వలచావులే
మరి పిలచావులే
అరచేతులలో నను
చెక్కు కున్నావులే (2) "ప్రభువా"
2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా
మనిషిగ పుట్టిన
సర్పానయ్యా (2)
పాపం కడిగావులే
విషం విరచావులే
నను మనిషిగా
ఇలలో నిలిపావులే (2) "ప్రభువా"
పాట: 153
ప్రేమించెదన్
అదికముగా - ఆరాధింతున్ ఆశక్తితో
పూర్ణ మనసుతో
ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా...
ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....
1. ఎబినేజరే - ఎబినేజరే.. ఇంతవరకు ఆదు కొన్నావు (2) +1
నిన్ను పూర్ణ
మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా...
ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....
2. ఎల్రోయీ - ఎల్రోయీ...నన్ను చూచావే వందనమయ్య (2) +1
నిన్ను పూర్ణ
మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా...
ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....
3. యెహోవా రాఫా - యెహోవా రాఫా స్వస్థ పరచావే వందనమయ్య (2) +1
నిన్ను పూర్ణ
మనసుతో ఆరాధింతున్- పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా...
ఆరాధనా.... ఆరాధనా..ఆరా..ధ..నా....
ప్రేమించెదన్
అదికముగా - ఆరధింతున్ ఆశక్తితో
పాట 154
ప్రేమించు
దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు
పాటలు
పాడి ఆనందించెదం – ఆహా ఎంతో ఆనందమే......(2)
1. తల్లిదండ్రుల కన్నా – దాత యైన దేవుడు
ప్రతి
అవసరమును తీర్చు దేవుడు
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
2. నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు
తోడు
నీడగ నన్ను కాపాడును
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
3. నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు
సర్వ
కాలమందు జయ మిచ్చును
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు
అంతము
వరకు చేయి విడువడు
హల్లెలూయ ఆనందమే – సంతోషమే సమాధానమే
పాట:155
ప్రార్ధన వినెడి
పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా
1. శ్రేష్టమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను
ప్రణుతించెదను - పరలోక ప్రార్ధన నేర్పుమయా
2. పరమ దేవుడవని తెలసి - కరములెత్తి జంటగ మోడ్చి
శిరమును వంచి
సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా
3. దిన,దినంబు చేసిన సేవ - దైవచిత్తముకు సరిపోవ
దీనుడనయ్యా
దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా
4. శత్రుమూక నిను చుట్టుకొని - సిలువ పైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా
పాట:156
ప్రేమా
మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ...ఆ..
ప్రేమయే తానై
నిలచీ - ప్రేమ వాక్కులను పల్కి
ప్రేమతో
ప్రాణము పెట్టి - ప్రేమా నగరికి చనియే...
1. నిశ్చలమైన ప్రేమ
మూర్తికి - ఇలలో తావేది ఆ..ఆ.. (2)
ప్రేమ ద్రోహులే
కాని ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే కనుగొనరా
2. ఎంత గోర పాపాత్ములనైనా - ప్రేమించెను రా రా ఆ.. ఆ..(2)
పాప భారముతో
రారా పాదములా పై పడరా
పాపుల
రక్షకుడేసు - తప్పక నిను రక్షించు
3. ఇంత గొప్ప రక్షణ ను - నిర్లక్ష్యము చేసెదవేల ఆ..ఆ..(2)
రక్షణ దినమిదియే
రా- తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని
వరము - ముదమారగ చేకొనుము
పాట:157
ప్రేమా...యేసు
నీ ప్రేమ....ప్రేమా....ఉన్నతా ప్రేమా....
1. లోకములు మారిననూ - మారనీ ప్రేమా
సంద్రములు
చల్లార్చని - యేసు నీ ప్రేమా
2. తల్లి బిడ్డను మరచినా - మరువనీ నీప్రేమా
ఆది అంతము లేని
ప్రేమ - యేసు నీ ప్రేమ
3. పాపులను రక్షించె - కల్వరి ప్రేమ
నిన్న నేడు
ఏకరీతిన - ఉన్న ప్రేమా
4. నింగి నేలా మారిననూ - మారనీ ప్రేమా
డంబములేని
శాశ్వత ప్రేమ - యేసు నీ ప్రేమా
పాట:158
ప్రభువా నీ
కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్
క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే "ప్రభువా"
1. నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని
తెలిపి - 2
లోకములోనుండి
ననువేరు చేసినది - నీదయా సంకల్పమే - 2
"ప్రభువా"
2. జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే
- 2
శాశ్వత
రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే - 2 "ప్రభువా"
3. సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే
- 2
పరిపూర్ణ
శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే
- 2 "ప్రభువా"
పాట:159
అడగకముందే అక్కరలనెరిగి -
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా...
ఎందరువున్న బంధువు నీవై బంధాలను
పెంచినా భాగ్యవంతుడా...
పల్లవి: పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నాపాటగా
మరీ మరీ నేను చాటుకోన మనసంత
పులకింత నీ సాక్షిగా
నా జీవిత గమనానికి గ మ్యము
నీవే
చితికిన నా గుండెకు రాగము
నీవే - 2 ||పదే||
మమతల మహారాజ యేసు రాజా - 3
1. అడగ
ముందే అక్కరలనెరిగి - అవసరాలను తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్న బంధువు నీవై - బంధాలను
పెంచిన భాగ్యవంతుడా
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా...
బంధాలను పెంచిన భాగ్యవంతుడా...
మమతల మహారాజ యేసు రాజా - 3
2. అలిగినవేళా
అక్కునచేరి అనురాగము పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళా నాధరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
అనురాగము పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు
నీవే ||పదే||
పాట:160
పరిశుద్ధ పరిశుద్ధ = పరిశుద్ధ
ప్రభువా =
వరదూతలైన నిన్ = వర్ణింప
గలరా || పరిశుద్ధ ||
1. పరిశుద్ధ జనకుడ =
పరమాత్మ రూపుడ =
నిరుపమ బలబుద్ధి = నీతి
ప్రభావా ||
పరిశుద్ధ ||
2. పరిశుద్ధ తనయుడ = నరరూపధారుడ =
నరులను రక్షించు = కరుణా
నముద్రా || పరిశుద్ధ ||
3. పరిశుద్ధ మగు నాత్మ = వరము లిడు నాత్మ =
పరమానంద ప్రేమ = భక్తుల
కిడుమా || పరిశుద్ధ ||
4. జనకకుమారాత్మ = లను నేక దేవ =
ఘనమహిమచెల్లును = దనర
నిత్యముగా || పరిశుద్ధ ||
పాట: 161
బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది -
పరిశుద్ధమైన బైబిల్ గ్రంధము -2
1. గ్రంధాలలో
అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము -2
నిజమైన మార్గము చూపు దీపము -2
హల్ల్లేలుయా..
హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా..
"బంగా"
2. బుద్దిహీనులకు
జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును -2
బాగుగ పఠియించి మేలు పొందుము -2 "హల్లే"
3. దేవుని
వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును -2
నీ భాధలలో నిన్ను ఆదుకొనును -2 "హల్లే"
4. నీ
పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును -2
నీ మార్గములను వెలిగించును -2 "హల్లే"
5. భూమి, ఆకాశములు
గతియించును - దేవుని మాటలు గతియింపవు -2
అవియన్ని నిజముగ నెరవేరును -2 "హల్లే"
పాట:162
బంగారు నగరిలో నాకొరకు ఇల్లు -
కట్టేను నాయేసు రాజు
సుందరమైన నగరం - రత్నరాసుల
పరమపురం
1. నీవును
యేసుని అంగీకరించిన - కట్టును నీకును ఇల్లు
భాధలు లేని నగరం - రోధన లెరుగని
పరమపురం
2. తానుండె
చోటుకు కొనిపోవుటకును - రానుండె నాయేసు రాజు
ఆకలి కాని నగరం - చీకటి కానని
పరమపురం
పాట:163
బాసిల్లెను శిలువలో పాపక్షమా యేసుప్రభు నీ
ధివ్యక్షమ "2"
బాసిల్లెను శిలువలో పాపక్షమా .......ఆ..
1. కలువరిలో
నా పాపము పొంచి సిలువకు నిన్ను
ఆహుతి చేసి - కలుసహరా కరుణించితివి " 2 "భాసిల్లెను"
2. దోషము
చేసినది నేనే నెకదా మోసముతో
బ్రతికినది నేకదా - మోసితివా నాశాప
భారం " 2 "భాసిల్లెను"
3. పాపము
చేసి ఘడించితిమరణం శాపమేగా
నేనార్జించితిని - కాపరివై నను బ్రొచితివి "2" భాసిల్లెను"
4. నీ
మరణపు వేధన వృదకాదు నామది నీవేధనలో
మునిగి -
క్షేమము కలిగెను హృదయములో
"2" భాసిల్లెను
"
5. ఎందులకో
నా పైయి ప్రేమా అందదయా స్వామీ
నామధికి - అందులకేభయమొందితిని " 2 "భాసిల్లెను"
6. నమ్మిన
వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి
నా ప్రభుడవని - నమ్మితి నీ పాదంబులను " 2 "భాసిల్లెను"
పాట: 164
భారత దేశపు క్రీస్తు (సువార్త) సంఘమా - భువి దివి సంఘమా
ధర సాతానుని రాజ్యము కూల్చే -
యుద్ధా రంగమా "భారత"
1. ఎవని పంపుదును నా తరపున - ఇల ఎవరు
పోవుదురు నాకై
నేనున్నాను నన్ను పంపమని - రమ్మూ
సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు
సంఘమా "భారత"
2. అడవి ప్రాంతములు, ఎడారి భూములు - ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతములో ప్రభుని -
జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు
సంఘమా "భారత"
3. బ్రతుకులోన ప్రభు శక్తిలేని - క్రైస్తవ
జనాంగమును గనుమా
కునుకు దివ్వెలను సరిచేయగ -
ఉజ్జీవ జ్వాలగొని చనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు
సంఘమా "భారత"
పాట:165
భయము లేదు - దిగులు లేదు - జీవిత
యాత్రలో
యేసు ప్రభువు - మనతోనుండ - భయము
లేదుగా
హల్లేలూయ - హల్లేలూయ (2) "భయము లేదు
"
1. గాలి
తుఫాను రేగి అలలు పొంగినా
విశ్వాస నావ మునిగి కొట్టబడిన
సముద్రము పొంగి - నురుగు కట్టిన
యేసు ప్రభువు మనతోనుండ భయము
లేదుగా "2"
2. వ్యాధి
భాధలు నన్ను ముట్టినా
అంతులేని వేదనా నాకు కల్గిన
గర్జించు సింహము - ఎదురు వచ్చిన
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా
"2"
3. శత్రువున్
చూచి విస్మయమొందకు
నీతో కూడా వచ్చువాడు నీదేవుడే
నిన్ను విడువడెన్నడు ఎడబాయడు
యేసు ప్రభువు మనతోనుండ భయము లేదుగా
"2"
పాట:166
భూమిపై యేసు జీవించెను - చూడు
పాదంబుల జాడలు
నీకును,నాకును మాధిరి
- నీకును,నాకును
మాధిరి
1. శోధించగ
అర న్యమందునా - సాతానుడెంతో శ్రమించెను
లేఖనాలు చూపుచు శక్తి మెండు
పొందుచు
గెల్చెను యేసు విరోధిని - గెల్చెను
యేసు విరోధిని
2. ఈ
లోకయాత్ర కాలమంతట - ప్రార్ధించె నేసు స్వామి తండ్రికి
దాడి చేయు భాధను సోధనాధికంబును
సూటిగా ధీటుగా నిల్వగా - సూటిగా
ధీటుగా నిల్వగా
3. దూతాళి
సేవితుండు యేసుడు - లోకాన రిక్తుడై జనించెను
పాపి రక్షణార్ధము స్వీయ ప్రాణమిచ్చెను
ప్రేమ సంపూర్ణుడు యేసుడు - ప్రేమ
సంపూర్ణుడు యేసుడు
పాట:167
భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా
మా రక్షణ కర్త -2
శరణు, శరణు మా దేవ యెహోవా - మహిమా.న్విత చిర
జీవనిధి
1. విమల
సెరాపులు - దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే
మా యాఘములకై సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే "శరణు"
2. ప్రప్రధముడ
మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి
నీ భజనయే మా జీవాధారం - జేకొనుమా
మా స్తుతి గీతం "శరణు"
పాట:168
భూనివాసులకు - ఈ లోక నివాసులకు
యేసే జీవం - యేసే సత్యం - యేసే
మార్గమనీ సూటిగ ప్రకటించు
1. పరిసరములలోని
- పండిన పైరంతా
రాలిపోవు చుండ - సంతాపమే లేదా
కన్నెత్తిచూడు - కన్నీరు కార్చు
ఓ దైవ సేవకుడా - ఇకనైనా
మేల్కొనవా "భూనివా"
2. పరమాత్మ
ఆజ్ఞగని - ఆ యాత్మ స్వరమువిని
పౌలువంటి భక్తులు - ప్రాణాలు
తెగియించిరి
దేవుని వాక్యము -
దేదీప్యమానము
దీనుడవై యెపుడు - దీక్షతో
చాటించు "భూనివా"
3. సువార్త
భారమును - సంపూర్ణ భాద్యతతో
మోయాలి భోధకులు - చేరాలి గ మ్యాలు
దేవుని మార్గము - పూజనీయము
దివ్వెగ జీవించు - ధర్మము
నెరవేర్చు "భూనివా"
4. సంఘమ
మేల్కొనుమా - సాతానునెదిరించుమా
సర్వాంగ కవచమును - ధరియించి
పోరాడుము
చీకటి త్రోవలో - సువార్త జ్యోతివై
జ్వాలను రగిలించు - రక్షణ
ప్రకటించు "భూనివా"
పాట:169
మంచి కాపరి
మాప్రభు యేసే....
మా కొరకు ప్రాణ
మిచ్చే గొప్ప కాపరి
మరణ మన్నను భయము
లేదులే
మదురమైన ప్రేమతో
మమ్ము కాయులే
1. పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా
శాంతి జలాల చెంత
అడుగు వేయగా
చేయివిడువకా తోడు నిలచును
నీతి మార్గమందు
మమ్ము నడువజేయును "మంచి"
2. అందకారలోయలో మా పయనంలో
లేదులే మాకు భయం
అభయం తానే
ఆదరించును
ఆశీర్వదించును
అన్ని తావులయందు
తానే తోడైయుండును "మంచి"
3. శత్రువుల మధ్యలో మాకు భోజనం
అభిషేకం ఆనందం
కృపా క్షేమమే
బ్రతుకు నిండగా
పొంగి పొర్లగా
చిరకాలం ఆయనతో
జీవింపగా "మంచి"
పాట:170
మంచిగా పిలచినా
నా యేసయ్యా
నీ స్వరము నాకు
ఎంతో ప్రీతి కరము (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
1. చీకటి నుండి నన్ను నీ వెలుగులోనికి
పాపము నుండి
నన్ను నీ సన్నిధిలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
2. లేమినుండి నన్ను నీ కలిమిలోనికి
శాపము నుండి
నన్ను సంవృద్ధిలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
3. మట్టి నుండి నన్ను నీ మహిమలోనికి
క్షయత నుండి
నన్ను అక్షయతలోనికి (2)
పిలిచినా...దైవమా... స్తోత్రము... యేసయ్యా... (2)
పాట:171
మంచి దేవుడు భలే మంచి దేవుడు
నిజ దైవం యేసు - అద్వితీయ
దేవుడు
1. మ్రొక్కులను
కోరడు - మనసిస్తే చాలును
కొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడు
వెదికితే ప్రతి వారికి - దొరికేను
యేసు
పిలిచే ప్రతి వారికి - పలికేను
యేసు
బొమ్మ కాదయ్యో - జీవమున్న
దేవుడు "మంచి"
2. కుంటివాడు
గంతులేయ - కాళ్ళ నొసగినాడు
మూగవారు స్తుతిచేయ -
నోటినిచ్చినాడు
బధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడు
ప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు "మంచి"
3. చెప్పింది
చేసెను - మాదిరుంచి వెళ్ళెను
అడుగు జాడాలుంచెను - అనుసరించ
కోరెను
మరణాన్ని జీవాన్ని - మన ఎదుటే
వుంచెను
ఎంచుకొనే స్వేచ్చను - మన
చేతికిచ్చెను
ఏమి చేతువో - సృష్టికర్త
యేసుని "మంచి"
పాట:172
మధురం మధురం
దైవ వాక్యం
తేనెకన్న
మధురం దేవుని వాక్యం
చీకటి నిండిన
వీదులలో
కాంతిని
వెదజల్లు దైవవాక్యం
అ.ప:జీవమున్న వాక్యం,జీవమిచ్చు
వాక్యం
దేవుని
దివ్య వాక్యం...
1. ఖడ్గము కంటెను వాడిగలది
ప్రాణాత్మలను
విభజించెడి వాక్యం
హృదయమునందలి
చింతలను
పరిశోదించెడి
దైవ వాక్యం "జీవమున్న"
2. నాహృదయములో దైవ వాక్యం
పదిలపరచుకొని
యున్నందున
పాపములో...నే
తడబడకుండ
అడుగులు కాపాడు
దైవ వాక్యం "జీవమున్న"
3. కష్టములలోన దైవవాక్యం
నెమ్మది నిచ్చి
నడిపించును
అలసిన,కృంగిన వేళలలో
జీవింపచేయు దైవ
వాక్యం "జీవమున్న"
పాట:173
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా
తండ్రి ప్రేమ "2"
మరువలేనిది నా
యేసు ప్రేమ "2"
మధురాతి మధురం
నా ప్రియుని ప్రేమ
ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
1. ఇహలోక ఆశలతో అందుడనేనైతిని
నీసన్నిది విడచి
నీకు దూరమైతిని "2"
చల్లనీ స్వరముతో
నన్ను నీవు పిలచి"2"
నీసన్నిదిలో
నిలిపిన నీ ప్రేమ మధురం
ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
2. పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పినా
ఎగసిపడే అలలతో
కడలే గర్జించినా "2"
మరణపు చాయలే ధరి
చేరనీయక "2"
కౌగిట దాచిన నీ
ప్రేమ మధురం
ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
3. నీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి
మన్నించితివి "2"
మరణపు ముల్లును
విరచిన దేవా "2"
జీవము నొసగినా
నీ ప్రేమ మధురం
ప్రేమా...ప్రేమా...ప్రేమా..నా యేసు ప్రేమా
పాట:174
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెద
సుధలు నిండు ఆ నామమును భువిని నేను చాటెద
1. ఎంత
ఘోర పాపులనైన మార్చివేయును
ఎంత కఠిన హృదయములైనా కరిగి పోవును
యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం
2.ఎంచలేని
దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో
యేసు రక్త ధారలే క్షమా సహితము
3. కష్టమైన
నష్టమైన క్రీస్తే ఆశ్రయం
హింసయైన బాధయైన లేదు యే భయం
యేసు మథుర నామమే రక్షణ కారణం
పాట:175
మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై
ఉండలేదు నీకు యేసయ్యా
సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా
వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా -2
1. చిగురాకుల
కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే
- 2
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా -
2 "మారని"
2. నా
జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను
నడిపించితివే - 2
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ
నన్ను చూచినావయ్యా నన్ను
కాచినావయ్యా - 2
"మరని"
పాట:176
మార్గము చూపుము
ఇంటికి నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమ
ప్రపంచము చూపించు కంటికి
1. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాపమునొంది తండ్రి
క్షమగోరుచు పంపుము క్షేమము
ప్రభు నీదు
సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె దైర్యము
"మార్గము"
2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల
బ్రతుకు ద్వంసము చేసె దేవానిన్ చేరితి
దేహియని నీవైపు
చేతులెత్తిన నాకు దారిని చూపుము "మార్గము"
3. దూరదేశములోన భాగుండు ననుకొనుచు తప్పితి మార్గము
తరలి పోయిరి
నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము
దాక్షిణ్యమూర్తి
నీదయ నాపై కురిపించి ధన్యుని జేయుము "మార్గము"
4. కొడుకునే కాదనుచు గృహమే చెరశాలనుచు కోపించి వెళ్ళితి
కూలి వానిగనైన
నీయింట పనిచేసి కనికరమే కోరుదు
కాదనకు నాతండ్రి
దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము "మార్గము"
5. నా తండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచే నా పైబడి ఏడ్చెను
నవ జీవమును
కూర్చి ఇంటికితోడ్కొనివెళ్ళి నన్ను ధీవించెను
నాజీవిత కథయంతా
యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమైయుండును "మార్గము"
పాట:177
మణులు
మాణిక్యములున్న - మేడమిద్దులు యెన్నున్న
మధిలో యేసు
లేకున్నా - ఏది వున్న అది సున్నా
1. చదువులెన్నో చదువున్నా - పదవులెన్నో చేస్తున్నా
విద్యవున్న
బుద్ధివున్న - జ్ణానమున్నా అది సున్నా "మణులు"
2. అంద చందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నా
సుందరుడు ప్రభు
లేకయున్నా - అందమున్నా అది సున్నా "మణులు"
3. రాజ్యములు రమణులువున్నా - శౌర్యములు వీర్యములున్నా
బలము వున్న
బలగమున్నా - ఎన్ని యున్నా అవి సున్నా "మణులు"
4. పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్య కార్య సిద్ధుడా
దాన ధర్మము తపము
జపము - యేసు లేనిది అది సున్నా
పాట:178
మాయాలోకం మాయాలోకం
మారి పోకు నేస్తం - మారిపోకు
నేస్తం "2"
రంగు రంగులు అవిచూపించునురా
కంటికింపుగా అవి కని పించునురా
"2"
1. అందమైనవి సౌధర్యమైనవి
మోసకరమని బైబిలు చెప్పెను
మాయాలోకం మాయాలోకం మోసపోకు నేస్తం
"2"
మాయాలోకం మాయాలోకం - మారిపోకు
నేస్తం "2"
2. పరలోకమనేది
ప్రభువుండేది
మాయలేనిది అది నిత్య రాజ్యము "2"
పరలోకం పరలోకం చేర రమ్ము నేస్తం
"2"
మాయాలోకం మాయాలోకం - మారిపోకు
నేస్తం "2"
పాట:179
మహిమగల తండ్రి
- మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర
మొక్కలు నాటించాడు
తన పుత్రుని
రక్తనీరు - తడి కట్టి పెంచాడు
తన
పరిశుద్ధాత్మను - కాపుగావుంచాడు (2)
కాయవే తోట -
కమ్మని కాయలు
పండవే చెట్టా
- తియ్యని ఫలములు "కాయవే"
1. నీతి పూత జాతికాపు -
ఆత్మశుద్ది ఫలములు
నీ తండ్రి
నిల్వచేయు - నిత్య జీవ నిదులు
అనంతమైన ఆత్మ
బందు - అమరసుఖ శాంతులు
అనుకూల
సమయిమిదే - పూయు పరమ పూతలు (2) "కాయవే"
2. అపవాది కంటబడి -
కుంటుబడి పోకు
కాపు పట్టి
చేదు పండ్లు - గంపలుగా కాయకు
వెర్రిగా
చుక్కలంటి - ఎదిగి విర్రవీగకు
అదిగో గొడ్డలి
వేరున - పదును పెట్టియున్నది (2) "కాయవే"
3. ముద్దుగా పెంచాడు -
మొద్దుగా నుండకు
ముదముతో
పెంచాడు - మోడుబారిపోకు
ముండ్ల పొదలలో
కృంగి - మెత్తబడిపోకు
పండ్లుకోయువాడు
వచ్చి - అగ్నివేసి పోతాడు
పాట:180
మహిమ నీకే ప్రభూ
- ఘనతనీకే ప్రభూ
స్తుతియు,మహిమ ఘనతయు - ప్రభావము నీకే ప్రభూ
ఆరాధనా - ఆరాధనా
- ఆరాధనా - ఆరాధనా
ప్రియ యేసు
ప్రభునకే- నా యేసు ప్రభునకే
1. సమీపింపరాని తేజస్సు నందు – వశియించు అమరుండవే
శ్రీమంతుడవే-
సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే
"ఆరాధ"
2.ఎంతో ప్రేమించి నాకై ఏతించి - ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం
చిందించి – నన్ను విమోచించితివే "ఆరాధ"
3. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్
ధరనే ప్రచురింప - ఏర్పర్చుకొంటివే
"ఆరాధ"
No comments:
Post a Comment