పాట:131
నెరవేరుగురుతు లవి యన్నియు -
పరిపూర్ణమాయె కాలంబును
ఇక యేసుడు ఏతెంచును - ఇది నమ్ముమా
ఓ క్రైస్తవ
1. పెండ్లి
కుమారుండుగా యేసుడు - ఏతించుచున్నాడు ఈభూమికి
సిద్ధంబుకమ్ము సిద్దెలు నింపి -
లేనేలేదు కాలంబిక
"నెర"
2. కొడవలి
చేబూని రైతువలె - నేతించు చున్నాడు లోకేశుడు
సిద్ధంబు కమ్ము నీ పంటతోడ -
లేనేలేదు కాలంబిక "నెర"
3. నడిరేయిలో
దొంగరాక వలె - రానున్న దేసయ్య ఈరాకడ
మెలకువ తోడ కనిపెట్టు సుమ్ము -
లేనేలేదు కాలంబిక "నెర"
4. మేఘాస
నాసీనుడై దేవుడు - వేవేల దూత సమూహాలతో
తనవారిజేరి ప్రియమార బరము కొనిపోవ
త్వరలో వేంచేయును "నెర"
పాట:132
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను
నా హృదయసీమ
1. నీ
పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ
స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని
వివరింతును "నేనె"
2. నీ
శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున - శ్రమలుసహించి- నీ
వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని
వివరింతును "నేనె"
3. నీలో
నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే
పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని
వివరింతును "నేనె"
పాట:133
నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే
నిలువ జాలనో ప్రభు
ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా - 2
1. ఈ
ఊపిరి నీదేనయ్య నీవిచ్చిన దానము నాకై
నా ఆశ నీవేనయ్యా నా జీవితమంత నీకే
నిన్ను నే మరుతునా మరువనో
ప్రభూ - 2
నిన్ను నే విడుతునా విడువనో
ప్రభూ - 2
పాట 134
నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...!
యేసయ్యా.... యేసయ్యా.... యేసయ్యా....
యేసయ్యా....
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా .... 2 ||నాతోడు||
1. నా అనువారు నాకు
దూరమైనా - నా తల్లి తండ్రులే నాచేయి
విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ....ఆ......ఆ.... 2
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 ||నాతోడు||
2. నాపాదములు జారిన వేళ - నీకృపతో నన్ను ఆదుకొంటివే.....
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి..
ఆ.....ఆ.....ఆ..... 2
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే..... 2 ||నాతోడు||
3. హృదయము పగిలి వేదనలోన – కన్నీరు తుడచే పరిస్థితిలో....
ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ....ఆ.....ఆ....
2
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు||
పాట 135
నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా
నా యేలినవాడా...ఆ - నా స్నేహితుడా - 2
నిన్ను చేరాలనీ... నీతో ఉండాలనీ... - 2
నిన్ను వలచానయా... నీవు నా సొంతం
నిన్ను వలచానయ్యా... యేసయ్యా నీవు నా
సొంతం ||నాప్రాణ ||
1. నీస్వరమునే
వింటిని ప్రాణము సొమ్మసిల్లె యేసయ్యా
నీ ముఖమునే చూచితిని మనసానందమాయనహా - 2
నీ ప్రేమను రుచిచూచితి నీ వశమయితిని యేసయ్యా
- 2 ||నాప్రాణ
||
2. నీ
చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది
యేసయ్యా - 2
నిన్ను హత్తుకొని నీవడిలోన నిదురించాలని
వుందయా - 2 ||నాప్రాణ ||
పాట 136
నీ
ప్రేమలేనిదే నే బ్రతుకలేనయ్యా -
నాజీవితాంతము నీతోడు చాలయ్యా - 2
ధనరాసులెన్నున్న, మేడమిద్దేలెన్నున్న –
లోకమంతా నాదైనా అంతానావారైనా
1.
కష్టకాలములందు నేకృంగియున్నపుడు-
నీతోడు ఉంటేచాలయ్యా
వ్యాధి
బాధలయందు నేనలిగియున్నపుడు – నీప్రేమఉంటే చాలయ్యా
విడువనని
ఎడబాయనని – వాగ్దానము చేసినదేవా – 2
నాకాపరి
నీవైయుంటివా – నా ఊపిరి నీవైయుంటివా (యేసయ్యా) – 2
2.
అపవాది శోధనలో నే అలసిఉన్నపుడు -
నీతోడుఉంటే చాలయ్యా
మరణకర
సమయములో నేకృంగియున్నపుడు- నీ ప్రేమ ఉంటేచాలయ్యా
విడిపించి
నడిపించి - రక్షించిన నా యేసయ్యా – 2
నా తోడుగ
నీవైయుంటివా – నా నీడగ నీవైయుంటివా (యేసయ్యా) – 2
పాట 137
నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు - నా పాపము - నా
శాపము
తొలగించెను - నన్ను
కరుణించెను 2 || నన్నెంతగానో ||
1. సాతాను బంధాలలో -
జీవంపు డంబాలలో 2
పడనీయక - నన్ను చెడనీయక 2
తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను 2 || నన్నెంతగానో ||
2. సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము 2
నేర్పించెను
- నాకు చూపించెను 2
వర్ణించగాలేను ఆ ప్రభువును 2 || నన్నెంతగానో ||
3.
కల్వరి
గిరిపైనను - ఆ సిలువ మరణంబును 2
నా కోసమే -
తాను శ్రమ పొందెను
2
నా పాపమంతటిని క్షమియిం చెను 2 || నన్నెంతగానో ||
4. ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు 2
ఏమిచ్చెదన్ -
నేనేమిచ్చెదన్
2
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును 2 || నన్నెంతగానో ||
పాట:138
పరాలోకమే నా
అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2" "పరలోకమే"
1. స్వల్ప కాలమే ఈలోక
జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే
మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2"
వీక్షించు
కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా...
"2"
"పరలోకమే"
2. పాపము నెదిరించే
శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే
ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను
"2"
మోకాళ్ళ జీవితం
- కన్నీటి అనుభవం నాకు నేర్పవా... "2" "పరలోకమే"
పాట:139
పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నీ దారిన్
నాగురి నీవే నా ప్రభువా - నీధరి నే
చేరెదన్ - నేను
1
లోకమంతా నాదని యెంచి - బంధు మిత్రులే ప్రియులను కొంటిని
అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును
ఇలలో "పరవాసిని"
2 ధన
సంపదలు గౌరవములు - దహించుపోవు నీ లోకములో
పాపము నిండె జగములో - శాపము
చేకూర్చుకొనే లోకము
"పరవాసిని"
3 నా
నేత్రములు మూయబడగా - నాదు యాత్ర ముగియునిలలో
చేరుదున్ పరలోక దేశం - నాదు గానము
యిదియే- నిత్యము "పరవాసిని "
4
తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు ఎంతో
తెలుపుము ఎంత అల్పుడనో - విరిగి
నలిగి యున్నాను - నేను
"పరవాసిని"
5. యాత్రికుడనే ఈలోకములో - సిలువ మోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగా - పొందితిని
యేసును నేను పొందితిని
పాట:140
పరమ జీవము
నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము
నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును
"యేసు చాలును
చాలును - యేసు చాలును చాలును"
"ఏ సమయమైన - ఏ స్థితి కైన - నాజీవితములో యేసు చాలును"
1. సాతాను శోధన లధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము
లాగినను - లోబడక నేను వెళ్ళెదను
2. పచ్చిక బయలలో పరుండచేయున్ - శాంతి జలము చెంత నడిపించును
అనిశము ప్రాణము
తృప్తిపరచున్ - మరణ లోయలో నను కాపాడును
3. నరులెల్లరు నను విడిచినను - శరీరము క్రుళ్ళి కృషించినను
హరించినన్ నా
ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను
పాట:141
పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా
పంపుము దయచేత - పతిత పావన నామ
పెంపుగ నీ సేవ
- బ్రియ మొప్ప నొనరింప
పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా
1. మా సేవనుండిన - మా వెల్తులన్నియు
యేసుని కొరకు నీ
వెసగ క్షమియించును
2. వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్పి
దిన దినము ఫలములు
దివ్యముగ ఫలియింప
3. ఆసక్తితో నిన్ననిశము సేవింప
భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి
పాట:142
పాడెద నేనొక
నూతన గీతం - పాడెద మనసారా
యేసయ్యా నీ
నామమేగాగ వేరొక నామము లేదాయే -2
1. కలుషితమైన నదియై నేను - కడలియైన నీలో - 2
కలిసిపోతినే
కలువరి ధారిలో కనబడదే ఇక పాపాలరాశి - 2
2. పోరు తరగని సిగ సెగలన్నియు - అణచి కృపాతిశయము -2
కొదువైన నానా
హృదయములోన పొంగెనే అభిషేకతైలం - 2
పాట:143
పాపిని యేసు
ప్రభో నే పాపిని యేసు ప్రభో
నీ రక్తపు ధారలచే
నను కడుగుము యేసుప్రభో
1. పాపము మోసితివే - నా శాపము బాపితివే
నీ మహిమకు
పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో
2. చిందిన రక్తమున - నే పొందిన స్వస్థతను
రా నంటిని నీ
దరికి - మన్నిచుము యేసు ప్రభో
3. మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను
రా నంటిని
నీదరికి - నను గావుము యేసు ప్రభో
పాట:144
పావురమా
సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా
హల్లెలూయా -
హల్లేలూయా
1. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలసే
కడవరిచినుకులు
పడగాపొలములో
ఫలియించెను
దీవెనలే
2. అభిషేక కాలంకృతమై అపవాదిని కూల్చెనులే
సభకే జయము
ఊభికే జీవం
ప్రబలెను ప్రభు
హృదయములో
3. బలహీనతలో బలమా పరిశుద్దతలో వరమా
ఓ పావురమా
దిగిరా దిగిరా త్వరగా
పాట;145
ప్రియ యేసు
రాజును నే చూచిన చాలు - మహిమలో నేనాయనతో నుంటేమేలు
నిత్యమైన
మోక్షగృహము నందు చేరి - భక్తుల గుంపులో హర్షించిన చాలు
1. యేసుని రక్తమందు కడుగబడి-వాక్యంచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక
పరిశుద్ధులతో పోదున్ నేను-బంగారు వీదులలో తిరిగెదన్ "ప్రియ"
2. దూతలు వీణలను మీటునపుడు-గంభీర జయద్వనులు మ్రోగినపుడు
హల్లెలూయ పాటల్ పాడుచుండ-ప్రియ యేసుతోను నేను
ఉల్లసింతున్ "ప్రియ"
3. ముండ్ల మకుటంబైన తలనుజూచి-స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడలతో
కొట్టబడిన వీపునుజూచి-ప్రతి యెక్క గాయమును చుంబింతును "ప్రియ"
4. హృదయము స్తుతులతో నింపబడె-నా భాగ్య గృహమును స్మరించు చుంటె
హల్లెలూయ.....ఆమేన్,హల్లేలూయా..- వర్ణింప
నా నాలుకచాలదయ్యా "ప్రియ"
5. ఆహ! యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా ! నా ఆశ యెపుడు
తీరుతుందో
తండ్రి నా
కన్నీటిని తుడుచు నెపుడో-ఆశతో వేచియుండె నా హృదయము "ప్రియ"
పాట:146
ప్రియ యేసు
నిర్మించితివి - ప్రియమార నాహృదయం
ముదమార వసియించు
- నా హృదయాంత రంగమున -2
1. నీ రక్త ప్రభావముతో - నారోత హృదయంబును
పవిత్ర పరచుము
తండ్రీ - ప్రతి పాపమును కడిగి "ప్రియ"
2. ఆజాగరూకుడనైతి - నిజాశ్రయంబును విడచి
కరుణా రసముతో
నకై - కనిపెట్టితివి తండ్రీ
"ప్రియ"
3.
వికసించె విశ్వాసంబు - వాక్యంబును నే చదవగనే
చేరీతి నీదు
దారి - కోరీ నడిపించుము
"ప్రియ"
4. ప్రతి చోట నీసాక్షీగా - ప్రభువా నే నుండునట్లు
ఆత్మాభిషేకము
నిమ్ము - ఆత్మీయ రూపుండా
"ప్రియ"
పాట:147
పువ్వుకింత
పరిమళమా ఒక రోజుకింత అందమా - 2
పూస్తున్నది
ఉదయాన్నే రాలిపోవుతున్నది త్వరలోనే - 2
1. ఓ చిన్న పువ్వు తన జీవితంలో పరిమలాన్నే ఇస్తుండగా...ఆ 2
ఆ పువ్వు కంటే
మరిగొప్పగా చేసిన నీలో ఆపరిమళముందా..?
2. ఒకనాడు యేసు మన పాపమునకై పరిమళాన్ని వెదజల్లెనూ...2
ఆయేసు మరణం
నీకోసమేనని ఇకనైనా గమనించవా...?
3. అతిచిన్న ఆయువు ప్రతిపువ్వు కలిగి అందరిని
ఆకర్శించెను...2
బహుకాలము
బ్రతికి బహు జనులను పిలచి సువార్తను వెద జల్లవా..? 2
పాట:148
పొర్లి పొర్లి పారుతోంది కరుణానది - కల్వరిలో యేసు స్వామి
రుధిరమది "4"
1 నిండియున్న పాపమంత కడిగివేయును "3"
రండి మునుగడిందు పాపశుద్ధి
చేయును "2" చేయును శుద్ధి (4)
2 రక్తము చిందించకుండా పాపము పోదు "3"
ఆ ముక్తిదాత
రక్తమందే జీవము గలదు "2" గలదు జీవము (4)
3 విశ్వ పాపములను మోసే యాగ పశువిదే "3"
కోసి చీల్చి
నదియై పారే యేసు రక్తము "2" రక్తము యేసు (4)
4 చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము "3"
రమ్ము రమ్ము
ఉచితము ఈ ముక్తి మోక్షము "2" మోక్షం ఉచితం (4)
పాట:149
పోదాము పొదాము - పయనమౌదము- సువార్త చెప్ప పోదాము
1.అక్కడి పోదాము ఇక్కడి పోదము ఎక్కడ పోదాము
సువార్త చాటింప
- సాగిపోదాము
2. ఆజాతి ఈ జాతి ఏజాతండి - పరిశుద్దతే మన స్వంతజాతండి (2)
3. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి - కానాను దేశమే మన ఊరండి
4. ఆరక్తము ఈ రక్తము ఏ రక్తమండి - క్రీస్తేసు రక్తమే పాపం
బాపండి
5. ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి - పరలోకమే మన సొంత ఊరండి
6.ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి - క్రీస్తేసు ప్రేమలో మార్పు
లేదండి
పాట:150
ప్రభు యేసు నిను పిలువగా - నీవు
పరుగిడెదవా నిలువక (2)
1.
బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2)
మారుమనస్సు లేనిచో - నీవు
నరకాగ్నిలో నుందువూ..
2. పాప
భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా
(2)
మారుమనస్సు లేనిచో - నీవు
నరకాగ్నిలో నుందువూ..
3.
నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2)
మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ..
4.
ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా… (2)
మారుమనస్సు లేనిచో - నీవు
నరకాగ్నిలో నుందువూ
it is very useful to all ...... i am very much thankful to Vijaya raju.
ReplyDeletei am very happy to see and read these lyrics ...... and also i am waiting for new songs lyrics...... THANK YOU MAY ALMIGHTY GOD BLESS YOU.....,
Thanks to You and All for Your Comments
Delete