Friday, September 21, 2012

TELUGU CHRISTIAN LYRICS 41 - 60

పాట:41
    ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా
    నీ బ్రతుకంతా మారుటమేలు - కోరుము జీవమునే -2
1. పాపపు చీకటి బ్రతుకేలా - శాపము భారము నీకేలా
    పావన యేసుని పాదము జేరిన - జీవము నీ దగురా       "ఓ"
2. మారిన జీవిత తీరులలో - మానక నీప్రభు సేవకురా   
    మహిమ కిరీటము  మనకొసగును - ఘనమే నీ దగురా    "ఓ"
3. భయపడి వెనుకకు పరుగిడక - బలమగు వైరిని గెలిచెదవా
    బలమగు ప్రభుని వాక్యము నమ్మిన - గెలుపే నీదగురా     "ఓ"

పాట:42
 1. ఓ...మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
     ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?
     ఆహా.... ఆ...ఆ...అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే
     మహా భయంకరమో - సింహంబుగా నుండు
2. లోకాలు పుట్టి నప్పటి - నుండి మృతులైనా
    ఏ కులాజుడైన నాటికి - తీర్పులో నిలచును
3. మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను
    ప్రతివారు నిలచి యుందురు - బ్రతికిన రీతిగనే
4. గ్రంధాలు విప్ప బడగ - గ్రంధాలలో వారి
    గ్రంధంబు బట్టబయలై - పొందుదురు తీర్పును
5. నరులెల్ల క్రియల చొప్పున - మరి తీర్పు పొందుదురు
    మరణము మృతుల లోకము - గురియౌను అగ్నికి
6. ఈ నాడు నీవు కూడను - యేసుని విడచినచో
    ఆనాడు నీవు కూడను - అందుండి యేడ్చెదవు
7. దేవుని జీవ గ్రంధము - దేవుడు తెరచును
    ఎవ్వని పేరందుండదో - వాడగ్నిలో బడును


పాట:43
    ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహానీయము
    ఆకాశ తార పర్వత సముద్ర - ములకన్న గొప్పది                            "ఓయేసు"
1. ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు
    గంభీరమైన ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు            "ఓయేసు"
2. సంకట సమయములో సాగలేకున్నాను - దయచూపు నామీద అని నేను మొరపెట్టగా
    వింటి నంటివి నా మొరకు ముందే తోడునుందునంటివి                      "ఓయేసు"
3. మరణాందకారపు - లోయనే సంచరించిన నిరంతరమేసు
     నాదు కాపరివై - కరము నిచ్చి నన్ను గాయుచు - నడుపు కరణగల ప్రభువు "ఓయేసు"
4.  కొదువలెన్ని యున్న భయపడను నేనెప్పుడు పచ్చిక బయలలో పరుండజేయును
     భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండు యేసు                      "ఓయేసు" 

పాట 44
    ఓ ప్రభువా...... ఓ ప్రభువా ......నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి
1. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి              "2"
    నిత్య జీవము నిచ్చిన దేవా "2"      నీవే నామంచి కాపరివి    "3"   " ఓప్రభువా"
2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లపుడు చేయి విడువక          "2"
     అంతము వరకు కాపాడు దేవా  "2"  నీవే నామంచి కాపరివి   "3"  "ఓప్రభువా"
3. ప్రాధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆఘడియలలో         "2"
     నన్ను నీవు మరువని దేవా   "2" నీవే నామంచి కాపరివి      "3"    "ఓ ప్రభువా"

పాట:45
     ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
     యేసే ఆ దైవం చూడన్నా- చూడన్నా (2)
1. చరిత్రలోనికి వచ్చాడన్నా - పవిత్ర జీవం తెచ్చాడన్నా (2)
    అద్వితీయుడు ఆదిదేవుడు - ఆదరించెను ఆదుకొనును (2)
2. పరమును విడచి వచ్చాడన్నా - నరులలో నరుడై పుట్టాడన్నా (2)
    పరిశుద్దుడు పావనుడు - ప్రేమించెను ప్రాణమిచ్చెను             (2)
3. శిలువలో ప్రాణం పెట్టా డ న్నా-మరణం గెలిచి లేచాడన్న (2)
     మహిమ ప్రభూ మృత్యంజయుడు-క్షమియించును జయమిచ్చును(2)

పాట:46
   కన్న తల్లి చేర్చునట్లు - నను చేర్చు నా ప్రియుడు
   హల్లేలుయా - హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా
1. కౌగిటిలో హత్తుకొనున్‌ - నా చింతలన్‌ భాపును (2)
2. చేయి పట్టి నడుపును - శికరముపై నిలుపును (2)
3. నా కొరకై మరణించే - నా పాపముల్‌ భరియించే (2)
4. చేయి విడువడు ఎప్పుడు - విడనాడడు ఎన్నడు (2)

పాట:47
     కడవరి దినములలో రావాలి ఉజ్జీవం 
    యేసుని అడుగులలో నడవాలి యువతరం 
    భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో
    క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో
1. క్రీస్తు సిలువను భుజమును మోస్తు - ఆసేతు హిమాలయం
    యేసు పవిత్ర నామం ఇలలో మారు మ్రోగునట్లు
    విగ్రహారాధనను భువిపై రూపు మాపే వరకు
    భారత దేశం క్రీస్తు రాకకై సిద్దమయ్యే వరకు
    కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2)
    భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో
    క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో 
2. కులము, మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండి
    యేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
    మూఢ నమ్మకాలు భువిపై సమసిపోయే వరకు
    అనాగరికులు, మతోన్మాదులు - మార్పు చెందేవరకు
    కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2)
    భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో
    క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో 

పాట:48
    కలవంటిది నీజీవితం - కడు స్వల్పకాలము 
   యువకా అది ఎంతో స్వల్పము
   బహు విలువైనది నీజీవితం - వ్యర్ధముచేయకుమా
   యువకా వ్యర్ధము చేయకుమా - యువతీ వ్యర్ధము చేయకుమా 
1 నిన్ను ఆకర్షించే ఈలోకము - కాటువేసే విషసర్పము
   యువకా అది కాలు జారే స్థలము - ఉన్నావు పాపపు పడగనీడలో
   నీ అంతము ఘోరనరకము - యువకా అదియే నిత్య మరణము
2 నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం - నూతనా సృష్టిగా మార్చును
   పాపం క్షమియించి రక్షించును - ఆమోక్షమందు నీవుందువు
   యుగయుగములు జీవింతువూ - నీవు నిత్యము ఆనందింతువు  

పాట:49
    కన్నీళ్ళు విడిచీ నీపాదాలనే కడుగనా నా ప్రాణప్రియుడా నిన్నే ఆరాధన చేయనా
    నా సర్వమా... నా యేసయ్యా...  ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
1. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా
    నా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవా
    ఎలుగెత్తి ప్రార్ధన చేసి నీ కృపను పొందెద దేవా - 2
    నా కళ్ళలో ఇక నీ రూపమే నిండనీ  - 2  
    ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
    ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా   "ఆరాధన"
2. నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్ధించనా
    బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా
    నీ నామ స్మరణలోనే ప్రతి ఫలము పొందెదనయ్యా - 2
    బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా  - 2
    ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
    ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా   "ఆరాధన"
3. నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదా
    ప్రియమైన నీ సన్నిదిలో ఆరాధనా చేయనా
    ఘనమైన నీదు ప్రేమా నే చాటెద లోకములోన - 2
    నీ సాక్షిగా.. జీవించెదా యేసయ్యా  - 2
    ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
    ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా   "ఆరాధన"

పాట:50
     కల్వరిలో సిల్వ వేయబడిన క్రీస్తును - మరతువా నీ జీవిత యాత్రలో
     మరతువా......మరతువా..... నీకై యేసు సిలువ మృతినొందెను
1. పాపిని రక్షించుటకు పాప రహితుడు - యాగమై ప్రాణమిచ్చె సిలువలో
    యాగమై.....యాగమై....యేసు శుద్ధి చేసినది మరతువా   "కల్వరిలో"
2. ప్రేమయైన దేవుని యేక తనయుడు - యేసుని ప్రేమ నీవు మరతువా
    యేసునీ.....యేసునీ....  రక్తమే రక్షించెనని మరతువా      "కల్వరిలో"
3. అనుదినం స్వజనమును నడుపుట కొరకు - నింపె పరిశుద్ధాత్మతో నిన్ను
    ఆత్మతో....ఆత్మతో....   నింపె తన పరిశుద్ధాత్మతో          "కల్వరిలో"

పాట:51
    కీర్తించి కొనియాడి ఘన పరతును - స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్‌
    యేసయ్య హల్లేలూయా నా యేసయ్య హల్లేలూయా      "2"
    ఆరాధన స్తుతి ఆరాధనా -ఆరాధన ఘన ఆరాధన     "2"
1. దేవాది దేవుడవు పరలోకమును వీడి - మానవ రూపాన్ని ధరియించినావు
     రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు - నీవే మా రక్షణ విమోచకుడా "2"   "యేసయ్య"
2. మమ్మెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణములనే అర్పించినావు   "2"
    మా ప్రాణ నాధుడవు ఆధారభూతుడవు - నీవే మా రక్షణ విమోచకుడా "2"    "యేసయ్యా"
3. ఆశ్చర్య కరుడవు ఆలోచనా కర్త - భలవంతుడైన మా దేవుడా "2"
    నిత్యుడగు తండ్రీ సమాదాన కర్తా - నీవే మా రక్షణ విమోచకుడా "2"   "యేసయ్యా"

పాట:52
    కుతుహలమార్బాటమే నాయేసుని సన్నిధిలో
    ఆనంద మానందమే  నాయేసుని సన్నిధిలో
1. పాపమంతపోయెను రోగమంత తొలగెను - యేసుని రక్తములో
    క్రీస్తునందు జీవితం - కృపద్వార రక్షణ - పరిశుద్ధాత్మలో
2. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించె దేవాలయము నేనే
    ఆత్మతోను దేవుడు గుర్తించె నన్ను - అద్భుత మద్భుతమే
3. శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు - జయం పై జయమిచ్చును
    ఏకముగా కూడీ హోసన్నా పాడి - ఊరంతా చాటెదము  
4. బారధ్వనితో పరిశుద్ధులతో - యేసు రానైయుండే
    ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది - మహిమలో ప్రవేశిద్ధాం

పాట:53
    కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
    నను కరునించిన నాయేసయ్యా -2
1. నా యెడల నీకున్న తలంపులు - బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవా
    అవి వర్ణించలేను నా యేసయ్యా - అవి వివరించలేను నాయేసయ్యా
    నా యెడల నీకున్న వాంఛలన్నియు -2    "కృప"
2. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని - ఎన్నో దినములు నిన్ను నే మరచితిని
    విడువక ఎడబాయని నాయేసయ్యా - మరువక ప్రేమించిన నా యేసయ్యా
    ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా  -2   "కృప"

పాట 54
    కృపవెంబడి కృప పొందితిని నీ కృపలో తలదాచితిని
    యేసయ్య హల్లేలూయా  యేసయ్యా హల్లేలూయా
    క్షమవెంబడి క్షమ పొందితిని  నీ క్షమలో కొనసాగితిని
    మెస్సియ్యా హల్లేలూయా మెస్సియ్యా హల్లేలూయా
    కృపా సత్య సంపూర్ణుడా - క్షమా ప్రేమ పరిపూర్ణుడా      "కృప "
1. పాపములో పరి తాపమును - పరితాపములో పరివర్తనను
    పరివర్తనలో ప్రవర్తనను-ప్రవర్తనలో పరిశుద్దతను
    ప్రశవించెను పరిశుద్దాత్ముడు - ప్రశరించెను శిలువ శిక్షణలో  "2"  "కృప"
2. ఆత్మలో దీనత్వమును - దీనత్వములో సాత్వీకతను
    సాత్వీకతలో మానవత్వమును - మానవత్వములో దైవత్వమును 
    ప్రసవించెను పరిశుద్దాత్ముడు - ప్రసరించెను దైవ రక్షణలో   "2"  కృప"

పాట:55
    కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును -  రాగ భావాలతో నిన్ను ధ్యానింతును
    గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా
1. రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా (2)
    హృదయమే నీ ఆలయం -  నాలోనవసియించు నాయేసువా          "కోటి"
2. యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా (2)
    జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్‌                   "కోటి"
3. సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా (2)
    ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా  "కోటి"

పాట:56
పల్లవి:
    కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు    - 2
     గడచిన కాలమంతా - నన్ను దీవించినావు   -
1. ఇశ్రాయేలీల జనాంగమును - ప్రేమతో నీవు పిలిచినావు   - 2
    నలబై ఏళ్ళ ప్రయణములో - కొరతలేక నడిపినావు     - 2
     నీవే నాతోడుగా... అండగా నిలువగా ....   -  2
     గడచిన కాలమంతా - నన్ను రక్షించినావు   - 2
2. అబ్రాహామును ఆశీర్వదించి - గర్బఫలము ఇచ్చినావు  - 2
     ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి - శారా కోరిక తీర్చినావు   - 2
     నీవే నాతోడుగా.... అండగా నిలువగా ....  2
     గడచిన కాలమంతా - నన్ను దీవించినావు   - 2

పాట:57  
    గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము
    పగలు రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము "2"
    మము కాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము "2" "గడచిన"
1. కలచెందినా కష్ట కాలమున - కన్న తండ్రివై నను ఆదరించినా
    కలుషము నాలొ కానవచ్చిన -  కాదనక నను కరుణించినా "2"
    కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము  "గడచిన"
2. లోపములెన్నో దాగివున్నను - కాదనకా నను నడిపించినా
    అవిదేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసినా "2"
    దీవించిన దేవా నీకే స్తొత్రముల్‌  కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము  "2" "గడచిన"

పాట:58
    గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
    వేలాది దూతలతో భువికి - వేగమే రానుండే  -2
1. పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
    ధరసంఘ వదువునకై - తరలెను వరుడదిగో
2. మొదటగను గొర్రెగను - ముదమారగ వచ్చెను
    కొదమ సింహపు రీతి - కదిలెను ఘర్జనతో
3. కని పెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు
    ప్రదమమున లేచెదరు - పరిశుద్దులు మృతులు

పాట:59
     గాలి సముద్రపు అలలతో నేను - కొట్ట బడి, నెట్టబడి ఉండినప్పుడు(2)
     ఆదరించెనూ నీ వాక్యము - లేవనెత్తెనూ నీ హస్తము...(2)
1. శ్రమలలో నాకు తోడుంటివి - మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి
    ఆదు కొంటివి నన్నాదు కొంటివీ - నీ కృపలో  నను బ్రోచితివి (2)
2. వ్యాధులలో నిన్ను వేడు కొనగా - ఆపదలలో నిన్ను ఆశ్రయించగా
    చూపితివీ నీ మహిమన్‌ - కొని యాడెదము ప్రియయేసుని  (2)


పాట:60
     గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ 
     యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1. చూడు సమాధిని మూసినరాయి - దొరలుచు పొరలిడెను
    అందు వేసిన ముద్ర కావలి నిల్చెన- దైవ సుతుని ముందు        గీతం
2. వలదు వలదు ఏడవ వలదు - పరుగిడి ప్రకటించుడి
    తాను చెప్పిన విధమున తిరిగి లేచెను -  వెళ్ళుడి గలిలయకు     “గీతం
3. అన్న కయప వారల సభయును అదురుచు పరుగిడిరి
    అందు దూత గణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి  గీతం
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా
    మీ మేళ తాల బూర వాద్యముల్ - లెత్తి ధ్వనించుడి                “గీతం

No comments:

Post a Comment