పాట:61
చిరకాల స్నేహితుడా - నా హృదయాన సన్నిహితుడా (2)
నా తోడు నీవయ్యా - నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా - ప్రియ ప్రభువా
యేసయ్యా
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)
1. బంధువులు వెలివేసిన - వెలివేయని
స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య
స్నేహం, నాయేసుని స్నేహం “చిరకాల”
2. కష్టాలలో, కన్నీళ్లలో, నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ
కలిగించు, నాయేసుని స్నేహం “చిరకాల”
3. నిజమైనది, విడువనిధి - ప్రేమించు నీ స్నేహం
కలువరిలొ చూపిన, ఆ సిలువ స్నేహం, నాయేసుని
స్నేహం “చిరకాల”
పాట:62
జయము నీదే, జయము నీదే - ఓ
సేవకుడా (సోదరుడ)
భయములేదు, భయములేదు -
ఓ..సైనికుడా - 2
హల్లెలూయ - హల్లెలూయ
- హల్లెలూయ - హల్లెలూయ
హల్లెలూయ - హల్లెలూయ
-హల్లెలూయా.......
1. యేసు క్రీస్తు నీతో ఉండి - చేయి పట్టి నడపగా
భయమేంటి?- నీకు భయమేంటి?
- 2 "జయము"
2. రాజులే అయిన - అధికారులే అయిన
భయమేంటి ?- నీకు భయమేంటి? - 2
"జయము"
3. ముందు సముద్రమే ఉన్న - వెనుక శత్రువే తరిమిన
భయమేంటి - నీకు భయమేంటి? - 2
"జయము"
4. తుఫానులెన్ని ఎదురైనా - సుడిగాలులెదురైన
భయమేంటి ?- నీకు భయమేంటి? - 2
"జయము"
5. వేయిమంది పడిన - పది వేలమంది కూలిన
భయమేంటి ?- నీకు భయమేంటి? - 2
"జయము"
పాట:63
జయహే.. జయహే..
జయహే.. జయహే..
జయ జయ దేవసుతా
జయ జయ విజయసుతా
1. సిలువలో పాపికి విడుదల కలిగెను- విడుదల కలిగెను
కలువరిలో నవ
జీవన మొదవెను - జీవన మొదవెను
సిలువ పతాకము
జయమును గూర్చెను
జయమని
పాడెదను-నా విజయము పాడెదను
నా విజయము
పాడెదను
2. మరణపు కోటలో మరణమే సమసెను - మరణమే సమసెను
ధరణిలో జీవిత
భయములు దీరెను - భయములు దీరెను
మరణములో సహ జయములు
నావే (2)
"జయమని"
3. శోదనలో ప్రభుసన్నిది దొరికెను - సన్నిది దొరికెను
వేధనలే రణభూమిగా
మారెను భూమిగ మారెను
శోధన భాధలు
బలమును గూర్చెను (2) "జయమని"
4. ప్రార్ధనకాలము బహుప్రియమాయెను - బహుప్రియ మాయెను
సార్ధకమాయెను
దేవుని వాక్యము - దేవుని వాక్యము
ప్రార్ధనలే భలి
పీఠములాయెను (2) "జయమని"
5. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను - ప్రాపక మొదవెను
వరుడగు యేసుని
వధువుగ మారితి - వధువుగ మారితి
పరిశుద్ధుడు నను
సాక్షిగ పిలచెను (2) "జయమని"
పాట:64
జయహే జయహే -
క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే -
రారాజు ప్రభువుకే జయహే
నరులను చేసిన
దేవునికి - జయహే జయహే
మరణము గెలిచిన
వీరునికి - జయహే జయహే
త్రిత్వ
దేవునికి జయహే - తండ్రి దేవునికి - జయహే
ఆత్మనాదునికి
- జయహే - మన అన్న యేసునకు -జయహే - జయహే
1. తన మాటతో ఈ సృష్టిని - చేసిన దేవునికి జయహే
తన రూపుతో మానవులను - సృజించిన ప్రభువునకు జయహే
ఆది అంతముకు -
జయహే - అద్వితీయునకు - జయహే
అత్యున్నతునకు -
జయహే - అనాది దేవునికి – జయహే
2. దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు - జయహే
పరిశుద్దుడు
పరిశుద్దుడని దూతలు పొగడే ప్రభువుకు -
జయహే
అగ్ని నేత్రునకు
-జయహే - ఆత్మ రూపునకు - జయహే
అమరత్వునకు -
జయహే అనంతదేవునకు - జయహే
౩. తన రక్తమున్ మానవులకై
కార్చిన యేసునకు -జయహే
తన బలముతో
మరణంబును జయించిన వీరునకు - జయహే
సిల్వదారునకు
-జయహే - త్యాగసీలునకు -జయహే
మరణ విజయునకు
-జయహే - జీవించు దేవునకు -జయహే
4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు - జయహే
తనుండేడి స్థలమందున మనలను ఉంచెడిప్రభువుకు - జయహే
న్యాయ తీర్పరికి
- జయహే - సర్వశక్తునకు - జయహే
సర్వోన్నతునకు – జయహే - సైన్యముల అధిపతికి
- జయహే
పాట:65
జయశీలుడా మా
యేసయ్యా జీవించు వాడా మెస్సయ్యా
జయమిచ్చు వాడా
స్తోత్రముల్ నా ప్రాణప్రియుడా వందనం
ఆ...ఆ..ఆ...ఆ...హల్లెలుయా (2) ఆ.........హల్లెలూయా
1. బలమిచ్చు వాడా బలవంతుడా- శక్తి నిచ్చు
వాడా శక్తి మంతుడా
తృప్తినిచ్చు
వాడా తనయులకు - ముక్తి నిచ్చు వాడా మృత్యుంజయుడా
మాకై మరల
రానుంటివా - యేసు (2)
2. ఆదియు అంతము నీవేగా -
ఆరాద్యుండవు నీవేగా
అత్యున్నతుడా
అతి ప్రియుడా - ఆత్మస్వరూపి ఆశ్రయుడా
అనిశం నిన్నే
కీర్తింతును - యేసు (2)
3. నీవే దిక్కని నమ్మితిని - నిన్నే గురిగా ఎంచితిని
నీవే మాకు
తండ్రివి - నీకు సమస్తము సాద్యమే
నీపై సర్వం
మోపితిని - యేసు (2)
పాట:66
జుంటె తేనె
ధారలకన్న యేసు నామమే మధురం
యేసయ్యా
సన్నిధినే మరువజాలను
జీవిత కాలమంతా
ఆనదించెదా- యేసయ్యనే ఆరాధించెదా
1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
నాపై దృష్టి
నిలిపి సంతుష్టిగ నను ఉంచి
నన్నెంతగానో
దీవించి - జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే
2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
నాతోడై నిలచి
క్షేమముగా నను దాచి
నన్నెంతగానో
కరుణించి - పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే
3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించె
సువాసనగా నను మార్చె
నన్నెంతగానో
ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే
పాట:67
జీవిత యాత్రలో నాదు గురి నీవెగా -
నీకు సాటియెవ్వరు యేసువా
నీవు నడిచావు కెరటాలపై - నన్ను
నడిపించుమో యేసువా "జీవిత"
1. నన్ను
నడిపించు చుక్కాని నీవేకదా - నీవేకదా
నన్ను కాపాడు దుర్గంబు నీవేగదా - నీవేకదా
నీదు వాక్యంబు సత్యంబుగా - నాకు
నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా - నన్ను
నడిపించుమో యేసువా "జీవిత"
2. నాకు
నిరతంబు మధిలోన నీద్యానమే - నీద్యానమే
నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే - నీ గానమే
నాకు నీవేగా సర్వస్వము - నీదు
నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడనీవెగా - నిన్ను
స్తుతియింతుమో యేసువా "జీవిత"
పాట:68
జీవనదిని నా హృదయములో ప్రవహింప
చేయుమయా (2)
1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)
1. శరీరక్రియులన్నియు నాలో నశియించేయుమయు (2)
2. బలహీన సమయుములో నీ బలము ప్రసాదించుము (2)
3. ఆత్మీయవరములతో నన్ను అభిషేకం చేయుమయ (2)
4. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ (2)
పాట:69
జ్యోతిర్మయుడా - నా ప్రాణ ప్రియుడా - స్తుతి మహిమలు నీకే .....
నా ఆత్మలో అనుక్షణం - నా అతిశయము నీవే
నా ఆనందము నీవే - నా ఆరాధన నీవే.....
- 2 " జ్యోతి"
1. నా పరలోకపు తండ్రీ - వ్యవసాయకుడా
నీ తోటలోని
ద్రాక్షావల్లితో - నను అంటుకట్టి స్థిరపరిచావా
2. నా పరలోకపు తండ్రీ - నా మంచి కుమ్మరి
నీ కిష్టమైన
పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా
3. నా తండ్రి కుమార - పరిశుద్ధాత్ముడా
త్రీయేక దేవా -
ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెద
పాట:70
తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే -
తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా - 2
1. వేదన లేదు శోధనలేదు -
నీ హస్తము విడువనయ్యా - 2
భయమన్నది లేనే లేదు - ప్రేమతో
నడిపితివి నను ప్రేమతో నడిపితివి
2. నీ ఉపకారం స్మరియించి -
స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను.
చేయివిడువని నా యేసయ్యా -
కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా.
3. మంచికాపరి జీవకాపరి - హృదయా
పాలకుడా నా హృదయ పాలకుడా
ఆహారమై వచ్చితివా - ఆత్మతో
కలసితివా నా ఆత్మతో కలిసితివా.
4. నిన్ను నేను
పట్టుకొంటిని - భుజముపైన సోలెదను నీ భుజముపైన సోలెదను.
నీ రెక్కల నీడలోనుండి - లోకాన్ని
మరచితిని ఈ లోకాన్ని మరచితిని
5. రేయింపవలు వెతికానయ్యా
- నీకై వేచితిని నే నీకై వేచితిని
నా జీవితకాలమంతా - నీ నామం చాటెదను
నే నీనామం చాటెదను
పాట:71
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును "2"
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా "తల్లిలా"
1. తల్లియైన మరచునేమో - నేను నిన్ను
మరువను
చూడుము నా అరచేతులలో - నిన్ను
చెక్కియున్నాను "2"
నీ పాదము త్రొట్రిల్లనీయను నేను నిన్ను
కాపాడువాడు
కునుకడు నిదురపోడు అనిచెప్పి వాగ్దానము
చేసిన యేసయ్యా "తల్లిలా"
2. పర్వతాలు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నాకృప నీకు - నానిబంధనా
తొలగదు "2"
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా
నీదుభారమంతా మోసి నాదు
శాంతినొసగెదా
అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా "తల్లిలా"
పాట:72
తరతరాలలో...యుగయుగాలలో...జగజగాలలో...
దేవుడు...దేవుడు...యేసే దేవుడు......
1. భూమిని పుట్టింపక మునుపు - భూమికి పునాది లేనపుడు
దేవుడు...దేవుడు...యేసే దేవుడు......
2. పర్వతములు పుట్టక మునుపు - నరునికి రూపం లేనపుడు
దేవుడు...దేవుడు...యేసే దేవుడు......
3. సృష్టికి శిల్పకారుడు - జగతికి ఆదిసంభూతుడు
దేవుడు...దేవుడు...యేసే దేవుడు......
4. నిన్నా నేడు నిరంతరం - ఒకటైయున్న దేవుడు
దేవుడు...దేవుడు...యేసే దేవుడు......
పాట: 73
ధన్యము ఎంతో ధన్యము - యేసయ్యను కలిగిన జీవితము
ఇహమందున,పరమందున - నూరు రెట్లు ఫలముండును
వారె ధన్యులు - వారెంతో ధన్యులు (2)
1. ఎవరి అతిక్రమములు - పరిహరింపబడెనో
ఎవరి పాపములు - మన్నించబడెనో "వారెధన్యులు"
2. క్రీస్తు యేసుకు సమర్పించు - కరములే కరములు
క్రీస్తుయేసు స్వరము విను - వీనులే
వీనులు "వారెధన్యులు"
3. ప్రభు యేసుని సేవచేయు - పాదములే సుందరములు
ప్రభుని గూర్చి పాటపాడు - పెదవులే
పెదవులు "వారెధన్యులు"
4. ఆత్మలో
నిత్యము - ఎదుగుచున్న వారును
అపవాది తంత్రములు - గుర్తించు వారును "వారెధన్యులు"
5. శ్రమలయందు
నిలచి - పాడుచున్న వారును
శత్రు భాణములెల్ల - చెదరగొట్టు వారును "వారెధన్యులు"
పాట:74
ధ్యానించుము దివారాత్రము - దేవుని ధర్మ
శాస్త్రము
మహిమకు మార్గము మనిషికి స్వర్గము
చూపించు దేవుని వాక్యము... చూపించు దేవుని
వాక్యము...
1. నీటీ కాలువ గట్టునా నాటబడిన చెట్టువలెనుందువు
జీవితమంతయు - చేయున దంతయు
సఫలముగ జరుగును ఇది నమ్ముము (2)
2. త్రోవకు వెలుగు నిచ్చుదీపము - ఆత్మకు బలమునిచ్చు దైవము
చదువుము అనుదినం - ఈ ఉపదేశము
చేరెదము ఆ పరమ దేశము (2)
పాట:75
దినదినంబు యేసుకు - దగ్గరగా చేరుతా
అనుక్షణంబు యేసుని - నామదిలో కోరుతా
ఎల్లప్పుడు యేసువైపు - కనులెత్తి పాడుతా
ప్రభుని మాట నాదు భాట - విభుని తోనే
సాగుతా "దిన"
1. మారిపోయే లోకమందు -
మనుష్యులెంతో మారినా
మారునా ప్రభు యేసు ప్రేమ - ఆశతోడ చేరనా "దిన"
2. దైవ వాక్యం - జీవ
వాక్యం దిన దినంబు చదువుతా
ప్రభుని మాట నాదు భాట విభునితో
మాట్లాడుతా "దిన"
3. ఎన్నడు ఎడబాయడు నను - విడువడు ఏ మాత్రము
ప్రభువే నాదు అభయము - భయపడను నేనేమాత్రము
"దిన"
4. పరిశుద్దముగా అనుకూలముగా - జీవయాగమై నిలిచెద
సిలువ మోసి సేవ చేయ - యేసుతోనే కదులుతా "దిన"
పాట:76
దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
దేవుడేసే జీవజలము - త్రాగ రారండి
హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి
1. జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్
జలము పొంది - జీవము నొంద జలనిధి చేరండి "దేవుడేసే"
2. నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు
అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు
చేరండి "దేవుడేసే"
3. తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు
తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి
రండి "దేవుడేసే"
పాట:77
దావీదు వలె నాట్యమాడి - తండ్రీని
స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్ - యేసయ్యా స్తోత్రముల్ (2)
1. తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"
2. కష్టము కలిగిన - నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"
3. పరిశుద్ధ రక్తముతోపాపము కడిగిన - తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"
4. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రీని స్తుతించెదను (2) “యేసయ్యా"
పాట:78
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహొవా సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా - నా జీవమా యెహొవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించునో
సమస్తమా “దేవ”
1. జీవమా, యెహొవా నీకు జేసిన
మేళ్లన్ మరవకు - నీవు చేసిన పాతకంబులను
మన్నించి జబ్బు - లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే “దేవ”
2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను - జీవ కిరీటముగ
వేయును
నీ శిరసు మీద - జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే “దేవ”
3. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త - యౌవనంబై
వెలయునట్లుగ
మేలిచ్చి
నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే
“దేవ”
4. పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు - భూమికన్న
నాకసంబున్న
యెత్తుండు దైవ - ప్రేమ భక్తి
జనుల యందున ఆ కారణముచే “దేవ”
5. పడమటికి దూర్పెంతయెడమో పాపములకును మనకునంత-యెడము కలుగజేసియున్నాడు
మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే “దేవ”
6. మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి-మనము మంటివార మంచును
6. మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి-మనము మంటివార మంచును
జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపు చుండును ఆ కారణముచే “దేవ”
పాట:79
దేవుని
ప్రేమలో కొనసాగుమా - ఓ సోదరా ! ఓసోదరీ !!
విశ్వాసములో జీవించుమా....ఓ సోదరా ! ఓసోదరీ
!!
నీతిమంతుడు
నిత్య దేవుడు నీతో వుండును ఎల్లప్పుడూ...
1. కష్టములు నిను తొందర పెట్టినా - నిందలే నిను బాదించినా
అగ్నిశోధన
నీకు కల్గిన - కారు చీకటి కమ్మినా
మరణాంధకారపు
లోయలలో నీవు నడిచినను "దేవుని
"
2. వ్యాధి బాధలు చుట్టిముట్టినా - మరణ వేదనలు కల్గిన
దుష్టశక్తులు
ఆవరించిన - కష్టాల సుడులలో చిక్కిన
గాఢాందకారపు
లోయలలో సంచరించినను " దేవుని "
పాట:80
దేవుని యందు - నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు - నా ప్రాణమా
1. ఏ పాయము రాకుండ
నిన్ను - దివారాత్రులు కాపాడు వాడు
ప్రతిక్షణం - నీపక్షముండు రక్షకుడు "దేవుని"
2. చీకటిని వెలుగుగ
చేసి - ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు జీవమగు - మార్గము యేసే
"దేవుని"
3. నీకు సహాయము
చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము - ఆధరణ ఆయనలో "దేవుని"
4. తల్లి తన
బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను
తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు "దేవుని"
5. నీకు
విరోధముగా నిరూపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారుదురు "దేవుని"
6. పర్వతములు
తొలగి పోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు - నీ దేవుడు "దేవుని"
7. స్తుతి మహిమలు
నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ "దేవుని"
పాట:81
దేవుని సముఖ జీవ కవిలెలో - నీ
పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా
1. జీవవాక్యము నిలలో చాటుచు -
జీవితము లర్పించిరే
హత సాక్షుల కవిలెలోన - నీ పేరున్నదా...ఆ..ఆ
నీపేరున్నదా "దేవుని"
2. ఆకాశమండలములలో తిరిగెడు -
అందకార శక్తులను గెలిచిన
విజయవీరుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ
నీపేరున్నదా "దేవుని"
3. పరిశుద్ధ యెరుషలేము సంఖ్య -
పరిశుద్ధ గ్రంధము సూచించు
సర్వోన్నతుని పురములలో - నీ పేరున్నదా...ఆ..ఆ
నీపేరున్నదా "దేవుని"
దేవుని సముఖ జీవ కవిలెలో - నీ
పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా
4. దేవుని సన్నిధి మహిమ ధననిధి -
దాతను వేడి వరము పొందిన
ప్రార్ధన వీరుల కవిలెలో - నీ
పేరున్నదా...ఆ..ఆ నీపేరున్నదా
"దేవుని"
5. పరమునుండి ప్రభువు దిగగా -
పరిశుద్ధులు పైకెగయునుగా
పరిశుద్ధుల కవిలెలో - నీ పేరున్నదా...ఆ..ఆ
నీపేరున్నదా "దేవుని"
పాట:82
దేవుని సన్నిధిలో సంపూర్ణ
సంతోషం
ఆ
శిలువ నీడలో సంపూర్ణ క్షేమము
నా యేసులో దొరుకునులే నిత్యాజీవము
నా క్రీస్తులో
దొరుకునులే నిత్యానందము
1. రాజులను అధికారులను
నమ్ముకొనుటకంటే
నా యేసుని నమ్ముటలో నా జీవిత ధన్యకరం
నా యేసు సన్నిధి అదే నాకు పెన్నిధి
తోడుగా నీడగా నను నడిపించునులే
జీవము జీవకీరీటము నా యేసులో దొరుకునులే
2. కునుకడు నిద్రపోడు నా దేవుడు
ఎన్నడు
కంటికి రెప్పవలే ననుకాచి కాపాడును
కరువైన కారు చీకటైనా భయమికలేదులే
కరుణించి తన కృప చూపి నను నడిపించును
పాట:83
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము - చేయుటయే మంచిది
1. యెరుషలేము యెహోవాయే - కట్టుచున్న వాడనీ
ఇశ్రాయేలీయులను - పోగు చేయు వాడని
2. గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడనీ
వారి గాయము లన్నియు -
కట్టుచున్న వాడని
3. నక్షత్రముల సంఖ్యను - ఆయనే నియమించెను
వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని
4. ప్రభువు గొప్ప వాడును - అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని
5. దీనులకు అండాయనే - భక్తి హీనుల కూల్చును
సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
6. ఆయన ఆకాశము - మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము - సిద్ధ పరచు వాడని
7. పర్వతములో గడ్డిని - పశువులకు మొలిపించును
అరచు పిల్ల కాకులకును - ఆహారము తానీయును
8. యెరుషలేము యెహోవను - సీయోనూ నీ దేవునీ
కీర్తించుము కొని యాడుము - ఆనందించు వాడని
పాట:84
దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ
నున్నాడు - 2
1. ఏదెనులో ఆదాముతోనుండెన్ -హానోకుతోడ నేగేను
ధీర్గదర్శకులతో నుండెను - ధన్యులు దేవుని
గలవారు "తోడుగ"
2. దైవాజ్ఞను శిరసావాహించి - దివ్యముగ నబ్రాహము
కన్న కుమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన
యపుడు "తోడుగ"
3. యేసేపు ద్వేషించబడి నపుడు - గోతిలో త్రోయ బడినపుడు
శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కిన
యపుడు "తోడుగ"
4. ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున
యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినా
యపుడు "తోడుగ"
5. దావీదు సింహము నెదిరించినపుడు - దైర్యముగ, చీల్చీనపుడు
గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరమ
బడినపుడు "తోడుగ"
6. సింహపు బోనులో దానియేలు - షడ్రకు,మేషకు, అబెద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్ - నల్గురుగా
కనబడినపుడు "తోడుగ'
7. పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపొస్తులులు విశ్వాసులు - హింసించాబడిన
యపుడు "తోడుగ"
పాట:85
దేవుడు
మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు
జీవము
గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము "2"
యుద్ధం
యెహోవాదే రక్షణా యెహోవాదే
విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే " దేవుడు "
1. మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే
ఆయన
ముఖ కాంతియే మాకు జయమిచ్చును
"2"
తనదగు ప్రజగా
మము రూపించి - నిరతము మాపై కృపచూపించి
తన మహిమకై మము పంపించి - ప్రభావమును
కనబరుచును " యుద్ధం"
2. మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం
భలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము "2"
దేవుని
చేసుర క్రియలు చేసి - భూమిని తల క్రిందులుగా చేసి
ఆయన
నామము పైకెత్తి - ప్రభు ద్వజము స్తాపింతుము
"యుద్ధం "
పాట:86
దేవుడంటే నీకిష్టమా - ఏ కష్టానికైన
సిద్ధమా - 2
అవసరానికే దైవమా అనుభవించుటే న్యాయమా
నీ సుఖమే ముఖ్యమా తన త్యాగమే వ్యర్ధమా
నీ బ్రతుకే నీ ఇష్టమా - 2 దేవునికే సంతాపమా
"దేవుడంటే"
1. హానోకు భూమిపై దేవునితో నడచెను
దేవునికే యిష్టుడై - దేవుడతనిని తీసుకెళ్ళెను
నువ్వు దేవునికిష్టుడవైతే నిను కూడా
తీసుకెళ్ళును
తన దూతలనే పంపి లాజరువలె తీసుకెళ్ళును
దేవునిలో కష్టపడి - రక్షించుటకిష్టపడి
దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి
ఆదేవుని పని చేసేవారతనికి కావాలి
వారే తనకిష్టం - తన ఇష్టం
ఎవరికి ఇష్టం
2. నశియించు ఆత్మల కొరకు కదలాలి
నీవు నేడు
తన వారిని రక్షించుట కొరకు నలగాలి ప్రతి రోజు
క్రీస్తునే నమ్ముటకాక శ్రమపడుటే నేర్చుకోవాలి
నిను చూచిన ఆదేవుడే దూతలతో పొంగిపోవాలి
ఒక్క పాపి మారితే ఒకరిని నీవు మార్చితే
అంతకన్న ఆదేవునికింకేమి కావాలి
ఆదేవుని పనిలో మరణిస్తే నినుచూడాలి
వారే తనకిష్టం - తన ఇష్టం ఎవరికి ఇష్టం
పాట:87
దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన
దుర్గము= మహా
వినోదుడాపదల సహాయుడై నన్ బ్రోచును
అభయ - మభయ - మభయ మెప్పు - డానంద –
మానంద - మానంద మౌగ ||దేవుడే||
1. పర్వతములు కదలిన నీ -
యుర్వి మారు పడినను =
సర్వమును ఘోషించుచు నీ - సంద్రముప్పొంగినన్ -
అభయ - మభయ - మభయ మెప్పు-
డానంద ||దేవుడే||
2. దేవుడెపుడు తోడు కాగ -
దేశము వర్దిల్లును =
ఆ తావునందు ప్రజలు మిగుల - ధ
న్యులై వసింతురు –
అభయ - మభయ - మభయ మెప్పు -
డానంద ||దేవుడే||
3. రాజ్యముల్ కంపించిన
భూ- రాష్ట్రముల్ ఘోషించిన =
పూజ్యుండౌ యెహోవా వైరి - బూని
సంహరించును –
అభయ - మభయ - మభయ మెప్పు -
డానంద ||దేవుడే||
పాట:88
దేవుని వారసులం - ప్రేమ
నివాసులము
జీవన యాత్రికులం - యేసుని
దాసులము
నవ యుగ సైనికులం - పరలోక
పౌరులము
హల్లెలూయ - నవ యుగ సైనికులం
- పరలోక పౌరులము
1. దారుణ హింస లలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
2. పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక - బలము
ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై -
సర్వాంగ హోమము జేయుదము
3. అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే
వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము
పాట:89
నజరేయుడా నాయేసయ్యా -
ఎన్నియుగాలకైనా
ఆరాధ్య దైవం నీవేనని -
గళమెత్తి నీకీర్తి నే చాటెద
1. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి
శూన్యములో ఈ
భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా
నీకే వందనం -
నీకే వందనం (2) "నజరే"
2. ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి
జలములలో బడి
నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా
నీకే వందనం -
నీకే వందనం (2) "నజరే"
3. సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా
సీయోనులో నిన్ను
చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా
నీకే వందనం -
నీకే వందనం (2) "నజరే"
పాట:90
నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా
నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా
చేయితట్టి వెన్నుతట్టి చక్కని
ఆలొచన చెప్పి (2)
1. అంధకారమే
దారి మూసినా - నిందలే నను కృంగదీసినా
తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం
వరకు నను చేర్చుతాడు
2. కష్టాల
కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా
తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం
వరకు నను చేర్చుతాడు
3. నాకున్న
కలిమి కరిగిపోయిన - నాకున్న బలిమి తరిగిపోయిన
తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం
వరకు నను చేర్చుతాడు
No comments:
Post a Comment