Friday, September 21, 2012

TELUGU CHRISTIAN LYRICS 91 - 110

పాట:91                               
      నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
      పలుమార్లు మోసపోయావు  పలుమార్లు మోసపోయావు
      ఇలా... ఎంత కాలము... నీవు సాగిపోదువు...
1.  రాజులను నమ్మి - బహుమతిని ప్రేమించినా
     బిలాము ఏమాయెను? - దైవదర్శనం కోల్పోయెను
     నాయేసయ్యను నమ్మిన యెడల
     ఉన్నత బహుమానము  నీకు నిశ్చయమే    "నమ్మినమ్మి"
2.  ఐశ్వర్యము నమ్మి - వెండి బంగారము ఆశించిన
     ఆకాను ఏమాయెను? -అగ్నికి ఆహుతి ఆయెను
     నాయేసయ్యను నమ్మిన యెడల ( యెహోషువ 7:21,26 )
     మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే           "నమ్మినమ్మి" 
3. సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన
    గెహజీ ఏమాయెను? - రోగమును సంపాదించెను
    నాయేసయ్యను నమ్మిన యెడల ( 2రాజులు 5:26,27 )
    శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే          "నమ్మినమ్మి"

పాట:92
    నా తలంపంతా నీవే యేసయ్యా  నే కోరెదంతా నీతోడెకదయ్యా - 2
    ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ - నీ సేవయే నాభాగ్యం యేసయ్యా
1. అణువణువు నా ప్రాణమంతా వేచియున్నది నీకై నిరతము -
    నీవే నాకు సర్వము ప్రభువా  - 2
2. నిన్ను ఎరుగక నశించిపోతున్న - ఆత్మలభారం నాలోరగిలే - 2
    నీకై నేను ముందుకు సాగెద - 2
3.  నలిగిపోతుంది నాప్రియ దేశం - శాంతిసమాధనం దయచేయుమయ్యా - 2
     రక్షణ ఆనందం నింపుము దేవా  - 2

పాట:93
   నన్నాకర్షించిన నీ స్నేహబంధం - ఆత్మీయ అనుబంధం (2)
   ఆరాధన - నీకే యేసయ్యా (2)
   నాచేయిపట్టి నన్ను నడిపి చేరదీసిన దేవా (2)
1 మహా ఎండకు కాలిన అరణ్యములో
   స్నేహించిన దేవుడవు నీవూ
   సహాయకర్తగ తోడు నిలచి తృప్తి పరచిన దేవా..
   చేరదీసిన ప్రభువా..    (2)
   నన్నాకర్షించిన నీ ప్రేమ బంధం- అనురాగ సంబంధం 
2 చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
   ప్రేమించిన నాధుడవు నీవే
   సదాకాలము రక్షణ నిచ్చి శక్తినిచ్చిన దేవా
   జీవమిచ్చిన ప్రభువా..  .(2)
  నన్నాకర్షించిన నీ స్నేహ బంధం - ఆత్మీయ అనుబంధం 

పాట:94
    నా ప్రియుడు నా స్నేహితుడు 
    అతి మధురం అతి కాంక్షనీయుడు
    దవళవర్ణుడు రత్నవర్ణుడు
    అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు
1. ప్రభువా పది వేళలో అతి సుందరుడా
    పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా      - 2
    పరలోకములో మమ్ము చేర్చుకొందువా - 2   "నాప్రియుడు"
2. సుగంధ పరిమళాల సువ్వాసనా
    పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా
    షూలమ్మితి సంఘమునే కోరుకొందువా        "నాప్రియుడు"
3. ప్రభు యేసు నామమందు విశ్వసించినా
    పవిత్రా రక్తములో కడుగ బడుదువు
    పరిశుద్ధుల విందులో ఆనందింతువు             "నాప్రియుడు"

పాట:95    
    నాది నాది అంటు వాదులాట నీకెందుకు
    ఏదినీది కాదు సత్యమిది  ఎరుగ వెందుకు
    ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటినే వెదుకు  (2)
1 నిన్న నీది అనుకున్నది నేడు నీది కాకపోయెనే
    నేడు నీకు  ముందున్నది రేపు కానరాకపోవునే
    క్షణికమైన వాటికొరకు ప్రాకులాట నీకెందుకు
    అక్షయ దైవ రాజ్యమే నిలుచును తుదవరకు
2 నీదగ్గర ధనముంటే నీచుట్టు మనుష్యులుంటారు
    నీలోపల బలముంటే నిను మా వాడని అంటారు
    నీధనము నీబలగం నీ చావునాపలేవు
    తప్పకుండ ఒక నాడు మట్టిలోన కలుస్తావు
3 నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు   
    నీ యెక్క సొంత నీతి శిక్షను తప్పించలేదు 
    గడ్డి పూవులాంటిదేగదా ఇలలోన నీదు జీవితం
    యేసయ్యకు అర్పిస్తే అవుతుందిలే సార్థకం 

పాట:96
    నా జీవిత యాత్రలో ప్రభువా - నీ పాదమే శరణం
    ఈలోకమునందు  నీవు తప్ప - వేరే ఆశ్రయం లేదు
1. ఈ లోకనటన ఆశలన్నియు - తరిగి పోవుచుండగా
    మారని నీ వాగ్ధానములన్నియు - నే నమ్మిసాగెదను    "నాజీవి"
2. పలువిధ శోధన, కష్టములు - ఆవరించు చుండగా
    కలత చెందుచున్న నా హృదయమును - కదలకకాపాడుము  "నాజీవి" 
3. నీసన్నిధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు
    నీదు కుడి హస్తములో నిత్యమున్న - నాకు సుఖక్షేమమేగా  "నాజీవి" 
పాట:97
   నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా...
   నా క్రియలు కాదు నీ కృపయే దేవా నా ప్రాణమా యేసయ్యా...
   నదులంత తైలం, విస్తార బలులు నీ కిచ్చినా చాలవయ్యా..
   నీ జీవితాన్నే నాకిచ్చినావు నీకే నా జీవమయ్యా....
   హలెలూయా...ఆమేన్‌ హలెలూయా -
   హలెలూయా...ఆమేన్‌ హలెలూయా
1. నాధీన స్థితిని గమనించి నీవు - దాసునిగా వచ్చావుగా
    నా దోష శిక్ష భరియించినీవు - నను నీలో దాచావుగా
    ఏమంత ప్రేమ నా మీద నీకు నీ ప్రాణమిచ్చావుగా
    నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను - యజమానుడవు నీవేగా  " హలె" 
2. నా ప్రియులే నన్ను వెలివేసి నప్పుడు నీవు చేరదీసావుగా
    నా ప్రక్కనిలచి నను దైర్యపరచి కన్నీరు తుడిచావుగా
    నేనున్న నీకు భయమేలనంటు ఓదార్పునిచ్చావుగా
    చాలయ్యా దేవా నీక్రుపయే నాకు బ్రతుకంతయు పండుగా  "హలె"
3. ఆ ఊభిలోన నే చిక్కి నప్పుడు నీవు నన్ను చూసావుగా
    నీ చేయి చాపి నను పైకి లేపి నీవాక్కు నిచ్చావుగా  
    నా సంకటములు నా ఋణపు గిరులు అన్నిటిని తీర్చావుగా
    నీలోన నాకు నవజీవమిచ్చి నీ సాక్షిగా నిలిపావుగా   "హలె"

పాట:98
      నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా 
అ.ప: నీవు పలికితే నాకు మేలయా - నీదర్శనమే నాకు చాలయా 
1. నీవాక్యమే నన్ను బ్రతికించేది - నా భాధలలో నెమ్మదినిచ్చేది      "నీవు"
2. నీవాక్యమే స్వస్ధత కలిగించేది - నా వేదనలో ఆదరణిచ్చేది         "నీవు
3. నీవాక్యమే నన్ను నడిపించేది - నా మార్గములో వెలుతురునిచ్చేది నీవు"

పాట:99
    నా పేరే తెలియని ప్రజలు  ఎందరో ఉన్నారు
    నా ప్రేమను వారికి ప్రకటింప   కొందరే ఉన్నారు || 2 ||
   ఎవరైనా  మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2    "నా పేరే "
1. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
    మారుమూల గ్రామములో  ఊరిలో పలు వీధుల్లో || 2 ||
    ఎవరైనా  మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2    "నా పేరే "
2. వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండి
    వెళ్ళలేక పోతె  వెళ్లే వారిని పంపండి              || 2 ||
    ఎవరైనా  మీలో ఒకరైనా - 2 - వెళతార నా ప్రేమను చెబుతారా - 2    "నా పేరే "

పాట:100
    నా వేదనలో వెదకితిని - శ్రీయేసుని పాదాలను
    నా మనస్సులో కోరితిని - నీ రూపమునే దీనుడనై          "నావేదన"
1. వేకు జాములో విలపించితిని - నా పాపములో వ్యసనములో
    ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2  "నావేదన"
2. నీ హస్తములో నిదురింపజేయుమా - నీ ప్రేమలో లాలించుమా    
    ఓదార్చుము విసుగొందక - నీ కృపలో నా ప్రభువా - 2  "నావేదన"

పాట 101
    నాకనుల వెంబడి  కన్నీరు రానీయకా...
    నా ముఖములో దుంఖమే ఉండనీయకా
    చిరు నవ్వుతో నింపిన యేసయ్యా - చిరు నవ్వుతో నింపినా యేసయ్యా..
     ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే  "2"      " నాకనుల"
1. అవమానాలను ఆశీర్వాదముగా - నిందలన్నిటినీ దీవెనలగా మార్చి            "2'
     నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై....                                     "2"  
     చిరు నవ్వుతో నింపిన యేసయ్యా
    చిరు నవ్వుతో నింపినా యేసయ్యా..  "ఆరాధనా"
2. సంతృప్తి లేని నాజీవితములో - సమృద్దినిచ్చి ఘన పరచినావు                 "2"

     నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి ......                                 "2"
     చిరు నవ్వుతో నింపిన యేసయ్యా
     చిరు నవ్వుతో నింపినా యేసయ్యా..   "ఆరాధనా"

పాట:102
   నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
    సుడిగాలిలో నైనా - జడివానలోనైనా
    ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
    నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము
1. ఆరని దీపమై దేదీప్యమానమై
    నాహృదయ కోవెలపై దీపాల తోరణమై
    చేసావు పండగ - వెలిగావు నిండుగా     "నా దీపము"
2. మారని నీ కృప నను వీడనన్నది
    మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది
    మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా     "నా దీపము"
3. ఆగని హోరులో ఆరిన నేలపై
    నాముందు వెలసితివే సైన్యములకధిపతివై
    పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా      "నా దీపము"

పాట:103                
సా: నా ప్రాణానికి ప్రాణం - నీవే యేసయ్యా...
     స్నేహానికి నిజ స్నేహం - నీవే మెసయ్యా..
ప:  నా ప్రాణానికి ప్రాణాం నీవేనయ్యా -
     స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
     నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా..
1. ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
    కన్నీటి సమయములో ఒంటరిని చేసారు   - 2
    ఆస్తులున్న వేళ్ళలో అక్కున చేరారు
    ఆపద సమయాలలో అంతులేక పోయారు
    జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి
    నా స్నేహమా కన్నీరు తుడిచితివి - 2
2. నీవే నా ప్రాణమని కడవరకు విడువ నని
    బాసలన్ని మరచి అనాధగ నన్ను చేసారు
    నేనున్నానంటు నా చెంతన చేరావు
    ఎవరు విడచిన నను విడువనన్నావు
    జంటగ నిలచితివి నా ప్రాణమా - కన్నీరు తుడిచితివి
    నా స్నేహమా కన్నీరు తుడిచితివి – 2

పాట:104
    నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ
    నావన్ని కృపచేత నీవలన నొందిన - భావంబునను నేను బహుదైర్యమొందెద
1. నీకు నా ప్రాణము నిజముగ నర్పించి - నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద  
2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని - నిత్యంబు గరముల నీ సేవ జేసెద
3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు - ఆశచే నడిపించు మరల నా పదములు
4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి
5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ - యావంత యైనను నాశించ మదిలోన
6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే - సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు
7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి - మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము
8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి - పదిలంబుగా దాని బట్టి కాపాడుము

   పాట:105
    నా నోటన్‌ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను ..
    ఆనందముతో హర్షించి పాడెదన్‌
    జీవించు కాలమంతయు - హల్లేలూయ....
1. అంధకార పాపమంత - నన్ను చుట్టగా
    దేవుడే నా వెలుగై - ఆధరించెను
2. దొంగ ఊబి నుండి - నన్ను లేవనెత్తెను
    రక్తముతో నన్ను కడిగి - శుద్ది చేసెను
3. నాకు తల్లిదండ్రి మరియు - మిత్రుడాయెనే
    నిందలోర్చి ఆయనను - ప్రకటింతును
4. వ్యాది భాధ లందు నేను - మొర్ర పెట్టగా
    ఆలకించి బాధ నుండి నన్ను - రక్షించెను
5. భువి లోని భాదలు - నన్నేమి చేయును
    పరలోక దీవెనకై - వేచి యున్నాను

 పాట:106
1.  నా హృదయము వింతగ మారెను (3)
    యేసు నాలోకి వచ్చినందునా (2)
    సంతోషమే... సమాదానమే (3) 
    చెప్పనాశక్యమైన సంతోషం -2
2. నిత్య జీవము నీకు కావలెనా (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే
3. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే
4. నిత్య సమాధానం నీకు కావలెనా (3)
    నేడే యేసు నొద్దకు రమ్ము (2) “సంతోషమే

పాట:107            ( కోరస్‌ )
    నా జీవం నా సర్వం నీవే దేవా...(2)
    నాకొరకే బలియైన గొర్రె పిల్ల   
    నా కొరకే రానున్న ఓ మెస్సయ్య
    నా జీవం నా సర్వం నీవే దేవా... (2)
    తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి
    మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి (2)
    ఏమివ్వ గలను నీ ఎనలేని ప్రేమకై
    విరిగి నలిగిన హృదయమే నే నర్పింతును
    నా జీవం నా సర్వం నీవే దేవా... (2)
    నీవే నీవే దేవా..... నాకొరకై బలియైన గొర్రె పిల్ల
    నా కొరకే రానున్న ఓ మెస్సయ్య...
    నా జీవం నా సర్వం నీవే దేవా... (4) + 1

పాట:108
   నాదు జీవ మాయనే నా సమస్తము
   నా సర్వస్వం యేసుకే  నా సు జీవము
   నాదు దైవము దివి దివ్య తేజము
1.క్రుంగిన వేళ భంగ పడినవేళ నాదరికి చేరెను
   చుక్కాని లేని నా నావలో నేనుండ అద్దరికి చేర్చెను
   ఆత్మతో నింపెను ఆలోచన చెప్పెను
2.సాతాను బందీనై కుములు చున్న వేళ విడిపించె శ్రీయేసుడే
   రక్తా మంత కార్చి ప్రాణాలె భలి చేసి విమోచన దయచేసెను
   సాతానుని అనగా త్రొక్కా అధికార బలమిచ్చెను
3. కారు మేఘాలే క్రమ్మినా వేళా నీతి సుర్యుడే నడుపును
    తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవిత నావన్‌
    త్వరలో ప్రభు దిగి వచ్చును తరలి పోవుదును ప్రభునితో

పాట:109 
    నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా - నీధరికి నడిపించు నావా నాజీవ నావ
1. నిను నేను ఈ జగాన కొనియాడగా - అనువైన పాటపాడి వినుతింపగ
    నీ పదసేవ చేయగ దేవా - ఎనలేని జీవమును - వనగూర్చుమయ్యా - 2
2. నా హృదయ ఆలయాన నివశింపుమా - నీ మహిమ మందిరాన నను నిల్పుమా - 2
    పావన నామ జీవనధామ - నాత్మ దీపమును - వెలిగించుమయ్యా - 2

పాట: 110
    ఓ ...హో.. హో , ఓ...ఓ..ఓ, ఓ....ఓ....ఓ,
    హైలెస్సా.... హైలో,....హైలెస్సా   “2”
    నా చిన్నిదోనెలో యేసు ఉన్నాడు భయమేమి లేదు నాకు ఎప్పుడు
   యేసుపైనే నా చూపు ఉంచెదా యేసుతోనేనిత్యం నేను సాగెద  హైలెస్సా
1. పెనుగాలులే, ఎదురొచ్చినా తుఫానులే నన్ను ముంచినా
    జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద     హైలెస్సా
    హైలెస్సా.... హైలో,....హైలెస్సా   “2”
2. సాతానుడే శోధించినా పరిస్థితులే వికటించినా
    జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద     హైలెస్సా
    హైలెస్సా.... హైలో,....హైలెస్సా   “2”

No comments:

Post a Comment