Thursday, August 23, 2012

TELUGU CHRISTIAN LYRICS 14

పాట: 158
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక -2
    యేసులాగా ఉండాలని - యేసుతోనే నడవాలని -2
    నిలవాలనీ..గెలవాలనీ..-2 యేసుతోనే ఉండి పోవాలని
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
1. ఈ లోకములో పరలోకంలో - నీతోనే నివసించాలని
    ఇంటా బయటా యేసునాధుని - కంటి పాపనై వెలిగి పోవాలని -2
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక
2. యాత్రను ముగించిన వేళ - ఆరోహణమై పోవాలని -2
    క్రీస్తు యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని - 2
    ఇదే...నాకోరిక నవ జీవన రాగ మాలిక


పాట: 159
    నీకున్న భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా..
    ఆయనె నిన్ను ఆధరించునూ - అద్భుతములు చేయున్‌
1. నీతి మంతులను కదలనీయడు - నిత్యము కాచి నడిపించును
2. మనలను కాచే దేవుడాయనే - మనకునీడగా ఆయనే ఉండును
3. తల్లి తండ్రి విడచినను - ఆయనే మనలను హత్తుకొనును
4. ప్రభువు మన పక్షమైయుండగా - ఎదురు నిలువ గల వాడెవ్వడు
5. ప్రభుకు జీవితం సమర్పించెదం - ఆయనే అంతా సఫలం చేయును
6. మనకున్న భారమంతా ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా
    ఆయనే మనలను ఆధరించును - అద్భుతములు చేయును..

పాట: 160
     బంగారం కన్న ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్‌ గ్రంధము -2
1. గ్రంధాలలో అది రాజ గ్రంధము - వేధాలలో అది సత్యవేదము -2
     నిజమైన మార్గము చూపు దీపము -2
     హల్ల్లేలుయా.. హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా..  "బంగా"
2. బుద్దిహీనులకు జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును -2
     బాగుగ పఠియించి మేలు పొందుము -2                      "హల్లే"
3. దేవుని వాక్యమును ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును -2
    నీ భాధలలో నిన్ను ఆదుకొనును -2                          "హల్లే"
4. నీ పాప జీవితమును మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును -2
    నీ మార్గములను వెలిగించును -2                                 "హల్లే"
5. భూమి,ఆకాశములు గతియించును - దేవుని మాటలు గతియింపవు -2
    అవియన్ని నిజముగ నెరవేరును  -2                             "హల్లే"
పాట: 161
    బంగారు నగరిలో నాకొరకు ఇల్లు - కట్టేను నాయేసు రాజు
    సుందరమైన నగరం - రత్నరాసుల పరమపురం  
1. నీవును యేసుని అంగీకరించిన - కట్టును నీకును ఇల్లు
    భాధలు లేని నగరం - రోధన లెరుగని పరమపురం
2. తానుండె చోటుకు కొనిపోవుటకును - రానుండె నాయేసు రాజు
    ఆకలి కాని నగరం - చీకటి కానని పరమపురం

పాట: 162
    వచ్చుచుండెన్‌ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
1. తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని  సునామియు -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
2. వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను  -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
3. ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు  -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
4. భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
5. అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు  -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు  

పాట:163
    ప్రేమా...యేసు నీ ప్రేమ....ప్రేమా....ఉన్నతా ప్రేమా....
1. లోకములు మారిననూ - మారనీ ప్రేమా 
    సంద్రములు చల్లార్చని - యేసు నీ ప్రేమా
2. తల్లి బిడ్డను మరచినా - మరువనీ నీప్రేమా
    ఆది అంతము లేని ప్రేమ - యేసు నీ ప్రేమ
3. పాపులను రక్షించె - కల్వరి ప్రేమ
    నిన్న నేడు ఏకరీతిన - ఉన్న ప్రేమా
4. నింగి నేలా మారిననూ - మారనీ ప్రేమా
    డంబములేని శాశ్వత ప్రేమ - యేసు నీ ప్రేమా

పాట:164
    స్తోత్రబలి స్తోత్రబలీ  మంచి దేవ నీకేనయ్యా
    శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
1. నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే -2
    నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా -2 
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2      "స్తోత్ర"
2. రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి   -2
    మరువని నా స్నేహమా - కలసి సంతోషింతును  -2
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2     "స్తోత్ర"
3. నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి -2
    ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2     "స్తోత్ర"
4. వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2
    యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును  -2
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2     "స్తోత్ర"

పాట:165
    నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ
    నావన్ని కృపచేత నీవలన నొందిన - భావంబునను నేను బహుదైర్యమొందెద
1. నీకు నా ప్రాణము - నిజముగ నర్పించి
    నీకు మీదుగట్టి - నీ కొరకు నిల్పెద  
2. సత్యంబు నీ ప్రేమ - చక్కగా మధి బూని
    నిత్యంబు గరముల - నీ సేవ జేసెద
3. నీ సేవ జరిగెడు - నీ ఆలయమునకు
    ఆశచే నడిపించు - మరల నా పదములు
4. పెదవులతో నేను - బెంపుగ నీ వార్త
    గదలక ప్రకటింప - గలిగించు దృడభక్తి
5. నా వెంబడి కనకంబు - నా తండ్రి గైకొనిమీ
    యావంత యైనను - నాశించ మదిలోన
6. నీవు నా కొసగిన - నిర్మల బుద్దిచే
    సేవ జేయగ నిమ్ము - స్థిరభక్తితో నీకు
7. చిత్తము నీ కృపా - యత్తంబు గావించి
    మత్తిల్ల కుండగ - మార్గంబు దెలుపుము
8. హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి
    పదిలంబుగా దాని - బట్టి కాపాడుము

పాట:166
     సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
    శిలనైన నన్ను మార్చెను  యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    అమూల్యమైన రక్తము యేసు రక్తము
1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
    సంధి చేసి చేర్చునుయేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
2. సమాధాన పరచును యేసు రక్తము
    సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము
3. నీతి మంతులుగా చేయును యేసు రక్తము
    ధుర్నీతినంత బాపును యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    నిబంధన నిలుపును యేసు రక్తము
4. రోగములను బాపును యేసు రక్తము
    దురాత్మన్‌ పారద్రోలును యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    శక్తి బలము నిచ్చును యేసు రక్తము

పాట:167
    నేసాగెద యేసునితో - నా జీవిత కాలమంతా
1. యేసులో గడిపెద - యేసుతో నడిచెద
    పరమున చేరగ నే వెళ్ళెదా - హానోకుతో సాగెదా..ఆ   "నేసాగెద"
2. తల్లి మరచిన తండ్రి విడచినా - బందువులే
    నను వెలివేసినా - బలవంతునితో సాగెదా..ఆ   "నేసాగెద"
3. లోకపు శ్రమలు - నన్నెదిరించినా - కఠినులు రాళ్ళతో
    హింసించినా - స్తెఫనువలె సాగెదా..ఆ      "నేసాగెద" 
పాట:168
    పరమ జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
    నిరంతరము నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును
   "యేసు చాలును చాలును - యేసు చాలును చాలును"
"ఏ సమయమైన - ఏ స్థితి కైన - నాజీవితములో యేసు చాలును"
1. సాతాను శోధన లధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
    లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను
2. పచ్చిక బయలలో పరుండచేయున్‌ - శాంతి జలము చెంత నడిపించును
    అనిశము ప్రాణము తృప్తిపరచున్‌ - మరణ లోయలలో నను కాపాడును
3. నరులెల్లరు నను విడిచినను  - శరీరము క్రుళ్ళి కృషించినను
    హరించినన్‌ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను

పాట:169
    ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా
1. శ్రేష్టమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి
    పరముడ నిన్ను ప్రణుతించెదను - పరలోక ప్రార్ధన నేర్పుమయా
2. పరమ దేవుడవని తెలసి - కరములెత్తి జంటగ మోడ్చి
    శిరమును వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా
3. దిన,దినంబు చేసిన సేవ దైవచిత్తముకు  సరిపోవ
    దీనుడనయ్యా దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా
4. శత్రుమూక నిను చుట్టుకొని సిలువ పైన నిను జంపగను
    శాంతముతో  నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా

పాట:170
   పాపిని యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో
   నీ రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో
1. పాపము మోసితివే - నా శాపము బాపితివే
    నీ మహిమకు పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో
2. చిందిన రక్తమున  - నే పొందిన స్వస్థతను
    రా నంటిని నీ దరికి - మన్నిచుము యేసు ప్రభో
3. మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను
    రా నంటిని నీదరికి - నను గావుము యేసు ప్రభో



Saturday, August 18, 2012

TELUGU CHRISTIAN LYRICS 13


పాట:
146
    వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి
    సమయముండగనే - ఆయన్ను వెదకుడి  (2)
    కృపకాలముననే ఆయన్ను వెదకుడి  "వెదకు"
1. ఆయన మీకు - దొరుకు కాలమున
    నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా
    నీపై జాలితో - నిన్ను క్షమియించును -2
    తరుణము పోయినా- మరల రాదు -2   "సమయ"
2. తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో
    ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో
    యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును  -2
    తరుణము పోయినా - మరల రాదు -2      "సమయ"
3. బాలుడైన యేసుని జ్ణానులు వెదికిరి 
    మగ్ధలేని మరియ - యేసుని వెదికెను
    కన్నీటితో హన్నా - దేవుని వెదికెను  -2
    తరుణము పోయినా - మరల రాదు  -2    "సమయ"
4. హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే
    ఎస్తేరు వెదకి - తన వారిన్‌ రక్షించే
    దేవునిని నమ్మినవారే - ఆయన్ను స్తుతియింతురు  -2
    తరుణము పోయినా - మరల రాదు      "సమయ"
పాట;147
    ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
    మహిమలో నేనాయనతో నుంటేమేలు
    నిత్యమైన మోక్షగృహము నందు చేరి
    భక్తుల గుంపులో హర్షించిన చాలు
1. యేసుని రక్తమందు కడుగబడి-వాక్యంచే నిత్యం భద్రపరచబడి
    నిష్కళంక పరిశుద్ధులతో పోదున్‌ నేను-బంగారు వీదులలో తిరిగెదన్‌ "ప్రియ"
2. దూతలు వీణలను మీటునపుడు-గంభీర జయద్వనులు మ్రోగినపుడు
    హల్లెలూయ పాటల్‌ పాడుచుండ-ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్‌ "ప్రియ"
3. ముండ్ల మకుటంబైన తలనుజూచి-స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్‌
    కొరడలతో కొట్టబడిన వీపునుజూచి-ప్రతి యెక్క గాయమును చుంబింతును "ప్రియ"
4. హృదయము స్తుతులతో నింపబడె-నా భాగ్య గృహమును స్మరించు చుంటె
    హల్లెలూయ.....ఆమేన్‌,హల్లేలూయా..- వర్ణింప నా నాలుకచాలదయ్యా   "ప్రియ"
5. ఆహ ! యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా ! నా ఆశ యెపుడూ తీరుతుందో
    తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో-ఆశతో వేచియుండె నా హృదయము  "ప్రియ"
పాట:148
    యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే
1. ఇహపరమున మేలైన నామము - శక్తి గల్గినట్టి  నామమిది
    పరిశుద్దులు స్తుతించు నామమిది - 2  "యేసు"
2. సైతానున్‌ పాతాళమును జయించు - వీరత్వము గల నామమిది
    జయమొందెదము ఈ నామమున - 2      "యేసు"
3. నశించు పాపుల రక్షించులోక - మున కేతెంచిన నామమిది
    పరలోకమున చేర్చు నామమిది - 2     "యేసు"
4. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది
    లోకమంతా ప్రకాశించు నామమిది - 2   "యేసు"
5. శోదన, భాధల, కష్ట సమయాన - ఓదార్చి నడుపు నామమిది
    ఆటంకము తొలగించు  నామమిది - 2   "యేసు"
పాట:149
   సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను
   నిర్వహించును దాస భారము- నిత్యమెద రాజిల్లును
1. ముదముతో నిర్మానకుండు-మూలకర్తను బాడరే
    వదన మీక్షంబ-న్వయించి వందనముతో వేడరే
2. వేధ పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే
    సాదరముగ దేవునిక మీ - స్వాతమున బూజింపరే
3. ఎదను విశ్రాంతిన్‌ బరేశుని - హెచ్చుగా స్తుతి జేయరే
    సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయనకీయరే
4. చావు పుట్టుక లేని వాడుగా - సతతము జీవించును
    ఈవులిచ్చుచు తన్ను వేడుమ - హేష్టులను రక్షించును
5. దాసులై దేవునికి నెదలో - దర్బమును పోగొల్పరే
    యేసుక్రీస్తని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్చరే
పాట:150
   భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా మా రక్షణ కర్త -2
   శరణు,శరణు మా దేవ యెహోవా - మహిమా.న్విత చిర జీవనిధి
1. విమల సెరాపులు - దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే
    మా యాఘములకై  సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే   "శరణు"
2. ప్రప్రధముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి
    నీ భజనయే మా జీవాధారం - జేకొనుమా మా స్తుతి గీతం    "శరణు"
పాట:151
    ఈ దినం సదా - నా యేసుకే సొంతం
    నా నాధుని ప్రసన్నత - నాతోడ నడచును
    రానున్న కాలము - కలత నివ్వదు
    నామంచికాపరీ సదా - నన్ను నడుపును  "ఈ"
1. ఎడరులు లోయలు ఎదురు నిలచిన
    ఎన్నడెవరు నడువని బాటయైనను
    వెరవదెన్నడైనను నాదు హృదయము
    గాయపడిన యేసుపాదం అందు నడచెను   "ఈ"
2. ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
    యుద్ధకేక నా నోట యేసు నామమే
    విరోదమైన  ఆయుధాలు యేవిఫలించవు
    యెహోవా నిస్సియే నాదు విజయము      "ఈ"
పాట:152
    నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
    శిల్పిచేతిలో శిలను నేను - అను క్షణము నన్ను చెక్కుము
1. అందకార లోయలోన - సంచరించినా భయములేదు
    నీ వాక్యాము శక్తి గలది - నా త్రోవకు నిత్య వెలుగు       "నీచే"
2. ఘోరపాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
    లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను  "నీచే"
3. ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే
    కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతం నీ సేవచేసెదన్‌ "నీచే"
పాట:153
     గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
     వేలాది దూతలతో భువికి - వేగమే రానుండే  -2
1. పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
    ధరసంఘ వదువునకై - తరలెను వరుడదిగో
2. మొదటగను గొర్రెగను - ముదమారగ వచ్చెను
    కొదమ సింహపు రీతి - కదిలెను ఘర్జనతో
3. కని పెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు
    ప్రదమమున లేచెదరు - పరిశుద్దులు మృతులు
పాట:154
    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును -2
    శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
    హల్లేలూయా...హల్లేలూయా....హల్లేలూయా..ఆమేన్‌  -2
1. కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున
    గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు "హల్లే"
2. జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు
    అగ్నిలో నేను నడచినా -  జ్వాలలు నను కాల్చజాలవు  "హల్లే"
3. విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు
    సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు  "హల్లే"
పాట:155
    ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం
    ముదమార వసియించు - నా హృదయాంత రంగమున -2
1. నీ రక్త ప్రభావముతో - నారోత హృదయంబును
    పవిత్ర పరచుము తండ్రీ - ప్రతి పాపమును కడిగి "ప్రియ"
2. ఆజాగరూకుడనైతి - నిజాశ్రయంబును విడచి
    కరుణా రసముతో నకై - కనిపెట్టితివి తండ్రీ         "ప్రియ"
3. వికసించె విశ్వాసంబు - వాక్యంబును నే చదవగనే
    చేరీతి నీదు దారి - కోరీ నడిపించుము              "ప్రియ"
4. ప్రతి చోట నీసాక్షీగా - ప్రభువా నే నుండునట్లు
    ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా     "ప్రియ"

పాట:156
     సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
     యేసయ్యా……… యేసయ్యా (4)
1. పాపాల ఊభిలో పడియున్న నన్ను-నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
   ఏ తీడు లేని నాకు నా తోడుగా-నా ఆండగా నీవు నలిచావయ్యా (2) "యేసయ్యా"
2. నీ వాత్సల్యమును నాపై చూపించి-నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
   ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి-నీ పాత్రగా నన్ను మలిచావయా (2) "యేసయ్యా"
పాట: 157
       అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము
       ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము
అ.ప: యేసు నామము - జయం జయము
         సాతాను శక్తుల్‌ - లయం లయము
         హల్లేలూయా - హోసన్న హల్లేలూయ - హల్లేలూయా - ఆమెన్‌
1. పాపము నుండి విడిపించును యేసు నామము (2)
    నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము  (2)
2. సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము (2)
    శత్రు సమూహం పై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము (2)