Saturday, August 18, 2012

TELUGU CHRISTIAN LYRICS 13


పాట:
146
    వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి
    సమయముండగనే - ఆయన్ను వెదకుడి  (2)
    కృపకాలముననే ఆయన్ను వెదకుడి  "వెదకు"
1. ఆయన మీకు - దొరుకు కాలమున
    నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా
    నీపై జాలితో - నిన్ను క్షమియించును -2
    తరుణము పోయినా- మరల రాదు -2   "సమయ"
2. తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో
    ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో
    యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును  -2
    తరుణము పోయినా - మరల రాదు -2      "సమయ"
3. బాలుడైన యేసుని జ్ణానులు వెదికిరి 
    మగ్ధలేని మరియ - యేసుని వెదికెను
    కన్నీటితో హన్నా - దేవుని వెదికెను  -2
    తరుణము పోయినా - మరల రాదు  -2    "సమయ"
4. హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే
    ఎస్తేరు వెదకి - తన వారిన్‌ రక్షించే
    దేవునిని నమ్మినవారే - ఆయన్ను స్తుతియింతురు  -2
    తరుణము పోయినా - మరల రాదు      "సమయ"
పాట;147
    ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
    మహిమలో నేనాయనతో నుంటేమేలు
    నిత్యమైన మోక్షగృహము నందు చేరి
    భక్తుల గుంపులో హర్షించిన చాలు
1. యేసుని రక్తమందు కడుగబడి-వాక్యంచే నిత్యం భద్రపరచబడి
    నిష్కళంక పరిశుద్ధులతో పోదున్‌ నేను-బంగారు వీదులలో తిరిగెదన్‌ "ప్రియ"
2. దూతలు వీణలను మీటునపుడు-గంభీర జయద్వనులు మ్రోగినపుడు
    హల్లెలూయ పాటల్‌ పాడుచుండ-ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్‌ "ప్రియ"
3. ముండ్ల మకుటంబైన తలనుజూచి-స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్‌
    కొరడలతో కొట్టబడిన వీపునుజూచి-ప్రతి యెక్క గాయమును చుంబింతును "ప్రియ"
4. హృదయము స్తుతులతో నింపబడె-నా భాగ్య గృహమును స్మరించు చుంటె
    హల్లెలూయ.....ఆమేన్‌,హల్లేలూయా..- వర్ణింప నా నాలుకచాలదయ్యా   "ప్రియ"
5. ఆహ ! యా బూర యెపుడు ధ్వనించునో - ఆహా ! నా ఆశ యెపుడూ తీరుతుందో
    తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో-ఆశతో వేచియుండె నా హృదయము  "ప్రియ"
పాట:148
    యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే
1. ఇహపరమున మేలైన నామము - శక్తి గల్గినట్టి  నామమిది
    పరిశుద్దులు స్తుతించు నామమిది - 2  "యేసు"
2. సైతానున్‌ పాతాళమును జయించు - వీరత్వము గల నామమిది
    జయమొందెదము ఈ నామమున - 2      "యేసు"
3. నశించు పాపుల రక్షించులోక - మున కేతెంచిన నామమిది
    పరలోకమున చేర్చు నామమిది - 2     "యేసు"
4. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది
    లోకమంతా ప్రకాశించు నామమిది - 2   "యేసు"
5. శోదన, భాధల, కష్ట సమయాన - ఓదార్చి నడుపు నామమిది
    ఆటంకము తొలగించు  నామమిది - 2   "యేసు"
పాట:149
   సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను
   నిర్వహించును దాస భారము- నిత్యమెద రాజిల్లును
1. ముదముతో నిర్మానకుండు-మూలకర్తను బాడరే
    వదన మీక్షంబ-న్వయించి వందనముతో వేడరే
2. వేధ పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే
    సాదరముగ దేవునిక మీ - స్వాతమున బూజింపరే
3. ఎదను విశ్రాంతిన్‌ బరేశుని - హెచ్చుగా స్తుతి జేయరే
    సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయనకీయరే
4. చావు పుట్టుక లేని వాడుగా - సతతము జీవించును
    ఈవులిచ్చుచు తన్ను వేడుమ - హేష్టులను రక్షించును
5. దాసులై దేవునికి నెదలో - దర్బమును పోగొల్పరే
    యేసుక్రీస్తని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్చరే
పాట:150
   భజియింతుము నిను జగదీశా - శ్రీయేసా మా రక్షణ కర్త -2
   శరణు,శరణు మా దేవ యెహోవా - మహిమా.న్విత చిర జీవనిధి
1. విమల సెరాపులు - దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే
    మా యాఘములకై  సిలువ మ్రానుపై - దీనుడవై మరణించితివే   "శరణు"
2. ప్రప్రధముడ మరి కడపటివాడ - మృతుడై బ్రతికిన నిరత నివాసి
    నీ భజనయే మా జీవాధారం - జేకొనుమా మా స్తుతి గీతం    "శరణు"
పాట:151
    ఈ దినం సదా - నా యేసుకే సొంతం
    నా నాధుని ప్రసన్నత - నాతోడ నడచును
    రానున్న కాలము - కలత నివ్వదు
    నామంచికాపరీ సదా - నన్ను నడుపును  "ఈ"
1. ఎడరులు లోయలు ఎదురు నిలచిన
    ఎన్నడెవరు నడువని బాటయైనను
    వెరవదెన్నడైనను నాదు హృదయము
    గాయపడిన యేసుపాదం అందు నడచెను   "ఈ"
2. ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
    యుద్ధకేక నా నోట యేసు నామమే
    విరోదమైన  ఆయుధాలు యేవిఫలించవు
    యెహోవా నిస్సియే నాదు విజయము      "ఈ"
పాట:152
    నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
    శిల్పిచేతిలో శిలను నేను - అను క్షణము నన్ను చెక్కుము
1. అందకార లోయలోన - సంచరించినా భయములేదు
    నీ వాక్యాము శక్తి గలది - నా త్రోవకు నిత్య వెలుగు       "నీచే"
2. ఘోరపాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని
    లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను  "నీచే"
3. ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే
    కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతం నీ సేవచేసెదన్‌ "నీచే"
పాట:153
     గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని
     వేలాది దూతలతో భువికి - వేగమే రానుండే  -2
1. పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
    ధరసంఘ వదువునకై - తరలెను వరుడదిగో
2. మొదటగను గొర్రెగను - ముదమారగ వచ్చెను
    కొదమ సింహపు రీతి - కదిలెను ఘర్జనతో
3. కని పెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు
    ప్రదమమున లేచెదరు - పరిశుద్దులు మృతులు
పాట:154
    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును -2
    శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2
    హల్లేలూయా...హల్లేలూయా....హల్లేలూయా..ఆమేన్‌  -2
1. కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున
    గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు "హల్లే"
2. జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు
    అగ్నిలో నేను నడచినా -  జ్వాలలు నను కాల్చజాలవు  "హల్లే"
3. విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు
    సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు  "హల్లే"
పాట:155
    ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నాహృదయం
    ముదమార వసియించు - నా హృదయాంత రంగమున -2
1. నీ రక్త ప్రభావముతో - నారోత హృదయంబును
    పవిత్ర పరచుము తండ్రీ - ప్రతి పాపమును కడిగి "ప్రియ"
2. ఆజాగరూకుడనైతి - నిజాశ్రయంబును విడచి
    కరుణా రసముతో నకై - కనిపెట్టితివి తండ్రీ         "ప్రియ"
3. వికసించె విశ్వాసంబు - వాక్యంబును నే చదవగనే
    చేరీతి నీదు దారి - కోరీ నడిపించుము              "ప్రియ"
4. ప్రతి చోట నీసాక్షీగా - ప్రభువా నే నుండునట్లు
    ఆత్మాభిషేకము నిమ్ము - ఆత్మీయ రూపుండా     "ప్రియ"

పాట:156
     సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
     యేసయ్యా……… యేసయ్యా (4)
1. పాపాల ఊభిలో పడియున్న నన్ను-నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
   ఏ తీడు లేని నాకు నా తోడుగా-నా ఆండగా నీవు నలిచావయ్యా (2) "యేసయ్యా"
2. నీ వాత్సల్యమును నాపై చూపించి-నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
   ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి-నీ పాత్రగా నన్ను మలిచావయా (2) "యేసయ్యా"
పాట: 157
       అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము
       ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము
అ.ప: యేసు నామము - జయం జయము
         సాతాను శక్తుల్‌ - లయం లయము
         హల్లేలూయా - హోసన్న హల్లేలూయ - హల్లేలూయా - ఆమెన్‌
1. పాపము నుండి విడిపించును యేసు నామము (2)
    నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము  (2)
2. సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము (2)
    శత్రు సమూహం పై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము (2)


No comments:

Post a Comment