పాట:201
యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు
1. వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు
జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు
ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా " యేసు "
2. చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
ఆ..హ..హల్లెలూయ -
ఆ..ఆ...ఆ...హల్లెలూయా
"యేసు "
3. నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా
ఎన్నడు మరువక
ఎడబాయక - యేసే తోడుండును
ఆ....హ..
హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ
"యేసు "
పాట:202
యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
ఘనుడా ని దివ్య సన్నిధి - నను
ఆదుకొనే నా పెన్నిధి (2)
అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా..
1. నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు
2. నీవే నాతో వస్తే - కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - క్షయత నన్నంటదు
3. నీవే నాతో వస్తే - ఓటమి నా కుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - చీకటి నన్నంటదు
పాట:203
యేసు అందరికి
ప్రభువు.... యేసే.... లోకరక్షకుడు
లోకము ఆకాశము
మారినా నిత్యముండును క్రీస్తే "యేసు"
1. అల్ఫా ఓ మేగయు యేసే - ఆద్యంతములు ఆ క్రీస్తే
అన్ని కాలంబులలో
నున్నవాడు - కన్నతండ్రి మనకు ఆ ప్రభువే "యేసు"
2. దేవుడు మనలను ప్రేమించే ఈ లోకమునకు తానేతెంచె
పాపాత్ములమైన
మనకొరకే - ఆ సిలువలో ప్రభువు మరణించె
"యేసు"
3. పాపులు ప్రభుని వేడినా - కలుషాత్ములు ప్రభు క్షమకోరినా
క్షమియించును
ప్రభువు తక్షణమే - విడిపించును పాప శిక్షనుండి "యేసు"
4. రమ్ము ఓ సోదరా నేడే - ఇమ్ము నీ హృదయ మీనాడే
నీ కొరకు యేసు
పిలుచుచుండె నీ హృదయపు వాకిట నిలిచియుండె
పాట:204
జీవాహారం – మధురాతి మధురమే
(2)
భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2)
యేసుని ప్రేమ బహు కమ్మ నైనది (2)
1.
ఐదు రొట్టెలు, రెండు చేపలు
ఐదు వేలు తిన్నారు – ఆహా..ఓహో అన్నారు (2)
భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2)
“యేసుని”
2.
కానా పెళ్ళిలో – నీళ్ళను మార్చాడు
ద్రాక్షరసము తాగి - ఆహా..ఓహో
అన్నారు (2)
భలే భలే గుందిలే – తేనే కంటే తియ్యగా (2)
“యేసుని”
పాట: 205
యేసే నా పరి
హారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత
కాలమెల్లా - ప్రియ ప్రభువే నా పరిహారి
1. ఎన్ని కష్టాలు కలిగినను -
నన్ను కృంగించే భాదలెన్నో
ఎన్ని నష్టాలు
శోభిల్లినా - ప్రియ ప్రభువే నా పరిహారి
2. నన్ను శాతాను వెంబడించినా - నన్ను శత్రువు ఎదిరించినా
పలు నిందలు నను
చుట్టినా - ప్రియ ప్రభువే నాపరిహారి
3. మణిమాణ్యాలు లేకున్నా
- మనో వేధనలు వేదించినా
నరులెల్లరు నను
విడచినా - ప్రియ ప్రభువే నాపరిహారి
4. బహు వ్యాదులు నను
సోకినా - నాకు శాంతి కరువైనా
శోధకుడు శోదించినా - ప్రియ ప్రభువే నాపరిహారి
5. దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు
నా జీవిత
కాలమంతా - నిను పాడి స్తుతించెదను
పాట:206
యేసు రాజుగా
వచ్చు చున్నాడు - భూలోక మంతా తెలుసుకొంటారు
రవికోటి తేజుడు
రమ్యమైన దేవుడు - రారాజుగా వచ్చు చున్నాడు
యేసు రారాజుగా
వచ్చుచున్నాడు
1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు - పరిశుద్దులందరిని తీసుకు
పోతాడు
లోకమంతా
శ్రమకాలం -విడువబడుట బహుఘోరం
" యేసు"
2. ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది-ఏడేండ్లు లోకం మీదికి
శ్రమ రాబోతుంది
ఈ సువార్త
మూయబడున్ - వాక్యమే కరువగును
" యేసు"
3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును - ఈ లోక రాజ్యాలన్ని
ఆయన ఏలును
నీతి శాంతి
వర్ధిల్లును న్యాయమే కనబడును
4. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-సాగిలపడి నమస్కరించి గడగడలాడును
వంగనీ
మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట
వంగిపోవును " యేసు"
5. క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-కనిపెట్టి ప్రార్ధనచేయి
సిద్ధముగానుండు
రెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి " యేసు"
పాట:207
యేసు నీవు నన్ను
ప్రేమిస్తున్నావు - నీదు ప్రేమను నేను
పొందుచున్నాను
దిన దినము
నాయెడల - నీ కృప విస్తరించు చున్నది - 2
నీ కృప
విస్తరించు చున్నది.
1. ప్రేమతోనే పిలిచేవారు ఈ ధరణీలో ఎవరు లేరు
నా చేయిపట్టి
నడిపేవారు ఈలోకమందు కానరారే -2
అయితే తల్లిగా, తండ్రిగా నీవే వున్నావు
నీదు ప్రేమతో నా
చేయిపట్టి నడుపుచున్నావు - 2 "దినదినము"
2. నా యోగ క్షేమమడిగేవారు నా మిత్రులలో ఎవరులేరు
ఆధరణా చూపేవారు
అయిన వారుకానరారే - 2
అయితే స్నేహమై, బంధమై నీవే వున్నావు
అన్నివేళలా ఆధరణ
చూపుచున్నావు - 2 " దినదినము"
3. కష్టాలు తీర్చేవారు ఒక్కరైనా కానరారే
ఓదార్పునిచ్చేవారు ఎవరు నాకు లేనేలేరే
- 2
అయితే ప్రియుడవై, ప్రేమికుడవై నీవే
వున్నావు
నిత్యము నీ
సన్నిధిలో బలపరుచుచున్నావు - 2 "దినదినము"
పాట:208
యేసుతో ఠీవిగాను పోదమా-2 - అడ్డుగా వచ్చు వైరి గెల్వను-2
యుద్ధ నాదంబుతో పోదమా
1. రారాజు సైన్యమందు చేరను - ఆరాజు దివ్య సేవ చేయను
యేసు రాజు
ముందుగా ధ్వజము పట్టి నడువగా
యేసుతో ఠీవిగాను
వెడలను "యేసుతో"
2. విశ్వాస కవచమును ధరించుచు - ఆ రాజు నాజ్ణమధిని నిల్పుచు
అనుదినంబు
శక్తిని పొందుచున్న వారమై
యేసుతో ఠీవిగాను
పోదము "యేసుతో"
3. శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్నో తగిలినా
భయము లేదు మనకిక
ప్రభువు చెంత నుందుము
సాదనంబెవరు నీవు
నేనెగా "యేసుతో"
4. ఓయువతి యువకులార చేరుడీ - శ్రీ యేసు
రాజు వార్త చాటుడీ
లోకమంత ఏకమై
యేసు రాజు గొల్వను
సాదనంబెవరు నీవు
నేనెగా
పాట:209
యేసయ్యా నా
హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా
తీయ్యని తలంపులు నీవేనయ్యా - 2
1. పగలు మేఘ స్థంభమై - రాత్రి అగ్ని స్థంభమై
నా పితరులను
ఆవరించి - ఆదరించిన మహానీయుడవు - 2
పూజ్యనీయుడా
నీతి సూర్యుడా
నిత్యము నాకనుల
మెదలుచున్న వాడా "యేసయ్యా"
2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి
ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా - 2
విజయశీలుడా -
పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే
నిలిచియున్నవాడా - 2 "యేసయ్యా"
పాట:210
యేసు పరిశుద్ధ
నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే
1. ఇహపరమున మేలైన నామము - శక్తి గల్గినట్టి నామమిది
పరిశుద్దులు
స్తుతించు నామమిది - 2 "యేసు"
2. సైతానున్ పాతాళమును జయించు - వీరత్వము గల నామమిది
జయమొందెదము ఈ
నామమున - 2 "యేసు"
3. నశించు పాపుల రక్షించులోక - మున కేతెంచిన నామమిది
పరలోకమున చేర్చు
నామమిది - 2 "యేసు"
4. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు - ఉన్నత దేవుని నామమిది
లోకమంతా
ప్రకాశించు నామమిది - 2 "యేసు"
5. శోదన, భాధల, కష్ట సమయాన - ఓదార్చి నడుపు నామమిది
ఆటంకము తొలగించు నామమిది - 2
"యేసు"
పాట:211
యుద్ధము
యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)
1. రాజులు మనకెవ్వరులేరు శూరులు మనకెవ్వరులేరు
సైన్యములకు అదిపతియైన యెహోవా మన అండ (2)
2. వ్యాధులు మనలను పడద్రోసినా భాదలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మన అండ (2)
3. యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ భయమేల మనకింక (2)
4. అపవాది యైన సాతాను గర్జించు సింహమువలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ
యుద్ధము యెహోవాదే - యుద్ధము యెహోవాదే (2)
పాట:212
యూదా రాజ సింహం
- తిరిగి లేచెను
తిరిగి లేచెను
- మృతిన్ గెలిచి లేచెను
1. నరక శక్తులన్ని ఓడిపోయెను
ఓడిపోయెను - ఆవి వాడి పోయెను
2. దూత సైన్యమంత – స్తుతించు చుండ
స్తుతించు చుండ - యేసుని సన్నుతించుచుండ
3. మరణ సంకెళ్ళను - త్రెంచి వేసెను
త్రెంచి
వేసెను - వాటిన్ వంచి వేసెను
4. యేసు లేచెనని - మ్రోగుచున్నది
మ్రోగుచున్నది - భయమున్ ద్రోలుచున్నది
5. వనితల్ దూత వార్త -
విశ్వసించిరి
విశ్వసించిరి - మదిన్ సంతసించిరి
6.పునరుద్ధానుడెన్నడు - మరణించడు
మరణించడు - మరణించడెన్నడు
7. యేసూ! నీదు పాదం - మ్రొక్కెదము
మ్రొక్కెదము - మము ముద్రించుము
పాట:213
యెహోవాను
గానాము - చేసెదము ఏకముగా
మనకు
రక్షకుడాయనే - ఆయన మహిమ పాడెదము
ఆయనను
వర్ణిచెదము - ఆయనే దేవుడు మనకు
"యెహోవా"
1. యుద్దా శూరుడేహోవా -
నా బలము నా గానము
నా పితరుల
దేవుడు - ఆయన పేరు యెహోవా
"యెహోవా"
2. ఫరో రధముల సేనలను -
తన శ్రేష్టాది పతులను
ఎర్ర
సముద్రములోన - ముంచివేసెనెహోవా..
"యెహోవా"
3. నీ మహిమాతి శయమున -
కోపాగ్ని రగులజేసి
చెత్తవలె
ధహించెదవు - నీ పై లేచు వారిని
"యెహోవా"
4. దోపుడు సొమ్ము పంచు
కొని - ఆస తీర్చు కొందును
నాకత్తి
దూసెదను - అని శత్రువు అనుకొనును
"యెహోవా"
5. వేల్పులలో నీ సముడెవడు - పరిశుద్దా మహనీయుడా
అద్భుతమైన
పూజ్యుడా - నీ వంటి వాడెవడు
"యెహోవా"
6. ఇశ్రాయేలీయులంతా - ఎంతో సురక్షితముగా
సముద్రము మద్యను
- ఆరిన నేలను నడచిరి
"యెహోవా"
పాట:214
యెహోవా
నాకు వెలుగాయే యెహోవానాకు రక్షణయే
నా ప్రాణ
దుర్గమాయే - నేను ఎవరికి ఎన్నడు భయపడను (2)
1. నాకు మార్గమును
ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే
నేనెల్లప్పుడు
ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2)
"యెహోవా"
2. నాకొండయు నాకోటయు -
నా ఆశ్రయము నీవే (2)
నేనెల్లప్పుడు
ప్రభు సన్నిదిలో స్తుతి గానాము చేసెదను (2)
"యెహోవా"
3. నా తల్లియు నా
తండ్రియు ఒకవేళ మరచినను (2)
ఆపత్కాలమున
చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును (2) "యెహోవా"
పాట:215
యెహోవా నాబలమా
- యదార్ధమైనది నీ మార్గం
పరి పూర్ణమైనది
నీ మార్గం - యెహోవా....ఆ..ఆ
1. నా శత్రువులు నను
చుట్టినను - నరకపు పాశము లరికట్టినను
వరదవలె
భక్తిహీనులు పొర్లిన - వదలక నను ఎడబాయని దేవా "యెహోవా"
2. మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొర
వినెను - అదరెను ధరణి భయకంపముచే
"యెహోవా"
3. నాదిపమును వెలిగించువాడు - నా చీకటిని వెలుగుగా జేయును
జలరాశుల నుండి
బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవుడు "యెహోవా"
4. పౌరుషముగల ప్రభు కోపించగ - పర్వతములపునాదులు వణికెను
తన నోటనుండి
వచ్చిన అగ్ని - దహించి వేసెను వైరులనెల్ల "యెహోవా"
5. మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు
మెరుపులు మెండుగ జేసి - అపజయమిచ్చును
అపవాదికిని "యెహోవా"
6. దయగల వారిపై దయచూపించను -
కటినుల యెడల వికటముజూపును
గర్విష్టులయెక్క
గర్వముననచును - సర్వము నెరిగిన సర్వాదికారి "యెహోవా"
7. నా కాళ్లను లేడికాల్లగజేసి - ఎత్తైన స్థలములలో శక్తితో
నిలిపి
రక్షణ కేడెము
నాకందించి - అక్షయముగ తన పక్షము జేర్చిన "యెహోవా"
8. యెహోవా జీవముగల దేవా - బహుగా
స్తుతులకు అర్హుడవు నీవే
అన్యజనులలో
ధన్యత చూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద "యెహోవా"
పాట:216
యెహోవా నీ
నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది
"యెహోవా"
1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి
యెహోషువా
ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి
"యెహోవా"
2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో
పడవేసినా - భయమేమి లేకుండిరి
"యెహోవా"
3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన
వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా"
4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా
సంఘము
ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను
"యెహోవా"
5. పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా
పాటలతో
ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె
"యెహోవా"
6. మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా
- ప్రకటించె నీప్రేమను
"యెహోవా"
పాట:217
యెహోవా నా
కాపరి - నాకేమి లేమి కలుగదు (2)
పచ్చికగల చోట్ల
పరుండ చేయున్ (2)
నా ప్రాణమునకు
- సేద తీర్చున్ (2)
1. గాఢాందకారం
నన్నావరించి నాతోడైయున్నావు నీవు (2)
శాంతి కరమైన
జలముల యెద్ద నడిపించినావు నీవు (2)
"యెహోవా"
2. నీ నామము బట్టి
నీ ప్రేమ మార్గములో నడిపించి ఇహమందు నీవు (2)
ఇకనుండి నేను
నడువాలేను నీ మీదనేవాలినాను (2) "యెహోవా"
పాట:218
యెహోవా నిన్ను
పోలియున్న వారెవ్వరు
యేసువా నీకు
సాటియైన వారెవ్వరు
1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా
నిత్యము
నివసించుచున్న సత్యదేవుడా
అందరిలో సుందరుడ
- కాంక్షనీయుడా
వందనముల కరుహుడా
పూజ్యనీయుడా "యెహోవా"
2. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా
లోక పాపమును
మోసిన దైవ తనయుడా
మరణపు కోరలు
పీకిన విజయ వీరుడా
శరణన్నచో కరుణ
చూపు పరంధాముడా "యెహోవా"
పాట:219
యెహోవా నా కాపరీ - నాకు
లేమిలేదు - 2
పచ్చిక గలచోట్ల - పరుండ జేయును - 2
1. గాఢాందకారపు
లోయలలో - నేను నడచినను
ఏ ఆపదలకు భయపడను - నీవు నాతోనుండగా
- 2
నా బ్రతుకంతయు - కృపాక్షేమములు
వచ్చును - 2 "యెహోవా"
2. నా
శత్రువులయొద్ద - బల్లను సిద్ధ పరచెదవు
నూనెతో నా తలను - అంటి
యున్నావు - 2
జీవితమంతయూ - నీ సన్నిదిలో
గడిపెదను - 2 "యెహోవా"
పాట:220
యెహోవాను
స్తుతించుట - యెంతో యెంతో మంచిది
1. మహోన్నతుండా నీ నామము - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ -
హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ
2. గంభీర ధ్వని గల సితారతోను - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ -
హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ
3. పది తంతులను,స్వరమండలముతో
- స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ -
హల్లేలూయ -హల్లేలూయ - హలెలూయ
4. రేయింబవళ్ళు వేనోళ్లతోను - స్తుతించుటయే బహు మంచిది
హల్లేలూయ -
హల్లేలూయ -హల్లేలూయ – హలెలూయ
పాట: 222
రండి
యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
1. రండి కృతజ్ణత స్తోత్రముతో - రారాజు సన్నిది కేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము
"రండి "
2. మన ప్రభువే మహా దేవుండు - ఘనమహాత్యము గల రాజు
భూ మ్యాగాధపు
లోయలలో - భూతల శిఖరములాయనవే " రండి "
3. సముద్రము సృష్తించె నాయనదే - సత్యుని హస్తమే భువి జేసెన్
ఆయన దైవము
పాలితుల - మాయన మేపెడి గొర్రెలము
"రండి"
4. ఆ ప్రభు సన్నిది మోకరించి - మాయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు
గైకొనినా - నైనవి మనకెంతో మేలగును
"రండి"
5. తండ్రికుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని ఇప్పుడు
నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌనామేన్
"రండి"
పాట:223
రండి యెహోవాను
గూర్చి ఉత్సాహగానము చేసెదము
ఆయనే మన పోషకుడు
- నమ్మదగిన దేవుడనీ
ఆహా......అహల్లెలూయా... ఆహా......అహల్లెలూయా...
1. కష్ట నష్టములెన్నున్నా - పొంగు సాగరమెదురైనా
ఆయనే మన ఆశ్రయం
- ఇరుకులలో ఇబ్బందులలో
"రండి"
2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిదిలో
అనిశము
ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో
"రండి"
3. త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాధుడనీ
నీతి సూర్యుడు
ఆయనే నని - నిత్యము స్తుతి చేయుదము "రండి"
పాట:224
రమ్మను
చున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంచతో తన
కరము చాపి -రమ్మను చున్నాడు
1. ఎటు వంటి శ్రమలందును - ఆధరణ నీ కిచ్చునని
గ్రహియించి
నీవు యేసును చూచిన - హద్దు లేని ఇంపు
నొందెదవు
2. కన్నీరంతా తుడుచును- కను పాపవలె కాపాడున్ కారు మేఘమువలె
కష్టములు వచ్చినను
- కనికరించి నిన్ను కాపాడున్
3. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును - ఆయన నీ వెలుగు
రక్షణ అయినందున
- ఆలసింపక నీవు త్వరపడి రమ్ము
4. సకల వ్యాదులను స్వస్థపరుచుటకు - శక్తిమంతుడగు
ప్రభు యేసు
ప్రేమతో - అందరికి తన కృపలనిచ్చున్
పాట:225
రాలి పోదువో
నీవు కూలిపోదువో
తెలియదురా నీకు
ఏగడియో
పువ్వు రాలు
విదముగారాలి పోదువో
అయ్యో మానవా
మాయరా,
మాయరా ఇది మాయరా "రాలిపో"
1. రేపు నీది కాదని తెలుసుకో - మునగకురా నీవు బ్రతుకవురా
ఒట్టిదిరా నీవు
మట్టివిరా (2)
అయ్యో మానవా
మాయరా ఇది మాయరా "రాలిపో"
2. కోరకురా నీవు కోర్కెలనూ - ఉండవురా నీవు మన్నేరా
కుండవురా నీవు
పగిలెదవు (2)
అయ్యో మానవా
మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"
3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని - ఎవ్వరు రారయ్య నీ వెంట
ఎందరు వున్న
ఒక్కడివే (2)
అయ్యో మానవా
మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"
4. భార్యభిడ్డలు మాయరా - లోక నివాసులు మాయరా
మర్చిపోదురు
నిన్ను ఒక దినము (2)
అయ్యో మానవా
మాయరా,మాయరా ఇది మాయరా "రాలిపో"
పాట:226
రాకడ సమయములో -
కడబూర శబ్ధముతో
యేసుని చేరు
కొనే - విశ్వాసము నీకుందా (2)
రావయ్య యేసయ్యా
- వేగమే రావయ్యా
- 2
1. యేసయ్య రాకడ సమయములో - ఎదురేగే రక్షణ నీకుందా?
లోకాశలపై విజయము
నీకుందా?
(2)
2. ఇంపైన దూప వేదికగా - ఏకాంత ప్రార్ధన నీకుందా? (2)
యేసుని ఆశించే
దీన మనస్సుందా ? (2)
3. దినమంతా దేవుని సన్నిదిలో- వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)
యేసు నాధునితో
సహవాసం నీకుందా? (2)
4. శ్రమలోన సహనం నీకుందా- స్తుతియించే నాలుక నీకుందా? (2)
ఆత్మలకొరకైన భారం
నీకుందా?
(2)
5. నీ పాత రోత జీవితము - నీ ఘోర హృదయము మారిందా?(2)
నూతన హృదయముతో
ఆరాధన నీకుందా ?(2)
6. అన్నిటి కన్న మిన్నగా - కన్నీటి ప్రార్ధన నీకుందా? (2)
ఎల్లవేళలలో
స్తుతి యాగం నీకుందా? (2)
పాట:227
రావయ్య యేసునాధా మా
రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
1. హద్దులేక
మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను "రావయ్య“
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను "రావయ్య“
2. నిండు
వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు "రావయ్య"
మా గండంబులన్నియు ఖండించుటకు "రావయ్య"
3. పాపుల
మయ్యమేము పరమ తండ్రిని గానకను
మా పాపంబు లన్నియు పారద్రోలుటకు "రావయ్య"
మా పాపంబు లన్నియు పారద్రోలుటకు "రావయ్య"
4. అందమైన
నీదు పరమానంద పురమందు
మే మందరము జేరి యానందించుటకు "రావయ్య"
మే మందరము జేరి యానందించుటకు "రావయ్య"
పాట:228
రాజా నీ ప్రసన్నం చాలునయ్యా
ఎప్పుడు నాకు
చాలునయ్యా
ప్రసన్నం - ప్రసన్నం - దైవ
ప్రసన్నం - 2
1. వేకువనే
వెదకితిని - సంతోషముతో చేరితిని
- 2 "ప్రసన్నం"
2. చేయి
పట్టి నడుపుదువే - విడనాడని పరిశుద్ధుడవే
- 2
"ప్రసన్నం"
3. పరిపాలించు
అతిశయమా - ఓదార్పు ఆశ్రయమా - 2 "ప్రసన్నం"
4. స్తుతులయందు
వసించెదవే - తోడైయుండు నా ప్రియుడా - 2
"ప్రసన్నం"
పాట:229
రుచి చూచి
యెరిగితిని - యెహోవా ఉత్తముడనియు - 2
రక్షకు నాశ్రయించి
- నే ధన్యుడనైతిని
1. గొప్పదేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు
- దయాళుడవు నీవే
2. మహోన్నతుడగు దేవా - ప్రభావము గలవాడా
మనసార పొగడెదను
నీ - ఆశ్చర్య కార్యములన్
3. మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో
ముదమార పాడెద
నిన్ను - అతి సుందరుడవనియు
4. నా జీవితమంతయును - యెహోవాను స్తుతించెదను
నా బ్రతుకు
కాలములో నా- దేవుని కీర్తింతున్
5. సంతోషించెద నెల్లపుడు - కష్ట ధు:ఖ భాధలలో
ఎంతో నెమ్మది
నిచ్చు నా - రక్షకుడు నాయేసు
6. ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిదిలో చేరి
సంపూర్ణముగా
పొందెదను - అడుగు వాటన్నిటిని
7. కృతజ్నత చెల్లింతు - ప్రతి దాని కొరకు నేను
క్రీస్తుని యందే
తృప్తి - పొంది హర్షించెదను
పాట:230
రక్షకుండుదయించినాడు - మనకొరకు పరమ
- రక్షకుండుదయించినాడు
రక్షకుండుదయించినాడు -
రారెగొల్లబోయలార - తక్షణమునబోయి మన నీ
రీక్షణ ఫల మొందుదము "రక్షకు"
1. దావీదు
వంశమందు ధన్యుడు జ న్మించినాడు - దేవుడగు యెహోవా
మన దిక్కుదేరి చూచినాడు "రక్షకు"
2. గగనమునుండి
దిగి ఘనుడు గబ్రియేలు దూత - తగినట్టు చెప్పి వారికి
మిగుల సంతోష వార్త "రక్షకు"
3. వర్తమానము
జెప్పి దూత వైభవమున పోవుచున్నాడు - కర్తను
జూచిన వెనుక కాంతుము విశ్రమం
బప్పుడు "రక్షకు"
4. పశువుల
తొట్టిలోన భాసిల్లు వస్త్రముజుట్టీ - శిశువును కను గొందురని
శీఘ్రముగను దూత తెల్పె "రక్షకు"
5. అనుచు
గొల్ల లొకరి కొకరు ఆనవాలు జెప్పుకొనుచు - అనుమతించి
కడకు క్రీస్తు నందరికినీ
దెల్పినారు "రక్షకు"
No comments:
Post a Comment