Friday, October 5, 2012

TELUGU CHRISTIAN LYRICS 231 - 260

పాట:231
    లెక్కింపలేని స్తొత్రముల్‌ - దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌
    ఇంత వరకు నా బ్రతుకులో - నీవు చేసిన  మేళ్ళకై
1. ఆకాశ మహాకాశముల్‌ దాని క్రిందున్న ఆకాశము
     భూమిలో  కనబడునవన్ని - ప్రభువా నిన్నే కీర్తింతున్‌  "లెక్కి
2. అడవిలో నివసించున వన్ని - సుడిగాలియు మంచును
      భూమిపైనున్నవన్ని - దేవా నిన్నే పొగడును          "లెక్కి"
3. నీటిలో నివసించు ప్రాణుల్‌ - ఈ భువిలోని జీవరాసు లు
     ఆకాశమున ఎగురునవన్ని - ప్రభువా నిన్నే కీర్తించున్‌    "లెక్కి"


పాట:232
     లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నాది
    యెహోవా మహిమ నీపై - ప్రాకాశముగా నుదయించె  "లెమ్ము"
1. జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు
    రాజులు నీదు ఉదయ - కాంతీకి వచ్చెదరు             "లెమ్ము"
2. సముద్ర వ్యాపారము - నీవైపు త్రిప్పబడును
    జనముల ఐశ్వర్యము - నీ యెద్దకు వచ్చును          "లెమ్ము"
3. దేవదారు సరళ గొంజి - చెట్లు నా ఆలయమునకు
    తేబడును నీదు పాద - స్థలము మహిమ పరచెదను  "లెమ్ము"
4. నిన్ను శాశ్వతమైన - శోభాతి శయముగ జేతున్‌
    బహు తరములకు సంతోష - కారణముగా జేసేదన్‌    "లెమ్ము"
5. వారిలో ఒంటరియైనా - వాడు పది వందాలగును
    ఎన్నీక లేని వాడు - బలమైనట్టి జనమగును           "లెమ్ము"


పాట:233
           లోయలెల్లా పూట్చబడాలి కొండలుకోనలు కదలిపోవాలి 
           వక్రమార్గము చక్రమవ్వాలి కరకు మార్గం నునుపవ్వాలి                            "2"
అను:   రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం
      1. ఫలము ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును                         "2"
          రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం   " లోయలెల్లా"
      2. గోదమును ఏర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును            "2"
          రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం   " లోయలెల్లా"
      3. పరిశుద్ధులుగా ఉచ్చులు లేకా ప్రభువుకై జీవించి సాగిపోదాం                         "2"
          రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం     "లోయలెల్లా "
      4. రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడుదాం                   "2"
          రాజు వస్తున్నాడు ఆయుత్తమవ్వుదాం - యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుదాం    "లోయలెల్లా "


 పాట:234
    వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి
    సమయముండగనే – ఆయనను వెదకుడి 
    కృపకాలముననే ఆయనను వెదకుడి (2)  "వెదకు"
1. ఆయన మీకు - దొరుకు కాలమున
    నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా
    నీపై జాలితో - నిన్ను క్షమియించును -2
    తరుణము పోయినా- మరల రాదు -2   "వెదకు"
2. తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో
    ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో
    యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును  -2
    తరుణము పోయినా - మరల రాదు -2      "వెదకు"
3. బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి 
    మగ్ధలేని మరియ - యేసుని వెదికెను
    కన్నీటితో హన్నా - దేవుని వెదికెను  -2
    తరుణము పోయినా - మరల రాదు  -2    "వెదకు"
4. హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే
    ఎస్తేరు వెదకి - తన వారిన్‌ రక్షించే
    దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు  -2
    తరుణము పోయినా - మరల రాదు           "వెదకు"

పాట:235
    వచ్చుచుండెన్‌ త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
1. తుఫాను వెంబడి తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
2. వరదల వెంబడి వరదలతో - అనేక ప్రాంతపు కరువులను -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
3. ఎన్నడు లేని రోగములు - ధారుణమైన మరణములు -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
4. భయంకరమైన బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు
5. అతి తరచుగ భూకంపములు - ధారుణమైన రోధనలు -2
    గుర్తించితివా ఇకనైనా యేసుని రాకడ సూచనలు 

పాట:236
    విజయం నీ రక్తంలో - అభయం నీ హస్తంలో
    సమాధానం సధాకాలం - నా రక్షకుడా నీలో
1. స్వస్థత నీరక్తంలో - భద్రత నీ హస్తంలో
2. రక్షణ నీ రక్తంలో - స్వాంతన నీ హస్తంలో
3. క్షమాపణ నీ రక్తంలో - నిరీక్షణ నీ హస్తంలో 
4. పవిత్రత నీ రక్తంలో - వినంమ్రత నీ హస్తంలో 
5. ఆరోగ్యం నీ రక్తంలో - ఆనదం నీ హస్తంలో 

పాట:237
     శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
     కృపచేతనే నన్ను రక్షించావయ్యా (2)
     నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది
     నీ కృపా గొప్పది నీ దయా గొప్పది  "2"
1.  అనాదనైన నన్ను వెదకి వచ్చితివి
     ప్రేమచూపి కౌగిలించి  కాచి యుంటివి
2. అస్థిరమైన లోకంలో తిరిగితినయ్యా
    సాటిలేని యేసయ్య చేర్చు కొంటివి
3. తల్లి గర్భమందే నన్నెరిగి యుంటివి
    తల్లిలా ఆదరించి  నడిపించితివి
4. నడిపించిన మార్గమంతా యోచించగా
    కన్నీళ్ళతో స్తుతించి స్తోత్రింతునయ్య


పాట:238
     శాశ్వతమైనది  నీవు నాయెడ చూపిన  కృప
     అనుక్షణం నను కనుపాపవలె కాచిన కృప
1. నీకు బహుదూరమైన నన్ను చేర దీసిన నా తండ్రివి
    నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో               "శాశ్వత"
2. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే
    నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే             "శాశ్వత"
3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన
    నా కృప నిను వీడదని అభయమిచ్చితివే                 "శాశ్వత"


పాట:239
    శృతిచేసి నే పాడనా స్తోత్ర గీతం - భజియించి నే పాడనా స్వామీ - 2
    హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా
1. దానియేలును సింహపు బోనులో - కాపాడినది నీవెకదా - 2
    జలప్రళయములో నోవాహును గాచిన
    బలవంతుడవు నీవెకదా - నీవెకదా 
    హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా   "శృతి"
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సచ్చరితుడవు నీవెకదా - 2
    పాపులకొరకై  ప్రాణమునిచ్చిన
    కరుణామయుడవు నీవెకదా - నీవెకదా
    హల్లేలూయా- హల్లేలూయా - హలెలూయ హలెలూయ హల్లేలుయా   "శృతి"


పాట:240
     శుభవేళలో నీ మోమును చూసి - అర్పించెదను నన్నూ
     ఆరాధన స్తుతి స్తోత్రములు - తండ్రీ నీకేనయ్యా           "శుభవేళలో"
     ఆరాధన - ఆరాధన - ఆరాధన - ఆరాధన
     నా ప్రియ యేసునకే - పావనాత్మ ప్రభునకే
1. ప్రతిరోజును ప్రతి నిమిషము - నీ తలంపులతో నింపబడాలి -2
    నా నోటి మాటలెల్ల - పరుల గాయములుమా న్పాలి    "శుభవేళలో"
2. నీ హృదయ ఆశలన్నియూ - హృదినాడిగా మారాలి   - 2
    జీవించు రోజులెల్లా - నీసాక్షిగా మారాలి                     "శుభవేళలో"
3. శుభవార్త భారం ఒక్కటే - నా హృదయ భారమై ఉండాలి - 2
    నా దేశం అంచులెల్లా - నీ నామం ప్రకటించాలి             "శుభవేళలో"


పాట : 241
      శుభవేళ స్తోత్రబలి - తండ్రి దేవా నీకేనయ్యా
      ఆరాధనా స్తోత్రబలి - తండ్రీ దేవా నీకేనయ్యా 
     తండ్రీ దేవా నీకేనయ్యా - తండ్రీ దేవా నీకేనయ్యా
1.  ఎల్షడాయ్‌ - ఎల్షడాయ్‌ సర్వ శక్తిమంతుడా
      సర్వ శక్తి మంతుడా - ఎల్షడాయ్‌ - ఎల్షడాయ్‌
2.  ఎల్‌ రోయీ - ఎల్‌ రోయీ - నన్నిల చూచువాడా
     నన్నిల చూచువాడా - ఎల్‌ రోయీ - ఎల్‌ రోయీ
3.  యెహోవా షాలోమ్‌ - శాంతి నొసగువాడా
     శాంతి నొసగువాడా - యెహోవా షాలోమ్‌


పాట:242
       శ్రమలందు నీవు నలిగే సమయమున - ప్రభు నీకు తోడుండుననీ  
        యోచించలేదా గమనించలేదా - ఇమ్మానుయేలుండునని              "2"
1.    శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?
       ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా?                  “2"      “శ్రమలందు"
2.   శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?
      ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా?              “2"       "శ్రమలందు

పాట:243 
     శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
     చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను       "శిలువాయే"
1. అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు                               "2"
     అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై        " శిలువాయే"
2.  మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు                                "2"
     మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు             "శిలువాయే"

పాట:244
     శ్రీ యేసు రాజునకే..... ఎల్లప్పుడు మహిమా....   
     నీ జీవితము ద్వారా కలుగునుగాక.......               "2"
     హల్లెలూయ ఆమేన్‌....హల్లెలూయ ఆమేన్‌.           "2"
     నీ జీవితము ద్వారా  ఎల్లప్పుడు మహిమా..          "2"
1. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు"2"
     యెహోవ కన్నులు నీ పైన ఉండునుగాక   "2" "హల్లెలూయ"
2. అందకార లోకములో దివిటీవలె నీవు వెలగాలనీ "2"
     వెలుగైయున్న దేవుడు కోరుచున్నాడు     "2"  "హల్లెలూయ"

 పాట:245
     సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా
     యేసయ్యా  యేసయ్యా  యేసయ్యా యేసయ్యా
1. పాపాల ఊభిలో పడియున్న నన్ను - నీ ప్రేమతో నన్ను లేపావయ్యా (2)
    ఏ తోడు లేని నాకు నా తోడుగా - నా అండగా నీవు నిలిచావయ్యా (2)
                                                                        "యేసయ్యా"
2. నీ వాత్సల్యమును నాపై చూపించి - నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
    ఆశ్చర్యకార్యములు ఎన్నోచేసి - నీ పాత్రగా నన్ను మలిచావయా (2)
                                                                       "యేసయ్యా"
పాట:246
   సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను
   నిర్వహించును దాస భారము- నిత్యమెద రాజిల్లను
1. ముదముతో నిర్మానకుండగు-మూలకర్తను బాడరే
    వదన మీక్షాంబ దేవుని - వందనముతో వేడరే
2. వేధ పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే
    సాదరముగ దేవునిక మీ - స్వాంతమున బూజింపరే
3. ఎదను విశ్రాంతిన్‌ బరేశుని - హెచ్చుగా స్తుతి జేయరే
    సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయనకీయరే
4. చావు పుట్టుక లేని వాడుగా - సతతము జీవించును
    ఈవులిచ్చుచు తన్ను వేడుమ - హేష్టులను రక్షించును
5. దాసులై దేవునికి నెదలో - దర్బమును పోగొల్పరే
    యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్పరే

పాట:247            
సర్వశక్తుడు నా సొంతమయ్యెను - మృత్యుంజయుడు నా జీవమయ్యెను
   ఆహహో... ఇది అద్భుతమేగా - ఓహొహో... ఇది నిజమేగా
1. కనుగొంటిని ఐశ్వర్యము - చేపట్టితీ ఒక గనినీ
    యేసుడే నా రక్షకుడు - యేసుడే నా రా రాజు
2. సంతోషము సమాధానము - నా మధిలో పొంగునయా
    పాపమంతా పెకలించే - భయమంతా తొలగించే
3. పరలోకంలో నాపేరు - వ్రాశాడు నాయేసు
    బ్రతుకంతా ఒక ఆశా - యేసునికై నే జీవిస్తా
4. ఊరంతా చాటెదను - లోకమంతా ప్రకటింతును
    జీవించే మన యేసు - త్వరలోనే వస్తాడు

పాట:248
    సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
    యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
    పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2
1. నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా
    నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై
    నాకు తోడై నిలిచితివా  "సర్వాంగ'
2. నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా
    నా నిందలన్నిటిలో యెహోషపాతువై
    నాకు న్యాయము తీర్చితివా   "సర్వాంగ"
3. నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా
    నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై
    నా జయ ధ్వజమైతివా  "సర్వాంగ"

పాట:249
    సర్వకృపానిధి యగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
    స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముతోనిను పొగిడెదము
    హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ..హల్లెలూయ..
    హల్లేలూయ యని పాడెదము... ఆనందముతో సాగెదము
1. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
    పరిశుద్దముగ జీవించుటకై - పాపిని ననుకరుణించితివి         "హల్లె"
2. అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి
    నాధుని అడుగు జాడలలో - నడుచుటకు నను పిలచితివి       "హలె"
3. మరణ శరీరము మార్పునొంది - మహిమ శరీరము పొందుటకై
    మహిమాత్మతో నన్ను నింపితివి - మరణభయములను తీర్చితివి "హల్లె"
4. భువి నుండి శ్రేష్టఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
    భూజనములలోనుండి నన్ను - ప్రేమించి క్రయ ధనమిచ్చితివి  "హల్లె"
5. ఎవరు పాడని గీతములు - యేసుతో నేను పాడుటకై
    హేతువు లేకయే ప్రేమించెన్‌ - యేసుకు నేనేమివ్వగలన్‌         "హల్లె"

పాట:250
      సర్వోన్నతుడా నీవే నాకు - ఆశ్రయా దుర్గము
      ఎవ్వరు లేరు నాకు ఇలలో - ఆదరణ నీవెగా -ఆనందము నీవెగా
1. నీ దినములన్నిట ఎవ్వరు నీయెదుట - నిలువలేరని యెహోషువతో
    వాగ్ధానము చేసి నావు - వాగ్ధాన భూమిలో చేర్చినావు
2. నిందలపాలై నిత్య నిబందన - నీతోచేసిన దానియేలుకు
    సింహాసన మిచ్చినావు - సింహాల నోళ్ళను మూసినావు
3.నీతి కిరీటము ధర్శనముగా - దరించిన పరిశుద్ద పౌలుకు
    విశ్వాసము కాచినావు - జయజీవితము  నిచ్చినావు

పాట:251
    సాగిల పడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మాలో
    మన ప్రభు యేసునీ ఆ..ఆ..ఆ...
1. మోసే కంటే శ్రేష్టుడు - అన్ని మోసముల నుండి విడిపించున్‌
    వేషధారులను ద్వేషించున్‌ - ఆశతో మ్రెక్కెదము  " సాగిల"
2. అహరోను కంటే శ్రేష్టుడు - మన ఆరాధనకు పాత్రుండు
    ఆయనే ప్రదాన యాజకుడు - అందరము మ్రొక్కెదము "సాగిల"
3. ఆలయము కన్న శ్రేష్టుడు - నిజ ఆలయముగ తానే యుండెన్‌
    ఆలయము మీరే యనెను - ఎల్ల కాలము మ్రొక్కెదము "సాగిల"
4. యోనా కంటే శ్రేష్టుడు - ప్రాణధానముగా తన్ను అర్పించెన్‌
    మానవులను విమోచించెన్‌- ఘనపరచి మ్రొక్కెదము "సాగిల"
5. సొలోమొను కన్న శ్రేష్టుడు - సర్వ జ్ఞానమునకు ఆధారుండు
    పది వేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము "సాగిల"
6. రాజుల కంటే శ్రేష్టుడు - యాజకులనుగా మనలను చేసెను
    రారాజుగ త్వరలో వచ్చున్‌ - - రయముగను మ్రొక్కెదము "సాగిల"
7. అందరిలో అతి శ్రేష్టుడు - మన కందరికి తానే ప్రభువు
    హల్లేలూయకు పాత్రుండు - అను దినము మ్రొక్కెదము "సాగిల"

పాట:252
    సిలువ చెంత చేరిన నాడు - కలుషములను కడిగి వేయున్‌
    పౌలు వలెను సీలా వలెను - సిద్ధాపడిన భక్తులజూచి
1. కొండావంటి బండవంటి - మొండిహృదయం మండుచుండె
    పండియున్న పాపులనైనా - పిలచుచుండె పరము చేర    "సిలువ"
2. వంద గొర్రెల మందాలొనుండి - ఒకటి తప్పి ఒంటరియాయె
    తొంబది తొమ్మిది గొర్రెలవిడచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్‌ "సిలువ"
3. తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలి పోయె
    తప్పు తెలసి తిరిగి రాగా - తండ్రి యతని చేర్చుకొనెను    "సిలువ'
4. పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందులో చేరా
    పాపుల గతిని పరికించితివా - పాతాళంభే వారి యంతం  "సిలువ"

పాట:253
    సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
    శిలనైన నన్ను మార్చెను  యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    అమూల్యమైన రక్తము యేసు రక్తము
1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
    సంధి చేసి చేర్చును యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము
2. సమాధాన పరచును యేసు రక్తము
    సమస్యలన్ని తీర్చును యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము
3. నీతి మంతులుగా చేయును యేసు రక్తము
    ధుర్నీతినంత బాపును యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    నిబంధన నిలుపును యేసు రక్తము
4. రోగములను బాపును యేసు రక్తము
    దురాత్మన్‌ పారద్రోలును యేసు రక్తము
    యేసు రక్తము ప్రభు యేసు రక్తము
    శక్తి బలము నిచ్చును యేసు రక్తము

పాట:254
     సిలువలో సాగింది యాత్రా కరుణామయుని దయగల పాత్ర (2)
     ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే...   "సిలువలో"
1. పాలుగారు దేహముపైనా - పాపాత్ముల కొరడాలెన్నో (2)
    నాట్యమాడి నాయి నడి వీదిలో నడిపాయి (2)
    నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా
    ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే...   "సిలువలో"
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు - ఆ మోముపైన ఊసింది మరియొకరు
    బంతులాడి నారు భాదలను పెట్టినారు  (2)
    నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా
    ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే...   "సిలువలో"
3.వెనుక నుండి తన్నింది ఒకరు - తనముందు నిలచి నవ్వింది మరియొకరు (2)
   గేలిచేసి నారు పరిహాస మాడినారు (2)
   నోరుతెరువ లేదాయె ప్రేమా...బదులు పలుక లేదాయె ప్రేమా
   ఇది ఎవరి కోసమో.... ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే...   "సిలువలో"

పాట :255
    సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్లుదము || 2 ||
1. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను  ప్రియుడేసు      || 2 ||
     పొందవలె ఈ లోకంబునందు  కొంతకాలమెన్నో శ్రమలు          || 2 ||
2.  ఐగుప్తును విడచినట్టు మీరు అరణ్యవాసులై ఈ ధరలో             || 2 ||
    నిత్యనివాసము లేదిలలోన  - నేత్రాలు కానునుపై నిల్పుడి          || 2 ||
3. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి || 2 ||
    నీ రక్షకుండగు యేసే నడుపును  మారని తనదు మాట నమ్ము || 2 ||
4. ఐగుప్తు ఆశలన్నియు విడచి రంగుగ యేసుని వెంబడించి        || 2 ||
    పాడైన కోరహు పాపంబుమాని  విధేయులై విరాజిల్లుడి            || 2 ||
5. ఆనందమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు || 2 ||
    సీయోను గీతము సొంపుగ కలసి  పాడెదము ప్రభు యేసుకి జై || 2 ||

పాట:256
    స్తుతి సింహాసనాసీనుడా - యేసు రాజా దివ్యతేజ
1. అద్వితీయుడవు - పరిశుద్ధుడవు - అతి సుందరుడవు నీవె ప్రభు
    నీతి న్యాయములు నీ - సింహాసనాధారం
    కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు
2. బలియు అర్పణ కోరవు నీవు- బలియైతివి నా దోషముకై
    నా హృదయమే నీ - ప్రియమగు ఆలయం
    స్తుతి యాగమునే చేసెద నిరతం
3. బూరధ్వనులే నింగిలో మ్రోగగ - రాజాధి రాజ నీవే
    వచ్చువేళ సంసిద్ధతతో - వెలిగే సిద్దితో
    పెండ్లికుమారుడా నిన్నెదుర్కొందును

పాట:257
    స్తుతి పాత్రుడా -స్తోత్రార్హుడా - స్తుతులందుకో - పూజార్హుడా
    ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా ప్రభు
1. నా శత్రువులు - నను తరుముచుండగా
    నా యాత్మ నాలో కృంగెనే ప్రభు
    నా మనస్సు నీవైపు - త్రిప్పిన వెంటనే
    శత్రువుల చేతినుండి- విడిపించినావు కాపాడినావు
2. నా ప్రాణ స్నేహితులు- నన్ను చూచి
    దూరాన నిలిచేరు - నా ప్రభూ
    నీ వాక్య ధ్యానమే - నా త్రోవకు వెలుగై
    నను నిల్పెను నీ సన్నిదిలో - నీ సంఘములో

పాట:258
    స్తుతించిన సాతాన్‌ పారిపోతాడు - కునికితే తిరిగి వస్తాడు
    స్తుతించి పాడి కోటను కూల్చెదం - స్తుతుల శక్తితో యెరుకో పట్టెదం
1. దావీదు పాడగా సౌలుకు విడెదల - 2
    కలతలు తీరెను నెమ్మది దొరికెను -2  "స్తుతించి"
2. స్తుతించు దావీదుకు దైర్యం నిండెను -2
    విశ్వాశవాక్తుతో గొల్యాతున్‌ గెల్చెను -2   "స్తుతించి"
3. గొర్రెల కాపరి రాజుగా మారెను -2
    ఆరాధన వీరునికి ప్రమోషన్‌ దొరెకెను -2   "స్తుతించి"
4. చేపకడుపులో యోనా స్తుతించెను -2
    విడుదల పొంది నినెవె చేరెను -2
5. పెదవిపై స్తుతులు చేతిలో వాక్యం -2
    స్వార్ధం నలుగ కొట్టి జయమును పొందెదం  "స్తుతించి"

పాట:259
    స్తుతి పాడనా నేను ననుకాచె యేసయ్యకు
    నాజీవన దాతకు నను నడిపే ప్రభువుకు - 2
1. పాపములో పడియున్నవేళా - వదలక వడి చేర్చిన నాదేవా
    నిదివ్య కాంతితో - నను నడిపే ప్రభువుకు  - 2           "స్తుతి"
2. సోలిపోయి తూలుచున్నవేళా - వదలక నను నడిపిన నాదేవా
    నా హృదయ ధ్యానమే నీకే అర్పింతును  - 2             "స్తుతి"
3. భువినేలు రారాజు నీవనీ - పరలోక మహిమను ప్రకటించిన
    నీ రెక్కల చాటునా నను దాచే ప్రభుడవు - 2             "స్తుతి"

పాట: 260
    స్తుతి పాడెదను ప్రతి దినము స్తుతి పాడుటయే నా అతిశయము
అ.ప. దవళవర్ణుడా మనోహరుడా - రత్నవర్ణుడా నా ప్రియుడా  " స్తుతి"
1. ఆరాధించెద అరునోదయమున - అమరుడ నిన్నే ఆశతీర - 2
    ఆశ్రిత జనపాలకా - అందుకో నా స్తుతి మాలిక                   "దవళ"
2. గురి లేని నన్ను ఉరి నుండి లాగి - ధరి చేర్చినావే పరిశుద్ధుడా -
    ఏమని పాడెద దేవా - ఏమని పొగడెద ప్రభువా                "దవళ"
3. మతిలేని నన్ను శృతిచేసినావే - మృతినుండి నన్ను బ్రతికించినావే - 2
    నీ లత నై పాడెద దేవా - నా పతివని పొగడెద ప్రభువా         "దవళ"

No comments:

Post a Comment