పాట:261
స్తుతులనందుకో - స్తుతికి
పాత్రుడా
ఘనతపొందుకో - స్తోత్రార్హుడా
అ. నీకే నా ఆరాధనా -
నీకోసమే ఆలాపనా
నీకే నీకే నా హృదయార్పణ " స్తుతుల"
1 నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు "2
నీకే నా ఆరాధనా -
నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ
2
నీలాంటి ఘనుడెవ్వడు - నీ తోటి సముడెవ్వడు "2"
నీకే నా ఆరాధనా
- నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ
పాట:262
సుభా హో య సామ్ - రాత్ ఔర్ దిన్
- తేరాహి నామ్ - 2 - #3
ఈశుమేరే - ఈశుమేరే - 2 బజతారహూ
తేరానామ్ - 2
సుభా హో య సామ్ - రాత్ ఔర్ దిన్
- తేరాహి నామ్ - 2
1. తు
హర్ దిల్ మే - తు రంగత్ మే - ఇస్ దునియాకే హర్ ఎక్ తన్ మే - 2
ఈశు మేరే... - ఈశు మేరే తుహే సబ్‌కా
మాలిక్ - దిల్ సే హే - లేరే తేరేనామ్
బజతారహు తేరానామ్ "సుభా హో"
2. తేరే
ప్రశంషా ఇస్ దిన్ గావు - తేరే హి మహిమా సబ్ కో సునావు
రాత్ తుహీ... - రాత్ తుహి జీవన్‌కా
మాలిక్ - జబ్ సే హే - లేరే తేరేనామ్ - 2
బజతారహు తేరానామ్ "సుభా హో"
పాట:263
సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ
జగతికి - 2
ప్రభుయేసుని జననమనాడు -
వికసించెను మధినీ నేడు
"సుధి"
1. చీకటి
మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......2
పరముకు పధమై అరుధించె - వెలుగై
యేసుడు ఉదయించె - 2 "సుధి"
2. కన్నీటితో
నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......2
ఉదయించెను కాంతిగా నాడు -
విరజిమ్మెను శాంతిని నేడు - 2
"సుధి"
3. వచ్చెను
నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......2
త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా
ఇక ఈనాడు - 2 "సుధి"
పాట:264
సుగుణాల సంపన్నుడా -
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో -
ఆస్వాదింతును నీ మాటల మకరందము
1. యేసయ్య
నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము - ఇది
రక్షణానంద భాగ్యమే "సుగుణాల"
2. యేసయ్య
నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు - నేను
నడువ వలసిన త్రోవలో "సుగుణాల"
3. యేసయ్య
నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి
ఎన్న తగినవి కావే "సుగుణాల"
పాట:265
స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ -
వేలాది వందనాలు
కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు -
స్తుతి స్తోత్రముల్
యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా (4)
1. శూన్యము
నుండి సమస్తము కలుగజేసెను
నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2)
యేసే నా
సర్వము - యేసే నా సమస్తము (2) " యేసయ్యా"
2.
పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను
మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును
కార్చెను (2)
సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2)
" యేసయ్యా"
పాట:266
స్తోత్రింతుము నిను మాదు తండ్రీ -
సత్యముతో నాత్మతో నెపుడు
పరిశుద్దాలంకారములతో- దర్శించెదము
- శరణం ...శరణం
1. శ్రేష్ట యీవుల నిచ్చినందున - శ్రేష్ట
యీవుల యూట నీవే
త్రిత్వమై యేకత్వమైన త్రి - యేక
దేవా శరణం...శరణం
"స్తోత్రింతు"
2. పాపి మిత్రుడు,పాప నాశుడ -
పరమ వాసుడ ప్రేమా పూర్ణడ
వ్యోమ పీఠుడ, స్వర్గపూజ్యుడ-
పరిశుద్దాంగుడ,శరణం..శరణం "స్తోత్రింతు"
3. దవళ వర్ణుడ, రత్నవర్ణుడ-
సత్యరూపి యనబడువాడ
నను రక్షించిన రక్షకుండ- నాధా
నీకే శరణం ....శరణం
"స్తోత్రింతు"
4. సంఘమునకు శిరస్సు నీవే - రాజనీకే
నమస్కారములు
ముఖ్యముగను మూల రాయి - కోట్లకొలది
శరణం..శరణం "స్తోత్రింతు"
5. నీదు సేవకుల పునాదిది - జ్ణానమునకు
మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడెదము
శరణం ..శరణం
"స్తోత్రింతు"
6. రాజనీకే స్తుతి స్తోత్రములు - గీతముల
మంగళ ధ్వనులు
శుభము ,శుభము,శుభము నిత్యము
- హల్లెలూయ ఆమెన్, ఆమెన్ "స్తోత్రింతు"
పాట:267
స్తోత్రబలి
స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ
చిరుపాదమే
1. నిన్నటి
బాధలంతా - నేటికి మాయమయ్యే -2
నెమ్మది ఉదయించే - అది
శాశ్వతమైనదయ్యా -2
కోటి, కోటి స్తోత్రం
డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
2. రేయంతా
కాచితివి - మరుదినమిచ్చితివి -2
మరువని నా స్నేహమా - కలసి
సంతోషింతును -2
కోటి, కోటి స్తోత్రం
డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
3. నీసేవ
మార్గములో - ఉత్సాహం నొసగితివి -2
ఉరికురికి పనిచేయ -
నాకారోగ్యమిచ్చితివి
కోటి, కోటి స్తోత్రం
డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
4. వేదన
ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2
యేసయ్యా నీ నీడలో దిన దినం
జీవింతును -2
కోటి, కోటి స్తోత్రం
డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
పాట:268
స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో
మమ్ము కడుగు యేసయ్యా
మా ఆరోగ్యం నీవే - ఆదరణ నీవే -
ఆనందం నీవేగా "స్వస్థ"
1. ఒక్క
మాట మాత్రం నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాది బాదలన్నీ
శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము
వారికి ఘనవిజయం "స్వస్థ"
2. పాపపు
శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము
క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ
మహిమలో నిత్యము వశింపనిమ్ము
"స్వస్థ"
పాట:269
షారోను రోజా యేసే - పరిపూర్ణ
సుందరుడు
ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని
ప్రాణ ప్రియుని - కను గొంటిని
అడవులైనా లోయలైనా - ప్రభు వెంట
నేనువెళ్ళెదను
1. యేసుని
ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)
దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే
వారెవ్వరు
అడవులైనా లోయలైనా ప్రభు వెంట
నేనువెళ్ళెదను "షారోను"
2. సీయోను
వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2)
చేసిన సేవను మరువకా (2) - ఆధరించి
బహుమతులెన్నో ఇచ్చును
అడవులైనా లోయలైనా ప్రభు వెంట
నేనువెళ్ళెదను "షారోను"
పాట:270
సంతోషం నాకు
సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం
సంతోషం నీకు
సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం
హల్లేలుయా
ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే
1. గంతులు
వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...
నాకై రక్తాన్ని
చిందించి శుద్దునిగాచేసిన
యేసంటే నాకు
సంతోషం - 2 || హల్లేలూయా ||
2. ఆత్మతోను సత్యముతోను ఆరాధన
చేయనా...
నాకై ఆత్మను
ప్రోక్షించి పరలోకం చేర్చిన
యేసంటే నాకు
సంతోషం - 2 || హల్లేలూయా||
పాట:271
హల్లేలూయా పాట
- యేసయ్య పాట
పాడాలి ప్రతి
చోట... - పాడాలి ప్రతి నోట
అ.ప.హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (4)
1. కష్టలెన్నో కలిగినా - కన్నీరుయే మిగిలినా
స్తుతి పాటలే
పాడుమా - ప్రభు యేసునే వేడుమా"2"
2. చెరసాలలో వేసినా- బంధాలు బిగియించినా
స్తుతి పాటలే
పాడుమా - ప్రభు యేసునే వేడుమా"2"
పాట:272
హల్లేలూయ
స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము
ఆ... హల్లెలూయ, హల్లెలూయ. హల్లెలూయ
-2 "హల్లేలూయ"
1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము - 2
అల సంద్రములను
దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము - 2 "హల్లే"
2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతించెదము - 2
బండనుండి మధుర
జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము -
2
"హల్లే"
3. పరలోకము నుండి ధరకేతించిన - దేవుని స్తుతించెదము - 2
నసియించు దానిని
వెదకి రక్షించిన - యేసుని
స్తుతించెదము - 2 "హల్లే"
పాట:273
హే ప్రభుయేసు
హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా -
పాపహరా - శాంతికరా "హే ప్రభు"
1. శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధి
శాంతిస్వరూప
జీవనదీపా - శాంతి సువార్తనిధీ
"సిల్వ"
2. తపములు తరచిన నిన్నేకదా - జపములు గొలిచిన నిన్నేగదా
విఫలులు చేసిన
విజ్ఞాపనలకు -సఫలత నీవెకదా "సిల్వ"
3. మతములు వెదకిన నిన్నేకదా - వ్రతములుగోరిన నిన్నేగదా
పతితులు దేవుని
సుతులని నేర్పిన - హితమతి నీవెగదా
"సిల్వ"
4. పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా
మలమల మాడిన మానవ
హృదయము- కలకల లాడెగదా "సిల్వ"
No comments:
Post a Comment