Tuesday, September 4, 2012

TELUGU CHRISTIAN LYRICS 1 - 20

పాట:1              
     అగ్ని మండించు  నాలో అగ్ని మండించు  -2
     పరిశుద్ధాత్ముడా - నాలో అగ్ని మండించు -2
1. అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగా
    ఆ అగ్ని లో నుండే - నీవు మోషేను దర్శించినావే      "అగ్ని"
2. అగ్ని కాల్చి వేసెనే - సిద్ధం చేసిన అర్పణను
    ఆ అగ్ని ద్వారానే - నీవు గిద్యోన్ని దైర్యపరచితివే        "అగ్ని"
3. అగ్ని కాన రానందునా - వారు సిగ్గు పడిపోయిరే
    నీ అగ్ని దిగిరాగా - నీవు ఏలియాను ఘన పరచినావే  "అగ్ని"
4. ప్రాణ ఆత్మ శరీరము - నీకే అర్పించు చున్నానయ్యా
    నీ ఆత్మ వరములతో - నను అలంకరించుమయా       "అగ్ని"

పాట:2
    అలల పైనే నడచినా నాదు  యేసయ్యా- ఆదు కోవయ్యా ..(2)
    గలిబిలిని నా కలవరములను - తొలగచేసిన కలుషహరుడా (2)
    నాదు యేసయ్యా...  ఆదు కోవయ్యా... నాదు యేసయ్యా
1. శుద్ధుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయన మైతిని (2)
    ప్రొద్దుపోయెను భయము లాయెను - ఉద్ధరించగ స్వామి రావా   "ఆదు "
2. నట్టనడి సంద్రాన రేగెను- అట్టహాసపు పెనుతుఫాను (2)
    గట్టుచూడగా చాల దూరము - ఇట్టి శ్రమలలో చిక్కు కొంటిని     "ఆదు "
3. అలలు నాపై విసరి కొట్టగా - నావ నిండుగా నీరు చేరెను (2)
    బ్రతుకులెంతో భారమాయెను - రేవు చేరే దారి లేదా                 "ఆదు "
4. మాట మాత్రపు సెలవు చేత - సూటిగా అద్భుతములెన్నో (2)
    చాల చేసిన శక్తి మంతుడా - జాలి చూపి మమ్ము బ్రోవుమా        "ఆదు "
5. చిన్న జీవిత నావ నాది - నిన్నేగురిగా పయనమైతిని
    ఎన్నోశోధన లెన్నో భయములు - కన్నతండ్రి కానరావా              "ఆదు "

పాట:3
     అందాల తార అరుదించెనాకై - అంబర వీధిలో
     అవతారమూర్తి యేసయ్య కీర్తి - అవనిజాటుచున్‌
     ఆనందసంద్ర ముప్పొంగెనాలో - అమర కాంతిలో
     ఆది దేవుని చూడ ఆశింప మనసు - పయనమైతిని                   "అందాల"
1. విశ్వాశయాత్ర దూరమెంతైన - విందుగదోచెను
    వింతైన శాంతి వర్షించెనాలో - విజయ పధమున
    విశ్వాలనేలేడి దేవ కుమారుని - వీక్షించు దీక్షతో 
    విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్‌              "అందాల"
2. యెరూషలేము రాజనగరిలో - యేసుని వెదకుచు
    ఎరిగిన దారి తొలగినవేళ - యెదలో కృంగితి
    యేసయ్య తార యెప్పటివోలె - ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు - యేగితిస్వామి కడకు "అందాల"
3. ప్రభు జన్మ స్థలము పాకయేగాని - పరలోక సౌధమే
    బాలుని జూడ జీవితమంత - పావనమాయెను
    ప్రభు పాద పూజ ధీవెనకాగ - ప్రసరించె పుణ్యము
    బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె - ఫలియించె ప్రార్ధన     "అందాల"

పాట: 4
         అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము
         ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము
అ.ప:  యేసు నామము - జయం జయము
         సాతాను శక్తుల్‌ - లయం లయము
         హల్లేలూయా - హోసన్న హల్లేలూయ - హల్లేలూయా - ఆమెన్‌
1. పాపముల నుండి విడిపించును యేసుని నామము (2)
    నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము  (2)
2. సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసున నామము (2)
    శత్రు సమూహం పై జయమునిచ్చెను జయశీలుడైన యేసుని నామము (2)

పాట:5
    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా
    అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే
    ఆహహా - హల్లెలూయా (3)అహహా ఆమేన్‌ ...
1. ఆశ్చర్య కరుడా స్తోత్రం - ఆలోచన కర్త స్తోత్రం
    బలమైన దేవా నిత్యడగు తండ్రి - సమాదాన అధిపతి స్తోత్రం
2. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
    నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్త స్తోత్రం
3. మృత్యుంజయడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం
    మమ్ములను కొనిపోవా త్వరలో రానున్న - మేఘ వాహనుడా స్తోత్రం
4. ఆమేన్‌ అనువాడ స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
    అగ్నిజ్వాలల వంటి కన్నుల గలవాడా - అత్యున్నతుడా స్తోత్రం

పాట:6
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
    మరణము కంటె బలమైన ప్రేమది – 2
    నన్ను జయించే నీప్రేమ
1. పరమును వీడిను ప్రేమ ధరలో -పాపిని వెదకిన ప్రేమ
    నన్ను కరుణించీ,ఆదరించీ,సేదదీర్చీ,నిత్య జీవమిచ్చే
2. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ
    నాకై మరణించి,జీవమిచ్చీ జయమిచ్చి తన మహిమనిచ్చే
3. నాస్థితి జూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ
    నాకై పరుగెత్తి,కౌగిలించి ముద్దాడి, కన్నీటిని తుడిచెను
4. శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ
    విడనాడనీ,ప్రేమదీ ఎన్నడు ఎడబాయనిది

పాట:7
      ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
     ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతి యించుడీ...హల్లేలూయ "ఆకాశ"
1.  ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
     సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతియించుడీ..హల్లేలూయ           "ఆకాశ"
 2. సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
     వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతియించుడీ హల్లేలూయ "ఆకాశ"

పాట:8
    ఆకశాన తార ఒకటి వెలసింది - ఉదయించెను రక్షకుడని తెలిపింది
    ఇదే Christmas - Happy, happy Christmas Mary, Mary Christmas
1. యూద దేశపు బెత్లెహేములో - కన్య మరియ గర్బమున జన్మించె
    తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు  - యూదుల రాజు ఎక్కడని వెతికారు
   తూరుపు దిక్కున చుక్కను కనుగొని - ఆనందభరితులై యేసుని చేరిరి
   కానుకలిచ్చిరి పూజించిరి -
    ఇదే Christmas - Happy, happy Christmas Mary, Mary Christmas
    Happy, happy Christmas                             "ఆకశాన"
2. రాత్రివేళలో మంద కాసెడి - కాపరులకు ప్రభువు దూత ప్రకటించే
    లోక ప్రజలకు మిగుల సంతసం - కలిగించెడి వర్తమానమందించే
    క్రీస్తే శిశువుగా యేసుని పేరట - ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా
    సంతోషగానముతో స్తుతియింతుము
     ఇదే Christmas - Happy, happy Christmas Mary, Mary Christmas
    Happy, happy Christmas                            "ఆకశాన"

పాట:9
   ఆయనే నా సంగీతము - బలమైన కోటయును
   జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను                 " ఆయనే"
1. స్తుతుల మద్యలోన నివాసం చేసే - దూతలెల్ల పొగడే దేవుడాయనే
    వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కులేని పిల్లలకు దేవుడాయనే  "ఆయనే"
2. ఇద్దరు ముగ్గురు నామంబున - ఏకీభవించిన వారి మధ్యలోన
    ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము    "ఆయనే"
3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమెల్ల కీర్తించెదను
    ప్రభురాకడలో నిత్యముందును - మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము "ఆయనే"

పాట:10
    ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
    యేసుతో నూతన యెరుషలేము యాత్ర
1. యేసుని రక్తము పాపములనుండి విడిపించును (2)
    వేయి నోళ్ళతో స్తుతియించినను (2)
    తీర్చ లేము ఆ ఋణమును (2)
2. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండ (2)
    మనకు పరిచర్య చేయుటకొరకై (2)
    దేవదుతలు మనకుండగా (2)
3. కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను (2)
    కృపా వాక్యమునకు సాక్షులమై  (2)
    కృపవెంబడి కృపను పొందెదము (2)
4. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం (2)
    ఆత్మానంద భరితులమై (2)
    ఆగమన కాంక్షతో సాగెదం (2)

పాట: 11
    ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా
    కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా
    యేసయ్యా కారణం నీవేనయ్యా
1. లోకం లో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం
    అయినను ఎందుకో నెమ్మది లేదు  (2)
    సమధానం కొదువైనది యేసయ్యా (2) "ఆధారం"
2. ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంభములో కలతేమి లేదు (2)
    అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
    సమధానం కొదువైనది యేసయ్యా (2) "ఆధారం"
3. నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2)
    హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
    సాక్షిగా జీవింతును  హల్లేలూయ సాక్షిగా జీవింతును

పాట:12
    ఆరాధన ఆరాదన - స్తుతి ఆరాధన ఆరాధన
    సత్యవంతుడా ఆరాధన - నిత్యుడగు దేవుడా ఆరాధన
1. యెహోవాయీరే ఆరాధన – చూచుకొను దేవుడా ఆరాధనా
2. యెహోవా రాఫా ఆరాధన - స్వస్థపరచు దేవుడా ఆరాధనా
3. యెహోవా షాలేం ఆరాధన - శాంతినిచ్చు దేవుడా ఆరాధనా
4. యెహోవా నిస్సీ ఆరాధన - జయమునిచ్చు దేవుడా ఆరాధనా

పాట:13
    ఆరాధనా.... ఆరాధనా....స్తుతి ఆరాధనా.... ఆరాధనా....
    ప్రభావముతో, సర్వశక్తితో తండ్రి నీకే ఆరాధనా.....
1. పరిశుద్ధాత్ముడా – నిన్నే ఆరాధి౦తును
    ఆత్మనాధుడా - నిన్నే ఆరాధి౦తును (2)
    జీవదాతవే -  నిన్నే ఆరాధి౦తును
    మహిమస్వరూపి -  నిన్నే ఆరాధి౦తును(2)   “ఆరాధనా
2. యేసునాధుడా నిన్నే ఆరాధి౦తును
    పరిశుద్దుడా నిన్నే ఆరాధి౦తును(2)
    మృత్యుంజయుడా నిన్నే ఆరాధి౦తును
    జీవనాధుడా నిన్నే ఆరాధి౦తును(2)        “ఆరాధనా
3. సర్వశక్తుడ నిన్నే ఆరాధి౦తును
    ప్రేమనాధుడా నిన్నే ఆరాధి౦తును(2)
    మహోన్నతుడా నిన్నే ఆరాధి౦తును
    అత్యున్నతుడా నిన్నే ఆరాధి౦తును(2)    “ఆరాధనా

పాట : 14
    ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2)
    దివా రాత్రులు నీ నామస్మరణ "2" చేసినా నా కెంతోమేలు
    స్తోత్రము స్తుతి స్తోత్రము - స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
1. దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులు కీర్తింపగా (2)
    స్తుతుల మధ్యలో నివసించు దేవా(2) నాస్తుతి గీతము నీకే ప్రభువా
    స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
2. సిలువలో మాకై మరణించినా - పరిశుద్ధ రక్తము చిందించినా (2)
    వధింప బడినా ఓ గొర్రెపిల్ల (2) - యుగ,యుగములు నీకే మహిమ(2)
    స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)

పాట: 15
      ఆరాధన  అధిక స్తోత్రము - నాయేసుకే
      నేనర్పింతును నా యేసుకే - నా సమస్తము "2"
1. పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా
    వేనోళ్ళతో నే పాడెదన్‌ - నే పాపిని నన్ను చేకొనుము "2"
2. కరుణ ధార రుధిరము - నన్ను తాకి ప్రవహింపగా
    నా పాపమంతయు తొలగిపోయెను - నా జీవితం నీకే అంకితం

పాట:16              
    ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా....
    నవజీవన మార్గమునా.. నన్ను నడిపించుమా...
    ఊహించలేనే నీ కృపలేని క్షణమును
    కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే
    ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా
1. లోక మర్యాధలు - మమకారాలు -గతించి పోవునే
    ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే... (2)
    అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
2. నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెర వేర్చు చుంటినే
    నీతో చేసిన.. తీర్మానములు స్థిరపరచితివే...(2)
    అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
    నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద...(2)
    అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
4. నిత్య నివాసినై నీముఖము చూచుచు పరవశించెదనే
    ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించు చున్నది (2)
    స్తుతి,ఘనమహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
    హల్లేలూయా - హల్లేలూయా - హల్లెలూయా....  2 "ఆశ్రయ"

పాట:17
    ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధనా
    ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
    నీకే నా దేవా...    తండ్రి అందుకోవా....
1. అన్నిటికీ అధారమైనవాడా నీకే ఆరాధన
    ఎన్నటికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన
2. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధన
    మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత  స్తుతి ప్రార్ధన
3. అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధన
    చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన

పాట:18
    అపరాదిని యేసయ్యా - కృప జూపి బ్రోవుమయ్యా
    నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు 
1. సిలువకు నిను నే గొట్టితిని - తులవలతో జేరితిని
    కలుషంభులను మోపితిని - దోషుండనేను ప్రభువా
2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
    మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యా 
3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
    నా వల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రీ
4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావనిడితి
    ద్రోహుండనై జేసితినీ - దేహంబుగాయములను
5. గోరంబుగా దూరితిని -నేరంబులను జేసితిని
    క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా  
6. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత 
    నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా 
7. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
    అక్షయభాగ్యము నియ్యా - మోక్షంబు జూపితివయ్యా 
                                               (సిరిపురపు  కృపానందము )
పాట:19
      ఆలయంలో ప్రవేశించండి అందరూ
      స్వాగతం సుస్వాగతం యేసునామంలో
      మీ బ్రతుకులో పాపమా కలతలా
      మీ హృదయంలో బాధలా కన్నీరా
      మీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం
1.   దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
      వెదకే వారికంతా కనబడు దీపము
      యేసురాజు మాటలే వినుట ధన్యము
      వినుట వలన విశ్వాసం అధికమధికము
      ఆత్మలో దాహము తీరెను రారండి
     ఆనందమనందం హల్లెలూయా                       ||ఆలయంలో||
2.  ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలై
     జీవ వృక్షంబుగా ఫలియించాలని
     పెదవితో పలికెదం మంచి మాటలే
     హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
     నింపెదం నిండెదం కోరేదం పొందెదం
     ఆనదంమానదం హల్లెలూయా                        ||ఆలయంలో||

పాట 20
    ఇరుకులో విశాలత కలుగజేసి నావు - ఎన్నెన్నో మేళ్ళతో నన్ను నింపినావు  "2"
    ఎన్నతరమే ప్రేమా వర్ణింపతరమే నీప్రేమా   "2"                       " ఇరుకులో"
1. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చి నావు - పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు "2"
    నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా- నీ పనిలో మెండుగా ఫలియింప చేసినావు"2"
2. నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను - నీ సేవలో జీవింపచేసినావు నన్నూ 2"
    బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే - పరమ కానానులో నన్ను చేర్చు నీ ధరికి "2"
3. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు - చెవికి వినబడవు ఆశ్చర్యక్రియలు "2"
    నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా - శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి "2"

2 comments:

  1. thank u very much friend for making these available. May God bless u

    ReplyDelete
    Replies
    1. Thank You Share It in Your friends in Facebook Twitter and all over world reach for Every Telugu peoples

      Delete