Saturday, October 6, 2012

మోక్షానికి మార్గం-దేవుని ప్రేమ

               మోక్షానికి మార్గం-దేవుని ప్రేమ
 స్వాతంత్ర సమర యోధులు, మాజీ పార్లమెంట్సభ్యులు పండిత  ధర్మప్రకాశ్ శర్మ గారి సాక్ష్యం. http://dharmaprakashsharma.webs.com/telugu.htm
మోక్షానికి మార్గం-దేవుని ప్రేమ  స్వాతంత్ర సమర యోధులు, మాజీ పార్లమెంట్ సభ్యులుపండిత  ధర్మప్రకాశ్ శర్మ గారి సాక్ష్యం. సనాతన పరశర బ్రాహ్మణ,వేదవ్యాసవంశంలో1893లో జన్మించి రాజస్థాన్ లోని,హిందూ అతిపురాతన అతిపవిత్ర తీర్థస్థానమైన పుష్కర్ లో వున్న ఏకైక బ్రహ్మదేవాలయానికి ముఖ్య పుజారిగా(నలుగురు శంకరాచార్యులూ యీయన పాదములు కడిగి ఆనీటిని త్రాగుతారు, ప్రపంచంలో ఇంకెక్కడా బ్రహ్మ దేవాలయాలు లేవు)వున్న నా తండ్రి పండిత శోహన్ లాల్ శర్మ గారు 90% సమాజం వర్గ వర్ణ కుల మత అంటరానితనం వల్ల కాపరిలేనిగొఱ్ఱెల్లా, 10% ఆర్య పారశీక మొఘల్ పోర్చుగీసు,ఆంగ్లవిదేశీ,స్వదేశీ గొఱ్ఱె చర్మం కప్పుకున్నతోడేళ్ళకు బలై చీకటి, మరణఛాయల్లోవున్న దళితబలహీనవర్గాల దుస్థితి చూచి చలించి తనభోగవిలాస రాజ పురోహిత అధికార భవనాన్ని వదలి దేవునిప్రజలతో(హరిజనులతో)శ్రమ అనుభవించడం మేలనియోచించి వారి మధ్యే నివసిస్తూ సంస్కృతహిందీభాషల్లో తనభావాలను  ప్రచురించినప్పుడు అనేకులు ఆయనశిష్యులుగా చేరి భారత భౌతిక అధ్యాత్మిక స్వతంత్రా నికై కంకణం కట్టుకున్నారు. ఎన్నో ఎక రాలను ఎంతో బంగారాన్ని పేదలకై తిరిగిచ్చిన నాతండ్రి భావాలను,బాలగంగాధర్ తిలక్ లాలా లాజ్ పాత్ రాయ్, వినోబాభావె వంటివారు ప్రశంశిస్తున్న రోజుల్లో మహాత్మాగాంధీ మానాన్నగారి ఆత్మీయ స్నేహితులయ్యారు.నా తల్లి కేవలం 16సం||ల వయస్సుకే  మహాత్మాగాంధీ గారి ప్రేరణతో మాతృదేశస్వతంత్ర పోరాటానికై సీతాపూర్ ధనిక బ్రాహ్మణ ఇంటి సుఖాల వదలి  సత్యాగ్రహంలో లాఠీలను సహించడంవల్ల యూ.పి మాహిళాకాంగ్రెస్ అద్యక్షురాలిగా ఎదిగారు.బ్రహ్మచారిగా వుంటానన్న నాన్నగార్ని గాంధీ గారు వారించి, 1932 అక్టోబరులో ఖద్దరు ధరించిన వీరిద్దరి వివాహం, శ్రీమతి స్వరూపరాణి మోతీలాల్ నెహ్రూ వంటి వారి పెద్దల సమక్షంలో లక్నోలో గాంధీ గారు దైవసాక్షిగా సర్వ మత ప్రార్ధనతొ గావించినారు.మొదటి బిడ్డ1935లో చని పోయినప్పుడు నాతల్లి పరమేశ్వరునితో నీవొక కుమారుణ్ణిస్తే అతణ్ణి నీ (మానవ-మాధవ) సేవకు తిరిగిస్తాఅని మ్రొక్కుకొంది. నేను గర్భ్హంలోపడిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం నా తండ్రికి 6 సం||ల కఠినకారాగార శిక్ష విధిం  చింది.అయినా సత్యాగ్రహాలు మానని మాఅమ్మను గర్భ్హవతి గానే ఫతేహ్ పూర్ జైల్లో నిర్భ్హందించినపుడు 1937డిసెంబర్23న నేను జైల్లో జన్మిం చాను.కొన్ని నెల్లకు విడుదలై వెళ్తూవస్తూ నన్నువడిలో పెట్టుకొని దైవప్రేమ దేశప్రేమ గీతాలను ఆలించినప్పుడు ఆమె కన్నీరు నామీద పడిఅమ్మా,నాన్నకోసం ఏడుస్తున్నావా?”అంటే లేదురా దైవప్రేమ-దేశప్రేమతో ఏడుస్తున్నానురాఅంది.ఆ దైవంనీ తండ్రి కూడా అంది.అమ్మా తండ్రి దేవుణ్ణి ఇపుడే చూపించుఅన్నాను.దైవప్రేమను రుచించినపుడు నీలోనే ఆదైవాన్ని అనుభవిస్తావు ఆయన్నే సేవి స్తావ్అంది.నా తల్లి తిరిగి జైల్లో వేయబడి నప్పుడు నన్ను గాంధీగారు తనవద్దే అశ్రమంలో వుంచుకొన్నారు. గాంధీ గారు భుజాలపై నన్నాడించిన రోజులు నాకింకా గుర్తున్నాయి.1945లో జైల్లోనుండి విడుదలైన తల్లి దగ్గరకు తిరిగి వచ్చాను. పుష్కర్ తీర్థంలో తన రంగ స్థల పురాణ నాటకాలతో భక్తులనలరించే ఎత్తైన బలమైన గోపినాధ్ అనే ఒక బ్రాహ్మణ పూజారి నా బాల్య హీరో(పెద్దయినప్పుడు ఇలా ఉండాలి అనుకునేవాణ్ణి) అయితే ఓ రోజు మాఅందరి కళ్ళముందే రక్తం కక్కుతూ విలవిలలాడి చనిపోయాడు.నా హృదయం తల్లడిల్లింది.ఓ రోజు నేను కూడా చని పోతానా?పుట్టుక మరణం సృష్టి  ఉద్దేశ్యం తెలిసికోడానికి7సం||లు వేదాంతం ధ్యానించాను. ఖురాన్,బౌద్ధ,పార్శీగ్రంధాలను ఆశతో చదివాను. కాని నా ప్రశ్నలకు సమాధానం దొరక లేదు. తల్లితో కలసి సత్యాగ్రహాలు చేస్తున్న నన్ను బ్రిటిష్ పోలీసులు చితుకబాది ఓ రోజంతా జైల్లోవుంచి మరునాడు దూరఅరణ్యంలో విడిచి పెట్టారు.తెల్లవాడంటే పగద్వేషంవల్ల బైబిల్ నా దృష్టికి రాలేదు. సుభాశ్ చంద్ర బోస్ పిలుపునాకు రక్తాన్నివ్వు నీకుస్వతంత్ర మిప్పిస్తాభావోద్రేకాలకు గురిచేయగా ముంజేతిని కోసి రక్తంతో సంతకం చేసాను. కార్ల్ మార్క్స్ డస్ కాపిటల్ ఆలోచింప జేసింది. ఓ రోజు ఉత్తరాలు చదువు తున్న గాంధీ గారు,ఓ హిందూ ఉగ్ర వాది వ్రాసిన నీవు కుక్కవు,త్వరలో నిన్ను చంపుతాంఅంటూ ఎన్నో బూతులు ఉన్నాఉత్తరాన్ని బిగ్గరగా చదివారు.ఇదొక బహుమతి అన్నారాయన. జవాబులో ప్రియ సోదరా ఉత్తరానికై ధన్యవాదములు నీ భావాల ను నేను గౌరవిస్తాను కాని నేను  దైవ చిత్తాన్ని,దేశ క్షేమాన్నికోరి మాత్రమే ఈ అహింసా మార్గాన్ని ఎన్ను కొన్నాను.అయితే  దేవుడు నిన్ను తనశాంతితో దీవించు గాక. మా ఆశ్రమానికి స్వాగతంఅంటూ వ్రాసినఉత్తరం నాపై గాంధేయ వాదిగా చెరగనిముద్ర వేసింది. స్వతంత్రం వచ్చిన తర్వాత సాయంకాలపు ప్రార్దనలో వినోబాభావె గారు,గాంధీ గారితో దైవం తోడు గనుక  కోమటి ఐనా మీరు భౌతిక స్వతంత్రం సంపాదించ గలిగారు,మరి అధ్యాత్మిక స్వతంత్రం (దేవుని రాజ్యం) మాటేమిటిఅనడిగినప్పుడు, “భౌతిక స్వతంత్రం నాకు (సంతృప్తి నివ్వలేదు)నిరాశే మిగిల్చింది,ప్రస్తుత రాజకీయ పరిస్థితులు  (స్వాతంత్ర సమర సమయంలొ విదేశీ తొత్తులు గా వుండి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ చెరువు లోనికి దాటిన కప్పదాటు బూర్జువా వర్గం గలతీ2:4 సంఘాల్లో ఇదేస్థితి) వృధ్ధాప్యంలో దేవునిరాజ్యం గురించి ప్రార్దించడం కంటే ఎక్కువ నేనేమీచేయలేను అన్నారాయన. భౌతికులు తమ భౌతికులను పరిపాలించుకోనియ్యండి, ఆధ్యాత్మికులు దేవుని రాజ్యం కోసం పనిచేయాలని గాంధీ గారు,నా తండ్రితో సహా అనేక మంది 1947 లోనే కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. దేవునిరాజ్యవిరోధి లూసీఫర్, హిందూ ఉగ్రవాదైన మరాఠీ ఘాడ్సేను ప్రేరేపించి, మహాత్ముణ్ణి మట్టు బెట్టి నప్పుడు, శోకించిన హృదయపు లోతుల్లో నుండి 1949 లో వచ్చిన, నా మొదటి కవితా సంపుటి ఉదయకిరణంఅచ్చయింది.అనేక గాంధీలు భారత గ్రామాల్లో ఉదయించాలన్న అశావాదమే దాని సారాంశం.1952లోస్వచ్చంద పత్రకారునిగావుంటూ అజ్మేర్ప్రభుత్వకళాశాలలోచేరాను.1954లో ఆంగ్లపాఠ్యాంశమైన కొండమీద ప్రసంగం. చదువు తున్నపుడు నిర్ఘాంతపోయాను ఎవరీ ప్రసంగకర్త? అనేక మహాత్ముల/ప్రవక్తల ప్రసంగాలు విన్నాను చదివాను కాని, ఈయన మాట లాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడ లేదే? అనుకుంటూ,అధ్యాయపరిచయాన్ని చూసాను. ప్రసంగకర్త యూదుడైన యేసుక్రీస్తు అని,అతని స్వంత ఇశ్రయేలు ప్రజలే రోమన్ విదేశీ పాలకులచేతికతనప్పగించినప్పుడు ఈ ప్రసంగచక్రవర్తి వధకు అప్పగింపబడిన గొఱ్ఱెవలె మౌనం వహించి సిలువలో వ్రేలాడి మరణించి,తాను ముందునుండే చెబుతున్నవిధంగా,లోకపాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికిగొఱ్ఱెచర్మం-కప్పుకున్న-తోడేళ్ళచే అనేకహింసలు పొంది మూడవ దినాన్న మరణాన్నిజయించి తిరిగి లేస్తానన్నపుడు తనస్వంతఇంటివారి చేతే పిచ్చోడని/దెయ్యంపట్టిన వాడని గధ్ధింపబడిన ఈయేసే నిజంగానే మరణాన్ని జయించడం చూసిన పామర శిష్యులు ముందు నమ్మనప్పటికీ ఆయేసు పునరుత్థానాత్మ వాక్య శక్తితో ప్రపంచంలోని అన్ని భాషల్లో, సిలువవేయబడిన వానిగా ప్రకటించారు, అన్ని రకాల ప్రజల్లో నమ్మబడెను. చదువు తున్న నాకు ముచ్చెమటలు పోసాయి. ఇంతకాలం బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనుకుంటున్న ఈ యేసు తెల్ల ఐరోప వ్యక్తి కాదు మన ఆసియ వాసే, ఆశ్రమంలో ఉదయాన్నేగాంధీగారు బైబిల్ ఎందుకుచదివేవారో ఇప్పుడర్ధ మయ్యింది.(నిజానికి దక్షిణాఫ్రికా లోనే గాంధీ గారికి కొండమీద ప్రసంగం కంఠోపాఠం)అప్పుడే ఓవెలుగు స్వరం ఆ యేసును నేనే నీ ప్రశ్నలకు సమాధానం నేనేఅనడం విని చుట్టూ చూసాను ఎవ్వరూ కనబడలేదు.తబ్బిబ్బై ఆంగ్లభాశాధ్యాపకుని వద్దకు పరుగెత్తాను. యేసుక్రీస్తు దైవమా?” అన్నప్రశ్నకు ఆ నామకార్ధపు కేథలిక్ క్రైస్తవుడు ఉలిక్కిపడి (బహుశా, విధ్యార్ధులకు మతబోధ చేస్తున్నాననే ఆరోపణను తప్పించుకోడానికో లేక తానే రక్షణ లేని మత క్రైస్తవుడవ్వడం వల్లో) తన బిషప్ వద్దకు పంపించాడు.రాజపురోహిత కుమారుణ్ణని ఎరిగి, నీవు బాప్తీస్మ మాస్ లో పాల్గొనే క్రైస్తవునిగా అయితే గాని క్రీస్తు దైవత్వాన్ని అర్ధం చేసుకోలేవన్నడా మహానుభావుడు. సంవత్సరాలుగా బాప్తీస్మ మాస్ లో పాల్గొనే ఆంగ్లభాశా అధ్యాపకునికి అర్ధం కానిది నాకేలా అర్ధం అవుతుంది? ఆయన మాటల్లో తిరకాసు చూసి వెనుతిరిగాను. బహుశా ప్రొటెస్టెంట్ వారికి క్రీస్తు దైవత్వం బాగా తెలిసివుండ వచ్చని దగ్గర్లో వున్న చర్చికి వెళ్ళి వెనుక కూర్చోని చూస్త్తే ఏదో చందాలు సన్మానాలు పదవులు కమిటీలు ధానధర్మాలు క్రిస్మస్ లోతాగి కేరల్స్ పాడే వారు, చివర్లో మొక్కుబడిగా బైబిల్ చదివి ఏదో చెప్పాలనుకొన్న ముసలి పాదిరీ గారికి నా పక్కనే వున్న ఓవ్యక్తి చేయెత్తి గడియారం చూపించే సరికి సభను ముగించడం,బయటకు వచ్చిన వారు పిచ్చాపాటి మాటలాడుకోడం నన్నంతో హతాశుణ్ణి చేసాయి. నేనెవర్నొ చెప్పుకోకుండా ఆ ముసలి పాదిరిని ఏకాంతంగా చాలా సార్లు కలసినపుడు పాడిందే పాడరా పాచిపళ్ళ పాష్టరూ అన్న చందాన విగ్రహారాధికులు నరకం పోతారు నువ్వు బాప్తీస్మం ఎపుడు తీసుకొని సంఘ సభ్యునివౌతావు అన్నాడు. నన్ను నరకంనుండి తప్పించ డంకంటే, నన్ను మతంలో చేర్చి విదేశీ డబ్బు  సంపాదించడం ఆయన ప్రాధమికతగా కన్పించింది. పైపెచ్చు అక్కడ కనిపించే క్రైస్తవు లంతా ఆయా,ప్యూన్,మాలి వంటి ఉద్యోగాల కోసం తెల్ల దొరలమిషన్ కాంపౌండ్లో ఇళ్ళకోసం చేరినభోజనక్రైస్తవులు లేకఈమధ్యనే చదువుకొని పైకొచ్చిన వారిపిల్లలతాలూకు నర్సులుప్రైమరీటీచర్లు క్లర్కులు సైనికు లు.వారి పిల్లలు చాలా మంది నాసహవిద్యార్ధులు. అంతకు ముందు వారితోకలవని నన్నీవిధంగా తమ చర్చీలో చూసి కొని మురిసి పోయారు. కాని నాప్రశ్నలకు ముఖం తెళ్ళబెట్టారు. చార్లేస్ అనే నా సహ విద్యార్ధి ఓ రోజు బండ బూతులు తిడుతూ ఇంకో విద్యార్ధిని కొడుతూ వుంటే, నేనడ్డు పడి ఓ చెంప మీద కొట్టేవానికి నీరెండో చెంపకూడా చూప మన్నాడుగా మన యేసుక్రీస్తుఅన్నాను. మామీద  నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? అని చార్లేస్ నా రెండు చెంపలు పగులగొట్టాడు. ఓరోజు ఎవరు నాతో సెకెండ్ షో సినిమాకి వస్తారని అడిగాను. హిందూముస్లిం అమ్మాయిలు క్షమించండి మా తలిదండ్రులు ఒప్పుకోరు అన్నారు. క్రైస్తవ అమ్మాయిలు మాత్రం మేం రడీ అన్నారు. తలిదండ్రులను మేం లెక్కచేయం అన్నారు. మేంఅగ్రకులాల నుండి వచ్చిన క్రైస్తవులం అంటూ అబద్దాలు చెబుతూ తోటి పేదదళిత రక్తసంభందికి ముఖము తప్పించి తమ ఇంటిలోనికి రానీయని  వారిని,నాకు పరిశుధ్ధాత్మ వచ్చేసింది అంటూ కిచకిచలాడి గొణుగు కుంభనాడ్ మంత్రజ్ఞులు అమాయకులకు ప్రార్ధించి డబ్బు దండడం చూసి, ఓహ్ ఇదా క్రైస్తవ్యం అని జుగుప్సతో దూరంగా పారిపోయా. ఈ కొండమీద  ప్రసంగం కేవలం మాటలగారడి, క్రీస్తొక ఓడిపోయిన వేషధారి, దైవ రాజ్యాన్ని స్థాపించలేకపోయిన మానాన్న,గాంధీ వంటి సామాన్య మానవుడే అని చెప్పి,అప్పటికే స్టూడెంట్ యూనియన్ ఉపాధ్యక్షునిగా ఉన్న నేను నాపరపతి పెంచుకోడానికి(రాజకీయ నాయకుల స్వార్దం ఆదాము స్వభావం గమనించండి) లైబ్రరీలోని బైబిళ్ళన్నీ తెప్పించి బహిరంగ సభలో భారత దేశాన్ని పోర్చుగీసు,ఇంగ్లీషు వారికి 350 సం||లు మనల్ని  బానిసలుగా చేయించిన ఈపుస్తకాన్ని ఏంచెయ్యాలని ప్రశ్నించిన నాకు నాశనంచేయి నాశనంచేయిఅన్నకేకలకు బైబిళ్ళన్నీ చింపి కాళ్ళ్తతో తొక్కి కిరోసిన్ పోసి సిగరెట్ తో నిప్పంటించాను.ఎగసిన మంటలు నాలోని కర్కశత్వానికి  నాకే అద్దంపట్టాయి. తిను,తాగు రేపేమవుతుందో ఎవడిక్కావాలన్న పంధాలోనికి వచ్చేసాను.1957లో రాజస్థాన్ సాహిత్య అకాడమి వారు నన్ను రాజ్యకవి గా సన్మానించినపుడు ముఖ్య అతిధిగా విచ్చేసిన అప్పటి హిందీ దర్శకుడు నటుడు భరత్ భూషణ్ నన్ను తన సినీమాలకు పాటలు వ్రాయించాడు.తరువాత సౌతేలా భాయ్, పాకీజా వంటి చిత్రాల్లోనటించాను. అవిరాష్ట్రపతి అవార్డు లందుకొన్నాయి. మీడియా ఎడారి గులాబిఅని ఉప్పొంగిచింది.ఓ పెళ్ళైన హీరొయిన్ నావెనుక బడి పెళ్ళిచేసుకోకపోతే అత్మహత్యచేసు కొంటానంది. వదిలించి కోవడం కష్టమైంది.చాలా సినిమాల్లో సంపాదించిన డబ్బుతో మెరైన్ డ్రైవ్ లో ఇళ్ళు కొన్నాను. నాతల్లి పెంపకం వల్ల నైతికమానాన్ని కాపాడుకొన్నా సిగరెట్లుస్కాచ్ కు అలవాటు పడ్డాను. మత్తులో సమ సమాజ స్థాపన తుపాకి గొట్టం ద్వారా సాధ్య మని తలంచాను. వృద్ద మిత్రుడైన ఏంశ్‌ నంబూ ద్రిపాడ్(మొట్టమొదటి కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి)నేనురష్యాలో దర్శకకోర్స్ చెయ్యాలని సిఫారసు చేసాడు. కమ్యూనిజం నాన్నిష్ట పడడని నాన్నకి తెలియకుండా పాస్ పోర్ట్ కి అప్లై చేసాను.  ఇంటిల్జెన్స్ ఫైల్లో కమ్యూనిస్టుగా ముద్ర పడి పాస్ పోర్ట్  రావడంలేదని తెలిసి, ఢీల్లీలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని కలుసుకుని అదే రోజు పాస్ పోర్ట్ సంపాదించాను. నన్ను కౌగలించు కొని మిత్రుడైన నాన్న యోగక్షేమాన్ని అడిగిన నెహ్రూగారు ఎక్కడ ఈ విషయాన్ని నాన్నగారితో ప్రస్తా విస్తారో అని భయపడ్డా ను.1961 రష్యా లో ఉన్న మూడో నెలలో నాతల్లి కిడ్నీ సమస్యతో కోమాలో వున్నారని స్వదేశానికి తిరిగి వచ్చాను. నాలుగు రోజుల తర్వాత కళ్ళు తెరచి దేశ స్వతంత్రం కోసం పోరాడిన మేము నిన్ను సినిమాల్లో గంతులు వేసేవానిగా చూడలేము, నిన్ను గర్భంలో పడక మునుపే(మానవ-మాధవ) సేవకు అర్పించాను, ఇకపై సినిమాలు చేయ రాదుఅంది. అయిష్టంగానే సరే నన్నాను. ఓరోజు తల్లిని చూట్టానికి వచ్చిన కలెక్టర్ మిత్రునితో మాట్లాడుతుండగా చిన్నతనం నుండీ తెల్లచీరతో నాకలలో వచ్చేఅమ్మాయే కనిపించింది. ఆమెఇంటికి వెళ్ళాను. ఆమెతండ్రినేను యేసుక్రీస్తు సువార్తికుణ్ణి భక్త్ సింగ్ జతపనివాణ్ణి, నాకుమార్తెను ఓఅవిశ్వాసికి ఇవ్వనుఅన్నాడు. ఈ నల్ల క్రైస్తవుణ్ణి బ్రతిమాలటానికి నాబ్రాహ్మణ సినిమాహీరో తనం అడ్డు చెబుతున్నప్పటికీ ఏదోశక్తి ఏడుసార్లు అడిగేలా చెసింది. తన తండ్రి ఒప్పుకోపోగా ఆమే నాదేవుడునిన్ను పెళ్ళిచేసుకో మంటున్నాడనిచెప్పింది. నేను నాస్తికుణ్ణి, క్రైస్తవ్యం నీమట్టుకే పరిమిత మన్న షరతుతోకలెక్టర్ మిత్రునివద్ద వివాహం రిజిస్టర్ చేసి ఇంటికివెళ్ళి అమ్మా ఈమె నాభార్య నీకోడలు అన్నాను. నోటమాట రాక అవాక్కయ్యింది తేరుకొని రోదిస్తూసినిమాలు మానమన్నానన్నకోపంతో ఈఘాతుకానికి తెగించావా? ”దీనికంటే సినిమాగంతులే నయం గదా!నీ చెల్లెలి భవిశ్యత్తు నాశనం చేసావు. ముఖ్యపుజారి ఇంటికి క్రైస్తవ పని పిల్లను కోడలిగా తెస్తావా అంటూ శోకాలు తీసి ఓనెల నాభార్య ముఖం కూడా చూడలేదు. మరునాడు తెల్లవారున నాప్రక్కలో లేని నాభార్య ఏ అఘాయిత్యానికి పాల్పడిందోనని వెదకిన నాకు ఓమూల తెరువబడిన బైబిల్ ముందు మోకాళ్ళపై కన్నీరు మున్నీరై నీ చిత్తాన్ని నెరవేర్చే సామర్ధ్యం దయచేయి అంటూ బిగ్గరగా విలపించడం విన్నాను. నెల తర్వాత మాఅమ్మ కాళ్ళు ఒత్తు తున్న కోడల్ని నీవు నా కుమార్తెవు ,కొడుక్కంటె నీవే నయంఅంది. నా భార్యకు భక్త్ సింగ్ గారు పెట్టిన హోప్ క్రిస్టినాఅనే పేరును ఆశాఅని మార్చింది. కొన్నినెల్లకు పుష్కర్ పూజార్లు తమ కుమార్తెలు కోడళ్ళతో ఆశానుండి నేర్చుకో అనడం నేనువిన్నాను.1962లో మానాన్న గారి స్నేహితుడైన ప్రసిద్ద పారిశ్రామిక వేత్త్ఘ్డబిర్లా గారు కలకత్తాలో తనవద్ద పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ గా నియమించారు. నాస్కాచ్ సిగరెట్ అలవాట్లు నన్ను పాపినని ఒప్పించినా అగ్రవర్ణగర్వంతో పాపాన్ని దాచుకొని పైపెచ్చు ఆశా చేస్తున్న ఉదయకాలబైబిల్ పఠన  ప్రార్దనలు ఒట్టి బూటకం అని అమెనూ అమె యేసునూ నిందించి ఆమెనెంతో హింసించే వాణ్ణి. నాలో ఏదోఒక దుష్టశక్తి ఆమెను హింసించడానికి ప్రేరేపించడం నేను గమనించాను. కొన్నిరాత్రులు ఆమెను వీధిలో వుంచి గడియ పెట్టాను. రాత్రంతా చలిలోనె నుంచొని ఉదయం నా కాళ్ళమీద పడేది. నా మనశాంతి కోసం కీర్తన23చదవమంది. చదివి పట్టరాని కోపంతో ఆబరువైన హిందీ బైబిల్ ఆమెముఖాన్ని కొట్టగా ఆమెకనుబొమ తెగింది. పల్లెత్తి మాటనలేదు. నా వృద్ద తలిదండ్రులను కంటికిరెప్పలా కాపాడేది. క్లబ్బునుండి నేనెంత ఆలస్యంగా వచ్చినా వేడిఆహారం వడ్డించి తరువాతనే తాను తినేది. ఓరోజు ఉదయం నాబూటుతా ళ్ళు కడుతూ నాపేరుపెట్టిన భక్త్ సింగ్ అంకుల్ కొన్నిరోజుల్నుండే కలకత్తాలో వున్నార్ట. ఈరోజు వెళ్ళి పోతున్నార్ట, దయచేసి సాయంకాలం త్వరగా రండి, మీరాయ్యను చూడాలి అంది. ఈరోజు ప్రపంచ బేంక్ వారితో చర్చలు, త్వరగా రావడం అసంభవం అన్నాను. నాదేవుడు మిమ్మల్ని తీసుకు వస్తాడు అంది, ఎంతో అమాయకంగా. చూద్దాం నీదేవుడు ఎలాతీసుకు వస్తాడో అంటూ అదే బూటుతో పిచ్చికోపంతో తన్నాను. మూతి పగిలి అమ్మా అన్నకేకకు మా అమ్మ మెల్లగా రాగా తమాయించుకొని కాలు తన్నుకొని పడి చిన్న దెబ్బతగిలందంతే అంటూ సోఫాలో అచేతనుణ్ణైన నన్ను కారులో కూర్చోబెట్టింది. దారిలో కుమిలి కుమిలి ఏడ్చాను. పది సంవత్సారలకు ముందు కొండ మీద ప్రసంగం చదువుతున్న పుడు విన్నఅదేస్వరం రెండు గాయపడిన చేతుల్తో కనిపించి నాదృష్టిలో నన్నే స్వనీతిపరుణ్ణనుకుంటున్న నాపాపస్వభావాన్ని నాపాపకార్యాలను ఒప్పించాయి. నాకుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం నా రక్తాన్నంతా కార్చాను.నిన్ను నాప్రేమతో ఆకర్షించుకొంటాను.ఆ ప్రేమ నన్నుదీనుణ్ణి చేసింది. ఆశ్చర్యకరంగా4గంటలకే చర్చలు ఫలవంతంగా ముగిసాయు. సాయంకాలపు విందు, ప్రపంచ బేంక్ ఛైర్మెన్ ఫిలిప్ జూనియర్ గారి అకస్మాత్ అనారోగ్యంవల్ల మరునాటికి వాయిదాపడింది. ఇంటి దగ్గర తయారయ్యి విశ్వాసంతో ఎదురు చూస్తున్న ఆశా నాతో కలసి భక్త్ సింగ్ గారిని కలవడానికి బయలుదేరింది. 2 నిమిషాలముందే ఆయన బొంబాయికి వెళ్ళిపోయారని తెల్సింది. నేనెంతో నిరాశచెందినా ఆషా మాత్రం నిరాశ వెనుక వున్న ఉద్దేశ్యం కోసం దేవునికి వందనాలు చెల్లించింది.1969లో VH దాల్మియా గ్రూప్ లో GM గా చేరాను. ఇంటికి వచ్చి నాతండ్రి కాళ్ళు వత్తుతున్న నాకు ఆయన కళ్ళనిండా నీళ్ళుచూసి కారణం అడిగితే,“సమాజం వర్గవర్ణకులమతఅంట రాని తనం వల్ల కాపరి లేని గొఱ్ఱెల్లా చీకటి మరణఛాయల్లో బీదలుగా వున్నారు. నీవేమో ఈ ఐదుపరిశ్రమలకు GM పనిలో తలమునకలై నీ స్వార్ధసుఖాల్లో ఉంటు న్నావు. గాంధీ గారి రామరాజ్యాన్ని ఎపుడు తీసుకొస్తావు అంటూ కన్నీరు పర్యంతమయ్యారాయన. వెంటనే రాజీనామా చేసిన నన్ను ఢీల్లీలో ప్రధాని ఇందిరా గాంధీ గారు 1972లో పార్లమెంట్ సభ్యునిగా,రాజస్థాన్ PCC జనరల్ సెక్రట్రీగా నియ మించి మధ్యంతర ఎన్నికల ప్రచార భాధ్యత నాకప్పగించారు. ఓరోజు ఎంతోఅలసి నడుంవాల్చి పక్కనేవున్న సాధూ సుందర్ సింగ్ గారు వ్రాసినవిత్ అండ్ వితౌట్ క్రైస్ట్అనే పుస్తకాన్ని చదివాను. బ్రిటిష్ వారిపై కసి తో బైబిల్ని చింపిన సుందర్ సింగ్ అనే ఆధనిక సిఖ్ఖ్హు యువకునికి అశాంతి ఎదురై,దేవుడు తనకు కనిపించని పక్షంలో పంజాబ్ మెయిల్ రైలు క్రింద పడతాడన్న సమయంలో యేసుక్రీస్తు దర్శనమివ్వడం ఆ పుస్తక సారాశం.అదే సమ యంలో ధర్మప్రకాశ్ నా కుమారుడా ఇంకెంత కాలం నన్ను దూరం పెడ్తావ్? ఇంకెంత కాలం నన్ను హింసిస్తావు? నీవు నావాడవు”. గత18 సం||ల్లో ఇది మూడోసారి దైవస్వరం వినడం,కాని ఈ సారి ధైర్యంతెచ్చుకొని,“ప్రభూ నీవు నన్నుప్రేమించటాన్ని పూర్తిగా రుచించానుఅన్నాను. మరి నా దగ్గర నుండి ఎందుకు పారి పోతున్నావుఅన్నాడు ప్రభువు.ప్రభూనిన్ను దూషించిన దుష్టుణ్ణి, నీవాక్యాన్ని కాలరాచి కాల్చిన కామాంధుణ్ణి నీదగ్గరకు రావడానికి ముఖంచెల్లక ధైర్యంచాలడం లేదుప్రభూఅన్నాను. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు ప్రభువు. నేను సిలువలో కార్చిన రక్తం నీకుచాలు అని తన వెలుగుతో నన్ను స్పర్శించాడు. పాప భారం తొలగి కడుగబడిన మనస్సాక్షితో పరలోకపు ఆనందంతో ఆశాను క్షమాపణ అడిగి నిజమైన కుటుంబ యేకత్వాన్ని అనుభ వించడం ప్రారంభించాం. 1975లో ఇందిరాగాంధీగారు ఎమర్జన్సీ విధించారు. 1976 లో గుజరాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి పార్టీఫండ్ అప్పగించడానికి అహ్మదాబాద్ వెళ్ళిన నేను దారిలో బైబిల్ వాక్య బేనర్లు కట్టబడి ఉండడం చూసి కారాపి కనుక్కున్నప్పుడు భక్త్ సింగ్ గారు ఇంకొద్దిసేపట్లో అక్కడ ప్రసంగించబోతున్నారని విని చూద్దామని వేచివున్నాను.ఆలస్యం అవుతుందని వెళ్లిపోబుతున్న నాకళ్ళలోనికే తీక్షణంగా చూస్తూ దగ్గరకువచ్చి కౌగలించుకొని దేవుడు నిన్నిక్కడకు పంపించాడుఅంటూ మోకాళ్ళేసి ప్రార్దన చేసారు.ఆయనే73సం||ల భక్త్ సింగ్ ఛాభ్రా గారని నాకర్దమయ్యింది. నీ సామాన్లెక్కడ అంటూనే వారిస్తున్నా వినకుండా8రోజులక్కడే వుంచేసారు. భక్త్ సింగ్ గారి వాక్యం వింటూ తెరువబడిన ఆకాశాననుభవిస్తూ నన్ను నేనే మరిచాను. వాక్యంచే ఒప్పింపబడిన నేను బాప్తీస్మం కోరగా 7వ రోజు నాకు 16 మే1976లో భక్త్ సింగ్ గారు బాప్తీస్మం ఇచ్చి హస్త నిక్షేపణం చేసారు.రక్షణ, పరిశుధ్ధాత్మ-నింపుదల నిశ్చయతతో  వ్యక్తిగతంగా ఆరాధించి ప్రభువు బల్ల నుండి భక్త్ సింగ్ గారు విరిచిఇచ్చిన రొట్టెరసం త్రాగి అత్మీయమనోనేత్రం తెరువబడిన వాడనై క్రీస్తు దేహంలోనేనొక అవయవా న్నని గుర్తించి నాపట్ల దేవుడు కలిగియున్న ఉన్న త ఉద్దేశ్యాలను భక్త్ సింగ్ గారు చెప్పినప్పుడు విని ఆశ్చర్యపోయాను. 1936లోభక్త్ సింగ్ గారిని అజ్మేర్ లోని క్రైస్తవ సభల్లో ప్రసంగీకునిగా తెల్లబిషప్ లుపిలిచారు.తొంభై శాతం తెల్లబిషప్ లు నిజమైన మారుమనస్సు రక్షణ లేని వారని, కేవలం భారత మిషన్ బంగ్లాల్లో ఆయాప్యూన్ మాలిబట్లర్ల మాలీశ్ సుఖాలకోసం అలవాటు పడ్డారని, మారుమనస్సులేని తెల్లవాడైనా, నల్ల వాడైనా నరకాగ్నికి గురి కావల్సిందేనని నిర్మొహమాటంగా చెప్పి, రాబోవుఉగ్రతను తప్పించుకొనుటకు మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించుడి అని ప్రసంగించినపుడు,తెల్లనల్ల బిషప్ లు కలసి భక్త్ సింగ్ గారిని అక్కడనుండి వెళ్లగొట్టారట. తిరిగి వెళ్లుతున్నాయన పుష్కర్ తీర్థంలో సువార్త ప్రకటిస్తూ కాపరిలేని గొఱ్ఱలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి, ఏ పుష్కర్ సరోవరంలో పాపనాశనానికై స్నానం చేస్తున్నారో దాని పర మార్ధాన్ని వివరించే ఓవ్యక్తిని పుష్కర్ నగరంలోనే లేపా ల్సిందిగాసరోవరతీరంలోమోకాళ్ళేసి కన్నీటితో ప్రార్ధించారట. ఆ నాప్రార్ధనలకు సమాధానమే నీవుఅన్నారు భక్త్ సింగ్ గారు. యెషయా43:1-4 చూపించి నీవు ప్రభుసేవ చెయ్యాలన్నారు. నేను బాప్తీస్మం తీసుకొన్నాననివిని నాన్నగారు రేపోమాపో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాన్ని పోగొట్టుకోడానికి సిద్దమేనా అన్నారు? నీదగ్గర బైబిలుంటే లూకా 14: 26,27 చదివి నిర్ణయం చెప్పు అన్నారు. కొంతసేపు నిశ్చేష్టు ణ్ణయ్యాను. బైబిల్ నాకుక్రొత్త, మరి నాన్నకు ఇంత కంఠోపాఠం ఎలోగో నాకింకా తెలియదు. నీవలా సిలువనుమోసినప్పుడు నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. బాప్తీస్మా నికి ముందు పదవీకాంక్షతో పైకి చెప్పలేని నాఎమర్జన్సీ వ్యతిరేకతను ఇపుడు ప్రతీ పత్రిక సభల్లో దైర్యంగా మాట్లాడి, ఢీల్లీలో ప్రధాని ఇందిరా గాంధీగారు పిలిపించినపుడు ఎమర్జన్సీ దైవచిత్తంకాదని సవినయంగా విన్నవించు కొన్నాను.డిసెంబర్1976 కాలిం పాంగ్ హిమాలయాల్లో జరిగిన పరిశుద్దసమాజ కూడికల్లో ప్రభువు నన్ను రాజకీయాలు వదలి తనను మాత్రమే సేవించాలని ఆజ్ఞఇచ్చి పిలిచారు. 1977జనవరి1న ఢీల్లీలోప్రధాని ఇందిరాగాంధీగారికి నాసాక్ష్యం చెప్పిరాజీనామలేఖ సమర్పించాను. శోహన్లాల్ శర్మగారబ్బాయికి క్రైస్తవ సభల్లో ఏమిపని? బైబిల్ ఎన్నిసార్లు చదివావ న్నారు. ఈమద్యేప్రారంభిచానన్నాను. నేను స్విట్జర్లాండ్లో చదువు కొనేపుడు బైబిల్ మూడు సార్లు పూర్తి చేసాను. యేసు నాతో ఎన్నడూ మాట్లాడలేదే,రాజకీయాలను మానమన్లేదే? ఇకచాలు నీబోదతో నన్ను మార్చే ప్రయత్నం, బుద్దిగా రాజస్థాన్ వ్యవహారాలు చూసుకో వెళ్ళు అంది .లేదమ్మా ఇది నాఅంతిమ నిర్ణయం, నేనికపై క్రీస్తు శిష్యుణ్ణే అని బయటకు వచ్చాను. తర్వాత ఇందిరాఓడి జనతాపార్టీప్రభుత్వం ఆమెను తీహార్ జైల్లోబంధించి కుటుంబసభ్యుల్లోఒకరు మాత్రమే లోనికి అనుమతించబడినపుడు నావృద్దతండ్రి  సంవేదనను అందచేయటానికి వచ్చిన నన్ను రాజీవ్ గాంధీ  తనకుబదులుగా లోనికి పంపించారు. కటకటాల్లో బంధింప బడిన ఆ ఆడసింహాన్ని తండ్రి సంవేదన, దేవుని వాక్యం బైబిల్ తో పరామర్శించి వెనుదిరిగిన నన్ను ప్రార్ధన చేయకుండా వెళ్తావా?”అంది. మోకాళ్ళేసి ప్రార్ధించి వచ్చాను. కొంతకాలంలోనే కుమ్ములాడుకొని కూలిన జనతా ప్రభుత్వం, ఎన్నికల్లో నెగ్గి తన శత్రువులను తిరిగి జైలుకు పంపని ఇందిర, రాజీవులను, దేవుని రాజ్యవిరోధి లూసీఫర్, సిఖ్ఖ్హు,తమిళ ఉగ్రవాదుల ప్రేరేపించి చంపిచినా వారిని రాహుల్, ప్రియాంకారాబర్ట్ గాంధీలు  క్షమించడం కొండ మీదప్రసంగ ఆదర్శమే”. ఇంకా మిగిలిన పిత్రార్జిత కొన్నివందల ఎకరాలను కేజీల వెండి బంగారాలను ప్రభువు చూపించిన పనులకు సమర్పించాము. ప్రతిగా నాన్నగారు 23-12-1986 లో తరువాత అమ్మ ప్రభువును స్వంతరక్షకునిగా అంగీకరించి 93 సం||ల నిండు వృధ్దాప్యంలో ప్రభువు నందు నిద్రించారు. 23-12-2009 ఉదయం 9 గం జైపూర్-బెంగుళూరు ఇండిగో 6151 విమానానికి వచ్చే మన సహో||పండిత  ధర్మప్రకాశ్ శర్మ గారి  73వ జన్మదిన అభినందనకు అందరికీ ఆహ్వానం.

Friday, October 5, 2012

TELUGU CHRISTIAN LYRICS 261 - 273

పాట:261
       స్తుతులనందుకో - స్తుతికి పాత్రుడా
       ఘనతపొందుకో - స్తోత్రార్హుడా
అ.   నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా
       నీకే నీకే నా హృదయార్పణ                                          " స్తుతుల"
   1   నీవంటి దేవుడె లేడు - నీకెవ్వడు సాటిరాడు         "2
       నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ
   2   నీలాంటి ఘనుడెవ్వడు - నీ తోటి సముడెవ్వడు    "2"  
        నీకే నా ఆరాధనా - నీకోసమే ఆలాపనా - నీకే నీకే నా హృదయార్పణ     

పాట:262
    సుభా హో య సామ్‌ - రాత్‌ ఔర్‌ దిన్‌ - తేరాహి నామ్‌  - 2 - #3
    ఈశుమేరే - ఈశుమేరే - 2 బజతారహూ తేరానామ్‌  - 2
    సుభా హో య సామ్‌ - రాత్‌ ఔర్‌ దిన్‌ - తేరాహి నామ్‌  - 2
1. తు హర్‌ దిల్‌ మే - తు రంగత్‌ మే - ఇస్‌ దునియాకే హర్‌ ఎక్‌ తన్‌ మే -
    ఈశు మేరే... - ఈశు మేరే తుహే సబ్‌కా మాలిక్‌ - దిల్‌ సే హే - లేరే తేరేనామ్‌
    బజతారహు తేరానామ్‌               "సుభా హో"
2. తేరే ప్రశంషా ఇస్‌ దిన్‌ గావు - తేరే హి మహిమా సబ్‌ కో సునావు
    రాత్‌ తుహీ... - రాత్‌ తుహి జీవన్‌కా మాలిక్‌ - జబ్‌ సే హే - లేరే తేరేనామ్‌  - 2
    బజతారహు తేరానామ్‌               "సుభా హో"

పాట:263    
     సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి - 2
     ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు          "సుధి"
1. చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ.......2
    పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - 2   "సుధి"
2. కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ.......2
    ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు  - 2   "సుధి"
3. వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ......2
    త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు  - 2          "సుధి"

పాట:264
    సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా
    జీవింతును నిత్యము నీ నీడలో - ఆస్వాదింతును నీ మాటల మకరందము
1. యేసయ్య నీతో జీవించగానే - నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
    నాట్యమాడెను నా అంతరంగము - ఇది రక్షణానంద భాగ్యమే    "సుగుణాల"
2. యేసయ్య నిన్ను వెన్నంటగానే - ఆజ్ఞల మార్గము కనిపించెనే
    నీవు నన్ను నడిపించగలవు - నేను నడువ వలసిన త్రోవలో        "సుగుణాల"
3. యేసయ్య నీ కృప తలంచగానే - నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
    నీవు నాకిచ్చే మహిమయెదుట - ఇవి ఎన్న తగినవి కావే              "సుగుణాల"

పాట:265
   స్తోత్రముల్‌ స్తుతి స్తోత్రముల్‌ - వేలాది వందనాలు
  కల్గుగాక నీకే మహిమ - ఎల్లప్పుడు - స్తుతి స్తోత్రముల్‌
    యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా  (4)
1. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను
    నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను (2)
    యేసే నా సర్వము - యేసే నా సమస్తము  (2)     " యేసయ్యా"
2. పరమును వీడి మానవునిగా భువికి ఏతెంచెను             
    మన పాపములు బాపగా శ్రమలు సహించి రక్తమును కార్చెను (2)
    సిల్వలో బలియాయెను సజీవుడై తిరిగి లేచెను (2)  " యేసయ్యా"

పాట:266
     స్తోత్రింతుము నిను మాదు తండ్రీ - సత్యముతో నాత్మతో నెపుడు 
     పరిశుద్దాలంకారములతో- దర్శించెదము - శరణం ...శరణం
1.  శ్రేష్ట యీవుల నిచ్చినందున - శ్రేష్ట యీవుల యూట నీవే
     త్రిత్వమై యేకత్వమైన త్రి - యేక దేవా శరణం...శరణం          "స్తోత్రింతు"
2.  పాపి మిత్రుడు,పాప నాశుడ - పరమ వాసుడ ప్రేమా పూర్ణడ
     వ్యోమ పీఠుడ, స్వర్గపూజ్యుడ- పరిశుద్దాంగుడ,శరణం..శరణం   "స్తోత్రింతు"
3.  దవళ వర్ణుడ, రత్నవర్ణుడ- సత్యరూపి యనబడువాడ
     నను రక్షించిన రక్షకుండ- నాధా నీకే శరణం ....శరణం          "స్తోత్రింతు"
4.  సంఘమునకు శిరస్సు నీవే - రాజనీకే నమస్కారములు
     ముఖ్యముగను మూల రాయి - కోట్లకొలది శరణం..శరణం      "స్తోత్రింతు"
5.  నీదు సేవకుల పునాదిది - జ్ణానమునకు మించిన తెలివి
     అందముగను కూడుకొనుచు - వేడెదము శరణం ..శరణం        "స్తోత్రింతు"
6.  రాజనీకే స్తుతి స్తోత్రములు - గీతముల మంగళ ధ్వనులు
    శుభము ,శుభము,శుభము నిత్యము - హల్లెలూయ ఆమెన్‌, ఆమెన్‌  "స్తోత్రింతు"

పాట:267
   స్తోత్రబలి స్తోత్రబలీ  మంచి దేవ నీకేనయ్యా
    శుభవేళ ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
1. నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే -2
    నెమ్మది ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా -
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2      "స్తోత్ర"
2. రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి   -2
    మరువని నా స్నేహమా - కలసి సంతోషింతును  -2
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2     "స్తోత్ర"
3. నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి -2
    ఉరికురికి పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2     "స్తోత్ర"
4. వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2
    యేసయ్యా నీ నీడలో దిన దినం జీవింతును  -2
    కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2     "స్తోత్ర"

పాట:268
    స్వస్థపరచు యెహోవానీవే నీరక్తంతో మమ్ము కడుగు యేసయ్యా
    మా ఆరోగ్యం నీవే - ఆదరణ నీవే - ఆనందం నీవేగా  "స్వస్థ"
1. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము వదలి పోవును వ్యాది బాదలన్నీ
    శ్రమపడువారిని సేదతీర్చి సమకూర్చుము వారికి ఘనవిజయం  "స్వస్థ"
2. పాపపు శాపము తొలగించుము అపవాది కట్లను విరిచివేయుము
    క్రీస్తుతో నిత్యము ఐక్యముగా నీ మహిమలో నిత్యము వశింపనిమ్ము  "స్వస్థ"

పాట:269
    షారోను రోజా యేసే - పరిపూర్ణ సుందరుడు
    ప్రేమ మూర్తియని - ఆదరించు వాడని
    ప్రాణ ప్రియుని - కను గొంటిని
    అడవులైనా లోయలైనా - ప్రభు వెంట నేనువెళ్ళెదను
1. యేసుని ఎరుగని వారెందరో వాంచతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2)
    దప్పికతో ఉన్న ప్రభువునకే (2)- శిలువను మోసే వారెవ్వరు
    అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను   "షారోను"
2. సీయోను వాసి జడియకుము పిలిచిన వాడు నమ్మదగిన వాడు (2)
    చేసిన సేవను మరువకా (2) - ఆధరించి బహుమతులెన్నో ఇచ్చును
    అడవులైనా లోయలైనా ప్రభు వెంట నేనువెళ్ళెదను    "షారోను"

పాట:270
     సంతోషం నాకు సంతోషం - యేసు నాలో ఉంటే సంతోషం
     సంతోషం నీకు సంతోషం - యేసు నీలో ఉంటే సంతోషం
     హల్లేలుయా ఆనందమే - ఎల్లవేళ నాకు సంతోషమే 

1. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదువలె పాడనా...
    నాకై రక్తాన్ని చిందించి శుద్దునిగాచేసిన
    యేసంటే నాకు సంతోషం     - 2    || హల్లేలూయా ||
2.  ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేయనా... 
    నాకై ఆత్మను ప్రోక్షించి పరలోకం చేర్చిన
    యేసంటే నాకు సంతోషం   - 2  || హల్లేలూయా||


పాట:271
      హల్లేలూయా పాట - యేసయ్య పాట
      పాడాలి ప్రతి చోట... - పాడాలి ప్రతి నోట
అ.ప.హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (4)
1. కష్టలెన్నో కలిగినా - కన్నీరుయే మిగిలినా
    స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా"2"
2. చెరసాలలో వేసినా- బంధాలు బిగియించినా
    స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా"2"

పాట:272
     హల్లేలూయ స్తుతి మహిమా ఎల్లఫుడు దేవుని కిచ్చెదము
    ఆ... హల్లెలూయ, హల్లెలూయ. హల్లెలూయ   -2    "హల్లేలూయ"
1. అల సైన్యములకు అధిపతియైన - ఆ దేవుని స్తుతించెదము   - 2
    అల సంద్రములను దాటించిన - ఆ యెహోవాను స్తుతించెదము  - 2               "హల్లే"
2. ఆకాశము నుండి మన్నాను పంపిన - ఆ దేవుని స్తుతించెదము   - 2
    బండనుండి మధుర జలమును పంపిన - ఆ యెహోవాను స్తుతించెదము  - 2 "హల్లే"
3. పరలోకము నుండి ధరకేతించిన - దేవుని స్తుతించెదము - 2
    నసియించు దానిని వెదకి రక్షించిన -  యేసుని స్తుతించెదము  - 2                  "హల్లే"


పాట:273
      హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
      సిల్వధరా - పాపహరా - శాంతికరా  "హే ప్రభు"
1. శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధి
    శాంతిస్వరూప జీవనదీపా - శాంతి సువార్తనిధీ       "సిల్వ"
2. తపములు తరచిన నిన్నేకదా - జపములు గొలిచిన నిన్నేగదా
    విఫలులు చేసిన విజ్ఞాపనలకు  -సఫలత నీవెకదా  "సిల్వ"
3. మతములు వెదకిన నిన్నేకదా - వ్రతములుగోరిన నిన్నేగదా
    పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమతి నీవెగదా  "సిల్వ"
4. పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా
    మలమల మాడిన మానవ హృదయము- కలకల లాడెగదా  "సిల్వ"