పాట: 158
ఇదే...నాకోరిక
నవ జీవన రాగ మాలిక -2
యేసులాగా
ఉండాలని - యేసుతోనే నడవాలని -2
నిలవాలనీ..గెలవాలనీ..-2 యేసుతోనే ఉండి పోవాలని
ఇదే...నాకోరిక
నవ జీవన రాగ మాలిక
1. ఈ లోకములో పరలోకంలో
- నీతోనే నివసించాలని
ఇంటా బయటా
యేసునాధుని - కంటి పాపనై వెలిగి పోవాలని -2
ఇదే...నాకోరిక
నవ జీవన రాగ మాలిక
2. యాత్రను ముగించిన
వేళ - ఆరోహణమై పోవాలని -2
క్రీస్తు
యేసుతో సింహాసనము - పైకెగసి కూర్చోవాలని - 2
ఇదే...నాకోరిక
నవ జీవన రాగ మాలిక
పాట: 159
నీకున్న
భారమంత ప్రభుపై నుంచు - కలవర చెందకుమా..
ఆయనె
నిన్ను ఆధరించునూ - అద్భుతములు చేయున్
1. నీతి మంతులను
కదలనీయడు - నిత్యము కాచి నడిపించును
2. మనలను కాచే
దేవుడాయనే - మనకునీడగా ఆయనే ఉండును
3. తల్లి తండ్రి
విడచినను - ఆయనే మనలను హత్తుకొనును
4. ప్రభువు మన
పక్షమైయుండగా - ఎదురు నిలువ గల వాడెవ్వడు
5. ప్రభుకు జీవితం
సమర్పించెదం - ఆయనే అంతా సఫలం చేయును
6. మనకున్న భారమంతా
ప్రభుపై నుంచెదము కలవర చెందకుమా
ఆయనే
మనలను ఆధరించును - అద్భుతములు చేయును..
పాట: 160
బంగారం కన్న
ఎంతో శ్రేష్టమైనది - పరిశుద్ధమైన బైబిల్ గ్రంధము -2
1. గ్రంధాలలో అది రాజ
గ్రంధము - వేధాలలో అది సత్యవేదము -2
నిజమైన
మార్గము చూపు దీపము -2
హల్ల్లేలుయా..
హల్లేలుయా..హల్లేలుయా..హల్లెలూయా.. "బంగా"
2. బుద్దిహీనులకు
జ్ణానమిచ్చును - యవ్వనులకు ఉపదేశమిచ్చును -2
బాగుగ
పఠియించి మేలు పొందుము -2 "హల్లే"
3. దేవుని వాక్యమును
ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదిచ్చును -2
నీ భాధలలో
నిన్ను ఆదుకొనును -2 "హల్లే"
4. నీ పాప జీవితమును
మార్చివేయును - పాపము చేయకుండ కాపాడును -2
నీ
మార్గములను వెలిగించును -2 "హల్లే"
5. భూమి,ఆకాశములు
గతియించును - దేవుని మాటలు గతియింపవు -2
అవియన్ని
నిజముగ నెరవేరును -2 "హల్లే"
పాట: 161
బంగారు
నగరిలో నాకొరకు ఇల్లు - కట్టేను నాయేసు రాజు
సుందరమైన
నగరం - రత్నరాసుల పరమపురం
1. నీవును యేసుని
అంగీకరించిన - కట్టును నీకును ఇల్లు
భాధలు
లేని నగరం - రోధన లెరుగని పరమపురం
2. తానుండె చోటుకు
కొనిపోవుటకును - రానుండె నాయేసు రాజు
ఆకలి
కాని నగరం - చీకటి కానని పరమపురం
పాట: 162
వచ్చుచుండెన్
త్వరలోనే - రాజుల రాజుగా యేసయ్యా
1. తుఫాను వెంబడి
తుఫానులు - ఎన్నడు ఎరుగని సునామియు -2
గుర్తించితివా
ఇకనైనా యేసుని రాకడ సూచనలు
2. వరదల వెంబడి
వరదలతో - అనేక ప్రాంతపు కరువులను -2
గుర్తించితివా
ఇకనైనా యేసుని రాకడ సూచనలు
3. ఎన్నడు లేని
రోగములు - ధారుణమైన మరణములు -2
గుర్తించితివా
ఇకనైనా యేసుని రాకడ సూచనలు
4. భయంకరమైన
బాంబులతో - యుద్ధము వెంబడి యుద్ధములు -2
గుర్తించితివా
ఇకనైనా యేసుని రాకడ సూచనలు
5. అతి తరచుగ
భూకంపములు - ధారుణమైన రోధనలు -2
గుర్తించితివా
ఇకనైనా యేసుని రాకడ సూచనలు
పాట:163
ప్రేమా...యేసు
నీ ప్రేమ....ప్రేమా....ఉన్నతా ప్రేమా....
1. లోకములు మారిననూ -
మారనీ ప్రేమా
సంద్రములు
చల్లార్చని - యేసు నీ ప్రేమా
2. తల్లి బిడ్డను
మరచినా - మరువనీ నీప్రేమా
ఆది అంతము
లేని ప్రేమ - యేసు నీ ప్రేమ
3. పాపులను రక్షించె -
కల్వరి ప్రేమ
నిన్న నేడు
ఏకరీతిన - ఉన్న ప్రేమా
4. నింగి నేలా మారిననూ
- మారనీ ప్రేమా
డంబములేని
శాశ్వత ప్రేమ - యేసు నీ ప్రేమా
పాట:164
స్తోత్రబలి
స్తోత్రబలీ మంచి దేవ నీకేనయ్యా
శుభవేళ
ఆనందమే నాతండ్రీ నీ చిరుపాదమే
1. నిన్నటి బాధలంతా - నేటికి మాయమయ్యే -2
నెమ్మది
ఉదయించే - అది శాశ్వతమైనదయ్యా -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
2. రేయంతా కాచితివి - మరుదినమిచ్చితివి -2
మరువని
నా స్నేహమా - కలసి సంతోషింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
3. నీసేవ మార్గములో - ఉత్సాహం నొసగితివి -2
ఉరికురికి
పనిచేయ - నాకారోగ్యమిచ్చితివి
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
4. వేదన ధుఖ:మైనా - ఎన్నడు విడదీయదు -2
యేసయ్యా
నీ నీడలో దిన దినం జీవింతును -2
కోటి, కోటి స్తోత్రం డాడి (తండ్రి)- 2 "స్తోత్ర"
పాట:165
నావన్ని
అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ
నావన్ని
కృపచేత నీవలన నొందిన - భావంబునను నేను బహుదైర్యమొందెద
1. నీకు నా ప్రాణము - నిజముగ నర్పించి
నీకు
మీదుగట్టి - నీ కొరకు నిల్పెద
2. సత్యంబు నీ ప్రేమ - చక్కగా మధి బూని
నిత్యంబు
గరముల - నీ సేవ జేసెద
3. నీ సేవ జరిగెడు - నీ ఆలయమునకు
ఆశచే
నడిపించు - మరల నా పదములు
4. పెదవులతో నేను - బెంపుగ నీ వార్త
గదలక
ప్రకటింప - గలిగించు దృడభక్తి
5. నా వెంబడి కనకంబు - నా తండ్రి గైకొనిమీ
యావంత
యైనను - నాశించ మదిలోన
6. నీవు నా కొసగిన - నిర్మల బుద్దిచే
సేవ జేయగ
నిమ్ము - స్థిరభక్తితో నీకు
7. చిత్తము నీ కృపా - యత్తంబు గావించి
మత్తిల్ల
కుండగ - మార్గంబు దెలుపుము
8. హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి
పదిలంబుగా
దాని - బట్టి కాపాడుము
పాట:166
సిల్వలో నాకై కార్చెను యేసు
రక్తము
శిలనైన
నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
అమూల్యమైన
రక్తము యేసు రక్తము
1. సమకూర్చు నన్ను
తండ్రితో యేసు రక్తము
సంధి చేసి
చేర్చునుయేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును
తండ్రితో యేసు రక్తము
2. సమాధాన పరచును యేసు
రక్తము
సమస్యలన్ని
తీర్చును యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
సంపూర్ణ
శాంతినిచ్చును యేసు రక్తము
3. నీతి మంతులుగా
చేయును యేసు రక్తము
ధుర్నీతినంత
బాపును యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
నిబంధన
నిలుపును యేసు రక్తము
4. రోగములను బాపును
యేసు రక్తము
దురాత్మన్
పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము
ప్రభు యేసు రక్తము
శక్తి బలము
నిచ్చును యేసు రక్తము
పాట:167
నేసాగెద
యేసునితో - నా జీవిత కాలమంతా
1. యేసులో గడిపెద - యేసుతో నడిచెద
పరమున
చేరగ నే వెళ్ళెదా - హానోకుతో సాగెదా..ఆ "నేసాగెద"
2. తల్లి మరచిన తండ్రి విడచినా - బందువులే
నను
వెలివేసినా - బలవంతునితో సాగెదా..ఆ "నేసాగెద"
3. లోకపు శ్రమలు - నన్నెదిరించినా - కఠినులు రాళ్ళతో
హింసించినా
- స్తెఫనువలె సాగెదా..ఆ "నేసాగెద"
పాట:168
పరమ
జీవము నాకునివ్వ - తిరిగి లేచెను నాతోనుండ
నిరంతరము
నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును
"యేసు
చాలును చాలును - యేసు చాలును చాలును"
"ఏ సమయమైన - ఏ స్థితి కైన -
నాజీవితములో యేసు చాలును"
1. సాతాను శోధన లధికమైనా - సొమ్మసిల్లక సాగి
వెళ్ళెదను
లోకము
శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను
2. పచ్చిక బయలలో పరుండచేయున్ - శాంతి జలము చెంత
నడిపించును
అనిశము
ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలలో నను కాపాడును
3. నరులెల్లరు నను విడిచినను - శరీరము క్రుళ్ళి కృషించినను
హరించినన్
నా ఐశ్వర్యము - విరోధివలె నను విడచినను
పాట:169
ప్రార్ధన
వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా
1. శ్రేష్టమైన భావము గూర్చి - శిష్య బృందముకు
నేర్పితివి
పరముడ
నిన్ను ప్రణుతించెదను - పరలోక ప్రార్ధన నేర్పుమయా
2. పరమ దేవుడవని తెలసి - కరములెత్తి జంటగ మోడ్చి
శిరమును
వంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా
3. దిన,దినంబు చేసిన సేవ దైవచిత్తముకు సరిపోవ
దీనుడనయ్యా
దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా
4. శత్రుమూక నిను చుట్టుకొని సిలువ పైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా
పాట:170
పాపిని
యేసు ప్రభో నే పాపిని యేసు ప్రభో
నీ
రక్తపు ధారలచే నను కడుగుము యేసుప్రభో
1. పాపము మోసితివే - నా శాపము బాపితివే
నీ
మహిమకు పిలచితివే - నీకు స్తోత్రము యేసు ప్రభో
2. చిందిన రక్తమున - నే
పొందిన స్వస్థతను
రా
నంటిని నీ దరికి - మన్నిచుము యేసు ప్రభో
3. మంటిని యేసు ప్రభో - కనుగొంటిని నీకృపను
రా
నంటిని నీదరికి - నను గావుము యేసు ప్రభో